నీరో చక్రవర్తి.. వైసీపీకి చుక్కలే.. ఎన్టీఆర్ కు క్లాస్.. ఢిల్లీకి సీఎం.. టాప్ న్యూస్@7PM
posted on Nov 20, 2021 @ 6:34PM
సీఎం జగన్ ఏరియల్ సర్వే పేరుతో గాల్లో తిరుగుతున్నారని, నేలకు దిగితే జనం వరద కష్టాలు కనిపిస్తాయని టీడీపీ నేత నారా లోకేష్ సూచించారు. రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించుకుని శాడిస్టిక్ ఆనందం పొందారని మనం చరిత్ర పుస్తకాలలో చదువుకున్నామని తెలిపారు. ఇప్పుడు నీరోకి మరో రూపమైన జగన్‌రెడ్డిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. రాయలసీమ మొత్తం అకాలవర్షాలకు అల్లకల్లోలమైతే కనీసం అటువైపు కన్నెత్తి చూసే ఆలోచన కూడా జగన్‌రెడ్డికి రాలేదని తప్పుబట్టారు.
-------
అసెంబ్లీలో శుక్రవారం మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు కుటుంబంపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేయడంపై నందమూరి కుటుంబం తీవ్రంగా స్పందించింది. చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి అండగా నందమూరి కుటుంబం నిలిచింది. శనివారం మీడియా సమావేశంలో తమ మనోభావాలను వ్యక్తం చేశారు. జరిగిన పరిణామాలు దురదృష్టకరమైనవని వారు అన్నారు. వ్యక్తిగత అజెండాగా పెట్టుకుని వైసీపీ నేతలు మాటల దాడి చేశారని మండిపడ్డారు.
------
ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి తప్పుగా మాట్లాడిన వారికి పుట్టగతులు ఉండవని అన్నారు. ఎన్టీఆర్ కుమార్తె గురించి వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలను చూసి సభ్యసమాజం తలదించుకుంటోందని అన్నారు. త్వరలోనే వైసీపీ నేతలకు అసలు సినిమా చూపిస్తామని చెప్పారు.
--------
జూనియర్ ఎన్టీఆర్ ఏపీ అసెంబ్లీలో జరిగిన ఘటనపై స్పందించారు. రాజకీయాల్లో విమర్శలు చేసుకోవడం సర్వసాధారణమని, విమర్శలు ప్రజాసమస్యలపైనే జరగాలన్నారు. వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలను పక్కనపెట్టి వ్యక్తిగత దూషణలకు దిగడం సరికాదని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ముఖ్యంగా మన ఆడపడుచుల గురించి పరుషపదజాలంతో మాట్లాడడం అరాచక పరిపాలనకు నాంది పలుకుతుందన్నారు
---------
జూనియర్ ఎన్టీఆర్‌పై టీడీపీ నేతలు, శ్రేణులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ఏపీ అసెంబ్లీలో వైసీపీ నేతలు నారా భువనేశ్వరిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఇలాగేనా స్పందించేది అని దుమ్మెత్తిపోస్తున్నారు. మీ మేనత్త భువనేశ్వరిని అనకూడని మాటలు అని మానసిక క్షోభకు గురిచేస్తే.. చంద్రబాబు నాయుడు కన్నీరు మున్నీరుగా విలపిస్తే జూనియర్ ఎన్టీఆర్‌కు చీమైనా కుట్టలేదా? అని ప్రశ్నిస్తున్నారు.
---
జూనియర్ ఎన్టీఆర్‌పై అభిమాని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబంపై ఏపీ అసెంబ్లీలో జరిగిన తీరుపై జూనియర్ ఎన్టీఆర్ సరిగా స్పందించలేదని అన్నారు. అసలు స్పందించకుండా ఉంటే బాగుండేదని సూచించారు. ఎన్టీఆర్ అనే పదంతో పేరు ప్రతిష్టలు సంపాదించిన తమరు స్పందించిన తీరు బాగోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కర్ర విరగదు.. పాము చావదు’ అనే సామెతగా జూనియర్ ఎన్టీఆర్ స్పందన ఉందని అభిమాని క్లాస్ తీసుకున్నారు.
-------
యాసంగిలో ధాన్యం కొనుగోలుతో కేంద్రంతో తేల్చుకుంటామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. చివరి ప్రయత్నంగా మరోసారి ఢిల్లీకి వెళ్తున్నామని చెప్పారు..ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం వైఖరిని ఎండగట్టారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వరిధాన్యం కొనుగోలు మీద జరుగుతున్న వ్యవహారంలో ఎన్నిసార్లు నిరంతరంగా డిమాండ్ చేసినా కేంద్రం నుంచి ఉలుకూ లేదు పలూకు లేదు. ఎటువంటి సమాధానం కూడా వస్తలేదు
-------
మంబయి క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ ఖాన్ కు బాంబే హైకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది. ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ సంబంధిత నేరాలకు పాల్పడినట్టు ఎలాంటి సానుకూల ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అరెస్టయిన సమయంలో ఇచ్చిన వాంగ్మూలాలు చెల్లుబాటు కావని నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరోకు తేల్చి చెప్పింది.
-----
చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ధోనీ, చెన్నై జట్టు యజమాని శ్రీనివాసన్ ఐపీఎల్ ట్రోఫీని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కు అందించారు.ఈ సందర్భంగా ధోనీని, చెన్నై సూపర్ కింగ్స్ జట్టును, ఫ్రాంచైజీ యాజమాన్యాన్ని సీఎం స్టాలిన్ అభినందించారు. ధోనీ జార్ఖండ్ కు చెందినవాడే అయినా తమిళనాడు ప్రజల కోసం వచ్చినట్టుందని వ్యాఖ్యానించారు.
-------
సినీ దర్శకుడు సురేందర్ రెడ్డి కరోనా బారిన పడ్డారు.'ఏజెంట్' సినిమా కోసం సురేందర్ రెడ్డి యూరప్ కు వెళ్లారు. ప్రస్తుతం యూరప్ లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్న సంగతి తెలిసిందే. అక్కడే ఆయన కరోనా బారిన పడడంతో అక్కడే సెల్ఫ్ క్వారంటైన్ లో వున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు చిత్ర యూనిట్ సభ్యులు తెలిపారు.
-------