జగన్ పై పవన్ పంచ్.. వైసీపీ నేత రాసలీలలు.. కిషన్ రెడ్డి కౌంటర్.. టాప్ న్యూస్@7PM
posted on Nov 13, 2021 @ 6:43PM
ఏపీ మినీ పల్లె పోరు సిద్ధమైంది. ఆదివారం మిగిలిపోయిన గ్రామ పంచాయితీలకు ఎన్నికల నిర్వహణకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఎన్నికల సన్నాహకాలపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్‌ఈసీ నీలం సాహ్ని సమీక్ష నిర్వహించారు. మొత్తం 69 స్ధానాల్లో సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇప్పటికే 30 స్ధానాలు ఏకగ్రీవం అయ్యాయి. 36 పంచాయితీల్లో ఆదివారం సర్పంచ్ స్ధానాలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.
----------
ఎయిడెడ్ సంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
--------
మున్సిపల్ ఎన్నికల్లో వాలంటీర్లు హల్ చల్ చేస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లకు ఓట్ల సిప్పులతో పాటు వైసీపీ కర పత్రాలు పంపిణీ చేస్తున్నారు. వైసీపీకి ఓటు వేయకుంటే పథకాలు తీసేస్తామంటూ తీవ్ర స్థాయిలో బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇలాగే ఓ వాలంటీర్.. ఓటర్లను బెదిరిస్తున్న సమయంలో టీడీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజేతారెడ్డి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇలా ఎందుకు చేస్తున్నారంటూ ప్రశ్నించారు.
-----------
ఎయిడెడ్ సంస్థల విలీనం, ఉద్యోగుల అప్పగింతపై ఏపీ ప్రభుత్వం తాజాగా నాలుగో ఆప్షన్ ఇచ్చిన నేపథ్యంలో విమర్శలు వస్తున్నాయి. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ అంశంపై తీవ్రస్థాయిలో స్పందించారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై ఇచ్చిన జీవోలను వెంటనే రద్దు చేయాలని, గ్రాంట్ ఇన్ ఎయిడ్ కొనసాగించాలని డిమాండ్ చేశారు.
--------
కుప్పం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రాసలీలల వీడియో వైరల్‌గా మారింది. ఎన్నికల వేళ ఈ అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే వీడియోలో ఉంది తాను కాదని, టీడీపీ శ్రేణులే దానిని వైరల్ చేశారంటూ సుధీర్ ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలను టీడీపీ నేతలు ఖండించారు. వీడియోను ఫోరెన్సిక్‌కు పంపితే అన్ని నిజాలు బయట పడతాయని టీడీపీ నేత రాజు అన్నారు.
----------
ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ ఢిల్లీ వచ్చి కేంద్రంతో ఎందుకు మాట్లాడటం లేదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల తర్వాత దళితబంధు పథకం అమలు చేస్తామన్న సీఎం మాటలు ఎటుపోయాయన్నారు. గిరిజన, బీసీ, మైనారిటీ బంధు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం మేరకే కేంద్రం ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని ఆయన తెలిపారు. తెలంగాణ ధాన్యాన్ని కొనుగోలు చేయబోమని కేంద్రం ఎప్పుడూ చెప్పలేదన్నారు
------------
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆరోగ్య రంగ నిధులను కేంద్ర ప్రభుత్వం నిలిపివేసింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయిలో వైద్య సదుపాయాల అభివృద్ధికి.. 19 రాష్ట్రాలకు కేంద్రం రూ.8453.92 కోట్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏపీకి రూ. 488.16 కోట్ల ఆరోగ్య నిధులను కేంద్రం విడుదల చేసింది. అయితే తెలంగాణకు నిధులను నిలిపివేసింది. నిధుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపకపోవడం వల్లే ఇలా జరిగిందని కేంద్రం చెబుతోంది
-------------
రైతుల కోసం తాను దీక్షచేస్తే సీఎం కేసీఆర్‌కు ఎందుకంత భయం? అని షర్మిల ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌టీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతు వేదన దీక్షను ముగించారు. షర్మిల మాట్లాడుతూ లోటస్‌పాండ్‌లో దీక్షకు అనుమతి లేదని పోలీసులు అడ్డుకుంటున్నారని దుయ్యబట్టారు. స్టేజ్ వేయనివ్వడం లేదు, వేసినా తీసేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో పోలీసు జులుం నడుస్తోందన్నారు షర్మిల.
--------
కర్ణాటకను కుదిపివేస్తున్న బిట్‌కాయిన్ స్కామ్‌పై తాజాగా కాంగ్రెస్ పార్టీ మాజీ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. బిట్‌కాయిన్ స్కామ్ చాలా పెద్దదని, అతిపెద్ద గూడుపుటానీని బిట్‌కాయిన్ చాలా వరకు కప్పి ఉంచిందని అన్నారు. తన ట్విట్టర్ ద్వారా స్పందించిన రాహుల్ గాంధీ.. పార్టీ పేరు, వ్యక్తుల పేర్లు ప్రస్తావించకుండానే కర్ణాటక ముఖ్యమంత్రి బొమ్మై, బీజేపీలను టార్గెట్ చేస్తూ ఈ ట్వీట్ చేశారని నెటిజెన్లు అంటున్నారు.
----
మణిపూర్‌లో మిలిటెంట్లు మరోసారి రెచ్చిపోయారుచురాచాంద్‌పూర్ జిల్లా సింఘాట్ సబ్ డివిజన్ పరిధిలో దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో అసోం రైఫిల్స్ యూనిట్‌కు చెందిన కమాండింగ్ అధికారి విప్లవ్ త్రిపాఠి, ఆయన భార్య అనూజ, కుమారుడు అబీర్, మరో నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. కమాండింగ్ అధికారి కల్నల్ విప్లవ్ త్రిపాఠి తన కుటుంబ సభ్యులు, క్విక్ రియాక్షన్ టీమ్‌తో కలిసి కాన్వాయ్‌లో వస్తుండగా ఈ దాడి జరిగింది.