దిగొచ్చిన జగన్.. ఒక్క డీఏ రాలే.. కేసీఆర్ కు రైతులు ఉసురు.. టాప్ న్యూస్@ 1PM
posted on Nov 13, 2021 @ 11:57AM
ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డికి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఎయిడెడ్ విద్యాసంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 35, 42, 51 జీవోలనుఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్యార్థి సంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గిన రాష్ట్ర ప్రభుత్వం 4 ఆప్షన్లతో మెమో ఇచ్చిందన్నారు. ఈ మెమో వల్ల విద్యార్థులకు, యాజమాన్యాలకు మధ్య వివాదం తలెత్తే పరిస్థితి ఉందని తెలిపారు. ఎడిట్ విద్యాసంస్థల విలీన ప్రక్రియ వల్ల పేద, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్నారు.
--------
వైసీపీ ప్రభుత్వం వచ్చాకా ఒక్క డీఏ కూడా రాలేదని ఏపీ జేఏసీ అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. పీఆర్సీ నివేదిక కూడా తమకు ఇవ్వలేదన్నారు. తాము అధికారంలోకి వస్తే వారంలోనే సీపీఎస్ రద్దు అన్నారని... ఇప్పటికీ రద్దు కాలేదన్నారు. కమిటీలు కాలయపనకే గానీ.. ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కోసం కాదన్నారు. పీఆర్సీ నివేదికపై
అధికారుల కమిటీ పరిశీలనపై తమకు నమ్మకం లేదన్నారు బోప్పరాజు.
--------
తెలంగాణ సీఎం కేసీఆర్, వారి మంత్రి వర్గం ఏపీపై అవాకులు, చవాకులు మాట్లాడటం మంచి పద్ధతి కాదని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అన్నారు. చంద్రబాబుకు ముణి శాపం ఉంది నిజం మాట్లాడితే తల వేయి ముక్కలవుతుందని గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి చెప్పారని తెలిపారు. చంద్రబాబు అధికారంలో ఉంటే ఒకలా మాట్లాడుతారని, అధికారంలో లేకపోతే ఇంకోలా
మాట్లాడుతారని విమర్శించారు. కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధిస్తారని స్పష్టం చేశారు.
---------
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలంలో దారుణం జరిగింది. ఇద్దరు బాలికలపై చర్చి పాస్టర్ ప్రసన్న కుమార్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. విషయం తెలిసిన తల్లిదండ్రులు పాస్టర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం బయటకు రాకుండా మధ్యవర్తుల ద్వారా పాస్టర్ పంచాయతీ నిర్వహించాడు. కాగా విషయం తెలిసిన పోలీసులు పాస్టర్‌ను అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపులకు పాల్పడిన పాస్టర్ ప్రసన్న కుమార్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.
--------
కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లి శ్రీ భువనేశ్వరీ పీఠం నూతన పీఠాధిపతిగా శ్రీ శ్రీశ్రీ కామలానంద భారతీ స్వామి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఉంగుటూరు మండలం ఆత్కూరులో స్వర్ణ భారత్ ట్రస్ట్‌లో స్వామి కమలానంద భారతీ స్వామికి పట్టాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్దేశ్వరానందభారతీ స్వామి ముఖ్య
అతిథిగా హాజరయ్యారు. వివిధ పీఠాధిపతులు, బ్రాహ్మణ సంఘ నేతలు, భక్తులు కార్యక్రమంలో పాల్గొన్నారు.
---------
ఆరోగ్యశాఖను బలోపేతం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి హరీష్ రావు తెలిపారు. శనివారం నీలోఫర్ ఆస్పత్రిలో 100 పడకల ఐసీయూ వార్డును మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ కరోనా సెకండ్ వేవ్ తర్వాత ఆస్పత్రులను బలోపేతం చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు రూ.18 కోట్లు అందించామని చెప్పారు. రూ.10 వేల కోట్లు
కేటాయించి ఆరోగ్యశాఖను అభివృద్ధి చేశామని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు మరింత విశ్వాసం పెంచాలన్నారు.
------
మూడు నల్ల చట్టాలకు కారణమే కాంగ్రెస్ అని.... దాన్ని ఇప్పుడు మోడీ అమలు చేస్తున్నారని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఖర్మ కాలి అది ఇప్పుడు మోడీ మెడకు చుట్టుకుందని తెలిపారు. చట్టాలకు కాంగ్రెస్ పార్టీనే ఆద్యులని బీజేపీ ఎదురు దాడి చేయొచ్చన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తుచేశారు. బీజేపీ నేతలకు అధ్యయనం చేసే తెలివి లేదని
విమర్శించారు.
-------
హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితాలపై శనివారం ఏఐసీసీ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఢిల్లీ వార్ రూమ్‌లో టీకాంగ్రెస్ నేతలతో కేసీ వేణుగోపాల్ సమీక్ష చేపట్టారు. టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌తో రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్, వి.హనుమంతరావు, సీతక్క సమావేశానికి హాజరయ్యారు.
--------
మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందారు. బాణం బాంబులను పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదం జరిగింది. మావోయిస్టు కేంద్ర కమిటీలో టెక్ టీంకు రవి సభ్యులుగా ఉన్నారు. రవి చనిపోయిన సంవత్సరన్నర తర్వాత విషయాన్ని మావోయిస్టు కేంద్ర కమిటీ ప్రకటించింది. జార్ఖండ్‌లోని మారుమూల ప్రాంతంలో రవి మృతి చెందినట్లు మావోయిస్టు కేంద్ర
కమిటీ ప్రకటించింది. టెక్నికల్ టీమ్‌లో కీలక సభ్యుడిగా రవి కొనసాగారు.
----
ప్రపంచంలోని టాప్ టెన్ వాయు కాలుష్య నగరాల జాబితాలో భారతదేశంలోని మూడు నగరాలు చేరాయి. శనివారం దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం గణనీయంగా పెరిగింది.శనివారం ఢిల్లీలో గాలి నాణ్యత 556 ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ వద్ద (ఏక్యూఐ) నమోదైంది. నోయిడాలో 405 ఏక్యూఐ, ఘజియాబాద్ లో 427ఏక్యూఐ వద్ద ఉంది.