టాప్ న్యూస్ @ 1PM
posted on Oct 6, 2021 @ 12:35PM
వైఎస్ కుటుంబంపై కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2004లో రాజశేఖర్ రెడ్డిని సీఎం చేయడమే కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని వ్యాఖ్యానించారు. వైఎస్ సీఎం కాకపోతే...నేడు జగన్ సీఎం కాలేరన్నారు. వైసీపీ వలన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరిగిందని తెలిపారు. విశాఖ, గుంటూరుకు త్వరలోనే రాహుల్ గాంధీ వస్తారని... స్టీల్ ప్లాంట్, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు పలుకుతారన్నారు.
-----
వైసీపీకి డబ్బు పైచ్యం పట్టుకుందని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు బోండా ఉమా వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అన్ని విధాలుగా లూటీ చేస్తున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వ్యాపారంలో ముమ్మాటికి వైసీపీ నాయకుల హస్తం ఉందని ఆరోపించారు. ఏపీని డ్రగ్స్, గంజాయికి వైసీపీ హబ్‌గా మార్చిందని... దేశంలో ఎక్కడ డ్రగ్స్, గంజాయి దొరికినా దాని మూలాలు ఏపీ ఉన్నాయన్నారు. వైసీపీ నాయకుల అండతోనే లక్షల టన్నులు గంజాయి పండిస్తున్నారనితెలిపారు
----------
సమయం వచ్చినా ప్రశ్నించాల్సిన ఉద్యోగ సంఘాల నేతలు మౌనంగా ఉండడం దేనికి సంకేతమని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జవహర్ ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 36 నెలలుగా పీఆర్సీ కాలం వృధా అయిందన్నారు. ఏడాది కాలంగా నివేధిక కోల్డ్ స్టోరేజికే పరిమితమయితే ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడరెందుకని నిలదీశారు. ఐదు డిఏ బకాయిల సంగతే మరిచారన్నారు
------
శ్రీశైలంలోని భారత్ పెట్రోల్ బంక్‌లో దొంగనోట్ల కలకలం రేగింది. పెట్రోల్ పోయించుకున్న యాత్రికులు..పెట్రోల్ బంక్ సిబ్బందికి రెండువందల నోట్లు, వందనోట్లు దొంగ నోట్లు ఇచ్చి వెళ్లారు. కొద్దిసేపటికి దొంగనోట్లను గుర్తించిన పెట్రోల్ బంక్ సిబ్బంది కారు నంబర్ గుర్తించి కారును వెంబడించి పట్టుకున్నారు. యాత్రికుల వద్ద ఇంకా కొన్ని దొంగనోట్లు ఉన్నట్లు సిబ్బంది గుర్తించింది. అయితే కారులో ఉన్న యాత్రికులు దొంగనోట్లు చింపేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు.
----
రాయలసీమ యునివర్సిటీలో ఆందోళనలో పాల్గొన్న ఐదుగురు బీటెక్ విద్యార్థులను సస్పెండ్ చేయడం దుర్మార్గమని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్ గోపాల్ అన్నారు. సస్పెన్షన్ ఎత్తేయకపోతే విద్యార్థి సంఘాలతో కలిసి ఆందోళనలకు పిలుపునిస్తామని హెచ్చరించారు. విద్యార్థులు తలుచుకుంటే వైసీపీ ప్రభుత్వమే సస్పెన్షన్ అవుతుందన్నారు. వైస్ ఛాన్సలర్లు వైసీపీ కౌన్సిలర్లుగా వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు.
-----
చౌటుపల్లి ఎత్తిపోతల, చనాకా కొరాటా ప్రాజెక్టుతో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధంలేదని గోదాదరి నది యాజమాన్యం బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేస్తూ లేఖ రాసింది. ఈ రెండు తమ నికర జలాల్లో ఉన్నాయని పేర్కొంది. చౌటుపల్లిని ఉమ్మడి రాష్ట్రంలోనే చేపట్టి పూర్తి చేశారని, ఆరేళ్లుగా ఈ ప్రాజెక్టు పనిచేస్తోందన్నారు. గెజిట్‌లో చనాకా, కొరాటా ప్రాజెక్టుకు ఆమోదం ఉందనే విషయాన్ని పొందుపరిచారని తెలిపారు.
---
హైదరాబాద్ లోని హెటిరో డ్రగ్స్ కార్యాలయంలో ఐటీ అధికారులు దాడులు చేపట్టారు. బుధవారం ఉదయం నుంచి దాడులు కొనసాగుతున్నాయి. 20 ఐటీ బృందాలు సోదాల్లో పాల్గొన్నాయి. హైదరాబాద్‌తో పాటు మరో మూడు ప్రదేశాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఏకకాలంలో ఆఫీసులు - డైరెక్టర్ల ఇళ్లలో తనిఖీలు జరుగుతున్నాయి.
---------
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమైన ప్రతిష్ఠాత్మమైన బతుకమ్మ పండుగ ప్రారంభం అవుతున్న సందర్బంగా తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తం చేసిన పూల పండుగ బతుకమ్మను తెలంగాణ ప్రజలు సంప్రదాయ బద్దంగా ఆనందంగా, సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు.
---------
లోయలో పడిన బస్సు దుర్ఘటనపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ స్పందించారు. బెల్లంపల్లి నుంచి హనుమకొండ వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని కరీంనగర్, వరంగల్ ఆర్‌ఎంలను మంత్రి ఆదేశించారు.
-----
తాలిబన్ ముష్కరులు మరోసారి రెచ్చిపోయారు. కాబూల్‌లోని గురుద్వారా కర్తె పర్వాన్‌లోకి మంగళవారంనాడు ప్రవేశించి విధ్వంసం సృష్టించారు. గురుద్వారాలోని పలువురుని నిర్బంధంలోకి తీసుకున్నారు. గుర్తుతెలియని సాయుధ తాలిబన్లు గురుద్వారాలోకి ప్రవేశించి, అక్కడి వారందరినీ నిర్బంధంలోనికి సుకున్నారని, గురుద్వారాలోని సీసీటీవీ కెమెరాలతో పాటు గురుద్వారాను ధ్వంసం చేశారని ఫోరం అధ్యక్షుడు పునీత్ సింగ్ ఛాందోగ్ తెలిపారు.