అల్లు అర్జున్ తాగి డ్రైవ్ చేశాడా? తప్పుడు ప్రచారం చేశారా?
posted on Aug 19, 2014 @ 11:14AM
కథానాయకుడు అల్లు అర్జున్ తప్పతాగి వెహికల్ డ్రైవ్ చేశాడని, పోలీసులు అల్లు అర్జున్‌ని పట్టుకుని, ఆ తర్వాత లోపాయకారీ ఒప్పందంతో వదిలిపెట్టేశారన్న వార్తలు వినిపించాయి. ఇలాంటి వార్తల పట్ల అల్లు అర్జున్ విచారం వ్యక్తం చేసి, అసలేం జరిగిందో వివరణ ఇచ్చారు. ‘‘అర్ధరాత్రి సమయంలో నేను నా వెహికల్ డ్రైవ్ చేస్తూ వస్తుండగా పోలీసులు ఆపారు. నన్ను బ్రీత్ అనలైజర్ ఊదమన్నారు. అయితే మీడియా ముందు అలా ఊదడం ఇబ్బందిగా అనిపించి నేను ఆ విషయాన్ని పోలీసులకు తెలిపాను. పోలీసులు నన్ను మీడియా ముందు నుంచి పక్కకి తీసుకెళ్ళి బ్రీత్ అనలైజ్ పరీక్ష చేశారు. ఆ పరీక్షలో నేను తాగలేదని తెలియడంతో నన్ను వెళ్ళిపొమ్మన్నారు. ఆ సమయంలో నేను తాగి వున్నటయితే పోలీసులు వదిలిపెట్టేవారే కాదు. అయితే పలు వెబ్‌సైట్లలో నేను డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరికిపోయానని వార్తలు రాసి, వీడియోలు పెట్టడం దారుణం. నేను తాగిడ్రైవ్ చేయను. ఒకవేళ మద్యం సేవిస్తే నడుచుకుంటూనో, ఆటోలోనో వెళ్తాను. లేదా ఎవర్నయినా డ్రాప్ చేయమని అడుగుతాను’’ అని అల్లు అర్జున్ అన్నారు.