Read more!

తిరుపతి ప్రీపోల్ సర్వే.. గెలిచేది ఎవరంటే..

తిరుపతి పార్లమెంట్ స్థానంలో హోరాహోరీ పోరు. తిరుపతి విజయం అన్ని పార్టీలకూ కీలకం. నేతలంతా గెలుపు కోసం గట్టిగా క‌ృషి చేస్తున్నారు. ఎవరి లెక్కలు వారివే. గెలుపుపై ఎవరి ధీమా వారిదే. పార్టీలు, నాయకుల మాటలా ఉంచితే.. మరి, తిరుపతి ఓటర్లు ఎటు వైపు? ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? ప్రి-పోల్ సర్వేలు ఏం చెబుతున్నాయి? అనేది ఆసక్తికరంగా మారింది. 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' చేసిన ప్రీ పోల్ సర్వేలో ఓటర్ల నాడి స్పష్టమైంది. 

సర్వేలో.. తిరుపతిలో ఎవరు గెలుస్తారంటూ ప్రశ్నించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. 45శాతం ప్రజలు టీడీపీకే పట్టం కట్టారు? తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పనబాక లక్ష్మి గెలుస్తారని చెప్పారు తిరుపతి ఓటర్లు. వైసీపీ వైపు 39.2శాతం మంది మొగ్గు చూపారు. బీజేపీ-జనసేనకు కేవలం 1.3శాతం మాత్రమే జై కొట్టారు. కాంగ్రెస్‌కు 0.7 మద్దతు పలకగా.. 13.8శాతం చెప్పలేమని చెప్పారు. 

ఇక, టీడీపీకి ఓటేస్తామంటూ 47.8శాతం ప్రజానీకం స్పష్టం చేయండం చూస్తుంటే.. ఓటర్లలో తెలుగుదేశానికి పెరిగిన ఆదరణ స్పష్టం అవుతోంది. వైసీపీకి ఓటేసేందుకు 44.7శాతం మంది ఇంట్రెస్ట్ చూపడం ప్రజల్లో అధికార పార్టీ పరపతి కోల్పోతోంది అనడానికి నిదర్శణం. బీజేపీ-జనసేనకు ఓటేసేందుకు కేవలం 4.4శాతం ఆసక్తి కనబరిచారు. 

తిరుపతిలో కులాల వారీగానూ ఓటరు నాడీ పట్టే ప్రయత్నం చేసింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. సర్వేలో అధిక శాతం రెడ్లు, మాలలు అధికార పార్టీ వైపు మొగ్గు చూపారు. వైసీపీకి 60.5శాతం రెడ్లు ఓటేస్తామని ముందుకు రాగా, 31.1శాతం మంది రెడ్లు మాత్రం టీడీపీకే జై కొట్టారు. 57.1శాతం మాలలు గురుమూర్తి వైపు ఉండగా, పనబాకకు 38.7శాతం మాలలు ఆసక్తి చూపారు. ఇక, మాదిగలు మాత్రం అధిక సంఖ్యలో తెలుగుదేశానికి అండగా ఉండబోతున్నారు. సర్వేలో 59.6శాతం మాదిగలు తాము టీడీపీకే ఓటు వేస్తామని చెప్పారు. వైసీపీకి 35.2శాతం మాదిగలు మద్దతు పలికారు. యాదవ ఓటర్లలో 57శాతం టీడీపీకి, 37.3శాతం వైసీపీకి సపోర్ట్‌గా ఉన్నారు. ఇక, యానాడిలు మాత్రం 2శాతం తేడాతో టీడీపీ వైపు అధికంగా మొగ్గు చూపారు. 

ఇక, వర్గాల వారీగానూ ఓటర్ల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది. రైతులు అధిక సంఖ్యలో టీడీపీకి మద్దతుదారులుగా నిలిచారు. 49.5శాతం మంది రైతులు తెలుగుదేశానికి ఓటేస్తామని చెప్పగా, 43.04శాతం రైతులు అధికార పార్టీకే తమ ఓటన్నారు. వ్యాపారుల్లో మాత్రం కాస్త వైసీపీ వైపే మొగ్గు కనబడింది. 47.2శాతం మంది ట్రేడర్స్ వైసీపీకి జై కొట్టగా, టీడీపీకి 45.2 శాతం వ్యాపారులు అండగా నిలిచారు. 

ఇసుక విధానంతో తీవ్రంగా నష్టపోయిన రోజువారీ కూలీలు తిరుపతి ఎన్నికల్లో అధికార వైసీపీకి బుద్ధి చెప్పేందుకు సిద్ధమైనట్టు ప్రీపోల్ సర్వేలో స్పష్టమవుతోంది. 44.7శాతం కూలీలు వైసీపీకి ఓటేస్తామంటే, 49.04శాతం కూలీలు టీడీపీ వైపు ఉన్నామన్నారు. 49.25శాతం మంది ప్రైవేట్ ఉద్యోగులు తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 44.4శాతం సై అన్నారు. 49.2 శాతం మంది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అధికార పార్టీకే ఓటేస్తామన్నారు. టీడీపీకి 45.5శాతం మద్దతు పలికారు. గృహిణిలు పెద్ద సంఖ్యలో 48.5శాతం మేర తెలుగుదేశానికి సపోర్ట్ చేయగా, వైసీపీకి 45.2శాతం ఓకే చెప్పారు. ఇక, ఓవరాల్‌గా అన్ని వర్గాలకు చెందిన మహిళల్లో 44.3శాతం వైసీపీకి, టీడీపీకి 48.7శాతం ఓటేసేందుకు సిద్ధమన్నారు. పురుషుల్లో టీడీపీకి 47.8శాతం, వైసీపీకి 44.7శాతం సపోర్టర్స్‌గా ఉన్నట్టు 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' స్పష్టం చేస్తోంది. ఇక, అన్ని కేటగిరిల్లోనూ బీజేపీ, కాంగ్రెస్, ఇతరులు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యాయి. 

తిరుపతి పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ వారీగానూ ప్రీ పోల్ సర్వే నిర్వహించింది 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్'. నియోజక వర్గాల వారీగా ఓటర్ల నాడి మారిపోతోంది. అయితే, అధిక శాతం ఓటర్లు టీడీపీ వైపే ఆసక్తిగా ఉండటం ఆసక్తికరం. సర్వేపల్లి అసెంబ్లీ పరిధిలో 52.9శాతం మంది టీడీపీ గెలుస్తుందని చెప్పగా, 43.5శాతం వైసీపీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు. వెంకటగిరి అసెంబ్లీ సెగ్మెంట్‌లో 53.6శాతం టీడీపీకే ఓటేస్తామని చెప్పగా, కేవలం 41.5శాతం మంది వైసీపీకే తమ ఓటన్నారు. సూళ్లూర్‌పేట్‌లో వైసీపీ ఆధిపత్యం కనిపిస్తోంది. అక్కడ టీడీపీకి 43.4శాతం, వైసీపీకి 47.1శాతం మంది ఓటర్లు పట్టం కట్టారు. సత్యవేడులో 46.1శాతం మంది వైసీపీనే గెలుస్తుందని భావిస్తున్నా.. అక్కడి వారిలో 53.6శాతం తాము టీడీపీకే ఓటేస్తామని చెప్పడంతో అక్కడి ఓటర్ల నాడి పట్టడం కష్టంగా కనిపిస్తోంది. ఇక, శ్రీకాళహస్తి, గూడూర్ అసెంబ్లీ సెగ్మెంట్స్‌లో 1శాతం తేడాతో హోరాహోరీ పోరు నడుస్తోంది. కీలకమైన తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం దూసుకుపోతోంది. తిరుపతిలో ఏకంగా 53.3శాతం టీడీపీకి ఓటేస్తామని సర్వేలో తేల్చి చెప్పారు. వైసీపీకి 41శాతం మంది మాత్రమే మద్దతు ప్రకటించారు. 

ఇలా.. వర్గాలు, ప్రాంతాల వారీగా చూస్తే.. తిరుపతి పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తోంది. ఉప ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని 'అసోషియేషన్ ఫర్ ఎలక్టోరల్ స్టడీస్' ప్రీ పోల్ సర్వేలో తేలిపోయింది. అధికార వైసీపీ రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సిందే. మిగతా పార్టీలు సోదిలోకి కూడా లేకుండా పోయేలా ఉన్నాయి.