తిరుపతిలో సుగుణమ్మ విజయం
posted on Feb 16, 2015 @ 11:23AM
తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక కౌంటింగ్ ముగిసింది. ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్థి సుగుణమ్మ ఘనవిజయం సాధించారు. ఆమె తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీకి చెందిన రుద్రరాజు శ్రీదేవి మీద 1,16,524 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచీ సుగుణమ్మ ఆధిక్యంలోనే వున్నారు. కౌంటింగ్ పూర్తయ్యేసరికి భారీ మెజారిటీతో విజయం సాధించారు. సుగుణమ్మ భర్త, టీడీపీ ఎమ్మెల్యే వెంకట రమణ మరణంతో తిరుపతి అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ స్థానం నుంచి ఏకగ్రీవంగా సుగుణమ్మను గెలిపించాలని తెలుగుదేశం అభ్యర్థించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ, లోక్ సత్తా పార్టీ రంగంలో నిలిచాయి. ఇండిపెండెంట్లతో కలసి మొత్తం 13 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. అయితే ముందుగా అందరూ ఊహించినట్టే ఈ ఎన్నికలలో సుగుణమ్మ విజయం సాధించారు.