ఆ నటిది ఆత్మహత్యే

 

పలు సినిమాల్లో, టీవీ సీరియళ్ళలో నటించిన దీప్తి అలియాస్ రామలక్ష్మి ఇటీవల హైదరాబాద్ ఫతేనగర్‌లోని తన ఫ్లాట్‌లో మరణించిన విషయం తెలిసిందే. ఆమె ఉరి వేసుకుని చనిపోయే ముందు తన సెల్ఫీ తాను తీసుకుని మరణించింది. రామలక్ష్మి మరణాన్ని మొదట అందరూ ఆత్మహత్య అనుకున్నారు. అయితే పోలీసులు మాత్రం అందరిలా నమ్మేయకుండా ఈ మరణం హత్య కూడా కావొచ్చని అనుమానించారు. ఎందుకంటే, ఆమె గత కొంతకాలంగా ఒక టీవీ దర్శకుడితో సహజీవనం చేస్తోంది. అతనితో గొడవల కారణంగా హత్య కూడా జరిగే అవకాశం వుందని పోలీసులు అనుమానించారు. అయితే దీప్తి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన గాంధీ ఆస్పత్రి వైద్యులు ఆమెది హత్య కాదని... ఆత్మహత్యేనని స్పష్టత ఇచ్చారు. అయితే ఇంతవరకూ ఆమె ఆత్మహత్యకు గల కారణాలు మాత్రం వెల్లడి కాలేదు. ఆమె ఫోన్‌లో, లాప్‌టాప్‌లో ఏదైనా సమాచారం దొరుకుతుందేమోనని పోలీసులు శోధిస్తున్నారు. దీప్తి సహజీవనం చేస్తున్న కిరణ్ అనే వ్యక్తి ఇంకా పోలీసుల అదుపులోనే వున్నాడు.

Teluguone gnews banner