టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: తప్పుల తడక సర్వే
posted on May 12, 2014 @ 8:15PM
టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ వివరాలలో ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పార్టీలకు లభించే సీట్లకి సంబంధించిన అంచనా తప్పులతడకగా వుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. . టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు. అయితే టైమ్స్ నౌ ప్రకటించిన ఈ ఫలితాలు తప్పుల తడకలా వున్నాయని టైమ్స్ నౌ ఛానల్లో డిస్కషన్‌లో పాల్గొన్న పలువురు చెప్పారు. అటు సీమాంధ్రలో, ఇటు టీడీపీలో టీడీపీ, బీజేపీ కూటమికి ఇంకా ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశాలున్నాయని అన్నారు. సోమవారం వెల్లడి అయిన మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. అంతే కాకుండా టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ సర్వేలో ఎం.ఐ.ఎం. ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవదన్న ఫలితాన్ని ఇచ్చింది. అయితే దీనిని పలువురు ఖండించారు. హైదరాబాద్ లోక్ సభ స్థానంలో ఎంఐఎం గెలిచి తీరుతుందని వారు స్పష్టం చేశారు.