టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: సీమాంధ్ర, తెలంగాణ వివరాలు
posted on May 12, 2014 @ 7:37PM
టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ కార్యక్రమంలో ఈ ఎన్నికలలో సీమాంధ్ర, తెలంగాణలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రావొచ్చన్న అంశం మీద చర్చ జరిగింది. ఈ సందర్భంగా టైమ్స్ నౌ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలను కూడా ప్రకటించారు. టైమ్స్ నౌ ఛానల్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం సీమాంధ్రలో టీడీపీ, బీజేపీ కూటమి 17 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ ఒక్క లోక్ సభ స్థానాన్ని కూడా గెలుచుకోదు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎనిమిది లోక్ సభ స్థానాలు గెలుచుకుంటుంది. లెఫ్ట్ పార్టీలు 2 స్థానాలు సొంతం చేసుకుంటాయి. అలాగే సీమాంధ్రలో ఇతరులు నాలుగు స్థానాలు గెలుచుకోబోతోంది. అలాగే తెలంగాణ విషయానికి వస్తే టీఆర్ఎస్ 8 లోక్ సభ స్థానాలు గెలుచుకోబోతోంది. కాంగ్రెస్ 2 స్థానాలు గెలుచుకుంటుంది. బీజేపీ 2 స్థానాలు గెలుచుకుంటుంది. ఇతరులు 2 స్థానాల్లో విజయం సాధిస్తారు.