టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్: ఈశాన్యంలో పుంజుకున్న బీజేపీ
posted on May 12, 2014 @ 7:14PM
దేశవ్యాప్తంగా ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ఎగ్జిట్ పోల్స్ మీద పడింది. ఎన్నికలు ముగిసే వరకూ ఎగ్జిట్ పోల్స్ మీద నిషేధం వుండటంతో దేశ ప్రజలు 2014 ఎన్నికల తుదివిడత ఎప్పుడు ముగుస్తుందా అని ఎదురుచూశారు. ఆ ముహూర్తం రానే వచ్చింది. ప్రముఖ న్యూస్ ఛానల్ నిర్వహించే ఎగ్జిట్ పోల్ మీద అందరికీ ఎంతో ఆసక్తి వుంది. ఆర్నబ్ గోస్వామి నిర్వహిస్తున్న ఎగ్జిట్ పోల్ లైవ్ ప్రోగ్రామ్‌ని దేశవ్యాప్తంగా ఆసక్తిగా చూస్తున్నారు. టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ డిస్కషన్‌లో మొదట ఈశాన్య రాష్ట్రాల్లో ఏ పార్టీ పరిస్థితి ఎలా వుంటుందో చర్చించారు. ఈశాన్య భారతదేశంలో బీజేపీ బాగా పుంజుకుంది. ఈ ఎన్నికలలో ఈశాన్య భారతంలో ఎన్.డి.ఎ.కి 49 పార్లమెంట్ సీట్లు,యు.పి.ఎ.కి 28 పార్లమెంట్ సీట్లు, ఇతరులకు 65 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్ తేల్చి చెప్పింది.