టీఆర్ఎస్ జాణతనం
posted on May 12, 2014 @ 6:37PM
మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణలో తుక్కుతుక్కుగా ఓడిపోయినప్పటికీ టీఆర్ఎస్ పార్టీలో జాణతనం ఎంతమాత్రం తగ్గలేదు. దారుణంగా ఓడిపోయినా తనకు ఈ విషయం ముందే తెలుసన్నట్టు, ఈ ఓటమి అసలు ఓటమే కానట్టు బిల్డప్పులు ఇస్తోంది. మునిసిపల్ ఫలితాలు విడుదలైన తర్వాత టీఆర్ఎస్ నాయకులు ఈటెల రాజేందర్ మాట్లాడిన తీరు చూస్తుంటే హమ్మా.. టీఆర్ఎస్‌ది ఎంత జాణతనమో అనిపించక మానదు.
ఈటెల రాజేందర్ మాట్లాడిన మాటల సారాంశంమేంటంటే.. మునిసిపల్ ఎన్నికలలో తెలంగాణ టీఆర్ఎస్ వైపే నిలిచారట. అందుకే తెలంగాణ ప్రజలకు బోలెడన్ని కృతజ్ఞతలట. మునిసిపల్ ఎన్నికలతో టీఆర్ఎస్ ఎంతమాత్రం ప్రచారం చేయకపోయినప్పటికీ తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్‌కి బ్రహ్మరథం పట్టారట. సీమాంధ్ర పార్టీలు ఎన్ని ప్రలోభాలకి గురి చేసినా లొంగకుండా తెలంగాణ ప్రజలందరూ హోల్‌సేల్‌గా టీఆర్ఎస్‌కి అండగా వున్నారట. చింతచచ్చినా పులుపు చావలేదన్నట్టు తమకే ఎక్కువ మునిసిపల్ ఛైర్మన్ స్థానాలు దక్కుతాయన్న నమ్మకం వుందట. మంగళవారం వెల్లడి కాబోతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఫలితాలలో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందట. ఈ టీఆర్ఎస్ నాయకులు ఎప్పటికి మారతారో ఏంటో!