పిల్లలు కాదు.. పిశాచాలు!
posted on Jul 6, 2024 @ 11:03AM
విజయవాడ హౌసింగ్ బోర్డు కాలనీలో వుండే తొమ్మిదో తరగతి చదివే ఒక అమ్మాయిని, ఇంటర్మీడియట్ చదువుతున్న మరో అమ్మాయిని, ఎనిమిదో తరగతి చదువుతున్న మరో అబ్బాయిని వాళ్ళ వాళ్ళ ఇళ్ళలో పేరెంట్స్ మందలించారు. ఎందుకు మందలించారంటే ఈ ముగ్గురూ చదువుకోకుండా సెల్ ఫోన్ చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు. దాంతో ముగ్గురికీ కోపం వచ్చింది. ముగ్గురూ ఒకచోట చేరారు. భారీ ప్లాన్ వేశారు. ఇంట్లోంచి పారిపోవాలని డిసైడ్ అయ్యారు. ముగ్గురూ వాళ్ళవాళ్ళ ఇళ్లలోంచి బంగారం, డబ్బు దొంగతనం చేసి తీసుకొచ్చారు. విజయవాడ రైల్వేస్టేషన్‌కి చేరుకున్నారు. అక్కడ ప్లాట్‌ఫామ్ మీద వున్న జన్మభూమి ఎక్స్.ప్రెస్ ఎక్కి సికింద్రాబాద్‌కి చేరుకున్నారు. సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‌ఫామ్ మీద పోలీసులకు వీళ్ళ మీద అనుమానం వచ్చింది. వాళ్ళని ఆపి ప్రశ్నించారు. అప్పుడు వాళ్ళు తమ ఘనకార్యాన్ని బయటపెట్టారు. ఈలోపు తమ పిల్లలు కనిపించడం లేదని వాళ్ళ పేరెంట్స్ విజయవాడలో పోలీసులకు కంప్లయింట్ చేశారు. ఇక్కడ పోలీసులు అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో ఈ ముగ్గురు పిల్లల్నీ.. కాదు.. కాదు... పిశాచాల్ని విజయవాడకి పంపించారు. సికింద్రాబాద్‌లో పోలీసుల కంటపడ్డారు కాబట్టి సరిపోయింది.. లేకపోతే ఏమయ్యేదో!