కరోనా గురించి 2008లోనే చెప్పిన పుస్తకం
posted on Aug 11, 2020 @ 10:36AM
ప్రపంచం, జీవితం కరోనా ముందు తరువాత లా మారిందనక చెప్పకతప్పదు. కరోనా తగ్గిపోయినా జనంలో భయం తగ్గదనీ, ముందు నుయ్యి వెనక గొయ్యిలా ఉంటుందనే ఆలోచనతో చాలా మంది తికమకపడుతున్నారు. ఇదే సమయంలో కరోనా మీద అనేక జోస్యాలు పుడుతూనే ఉన్నాయి, వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది అత్యంత ఆశ్యర్యకరమైన ఒక పుస్తకం, అందులోని 312 వపేజీలో చెప్పిన భవిష్యత్తు దర్శనం ప్రపంచ వ్యాప్తంగా టాకింగ్ పాయింట్ గా మారింది. అమెరికాకు చెందిన సిల్వియా బ్రౌనీ అనే ఆమె ఎండ్ ఆఫ్ డేస్ అని భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి రాసిన పుస్తకం 312 వ పేజీలోని ఆఖరు పేరాలో 2020 నాటికి ఒక ప్రపంచ మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తుందని చెప్పింది.
అదే పేరాలో ఇపుడు కరోనా ఏ రకమైన లక్షణాలతో ప్రజలను వెంటాడుతుండటంతో అదే లక్షణాలను చెప్పడం విశేషం. ఆ పేజీలోని పదిలైన్ల చివరి పేరాలో ఆమె న్యుమోనియా లాంటి ఊపిరిత్తులకు సంబంధించిన అనారోగ్యం ప్రపంచమంతా ప్రబలుతుందని చెప్పింది. కరోనా లో ఊపరితిత్తులే దెబ్బతినడం గమనార్హం. దీనికి విరుగుడు కూడా ఉండక ఇంకా ప్రమాదకరంగా ఉంటుందని. అయితే ఆ రోగం దానంతట తగ్గిపోయి నిదానంగా కనుమరుగైపోతుందననీ ఆ పేరాలో ఉంది. అంత వరకు బాగానే ఉంది అని ఊపిరిపీల్చుకోవడానికి లేదు, అనేక సంవత్సరాల తరువాత ఆ వ్యాధి మళ్ళీ వచ్చి ప్రపంచాన్ని విసిగించి ఇక పూర్తిగా మాయమైపోతోందనీ చెప్పింది.
ఇప్పటి వరకు అనేక మంది జ్యోతిష్కులు రకరకాల ప్రళయాల గురించి, భవిష్యత్తు దార్శనికులు ఇంత కచ్చితంగా మహమ్మారి చెప్పిన దాఖలా లేకపోవడంతో ఇఫుడు ప్రపంచంలో ఇదొక చర్చకు దారి తీసింది. మన బ్రహ్మంగారు మాత్రం తూర్పు నుంచి ఒక వ్యాధి సోకి కోటి మందికి పైగా చనిపోతారని చెప్పారంటారు. ఆయన వంద సంవ్సరాల క్రితం ఆ విషయం చెబితే ఎండ్ ఆప్ డేస్ పుస్తకం 2008 లొ ప్రచురితమైంది. దీనిని రాసిన సిల్వియా బ్రౌనీకి అమెరికా ఫ్యూచర్ టెల్లర్ గా పేరుంది. ఈ పుస్తకం గురించి హాలీవుడ్ నటి కిమ్ కండర్సన్ ఈ మధ్య ట్వీట్ చేయడంతో మళ్ళీ చర్చనీయం అయింది. సిల్వియా బ్రైనీకి ఎంత మంది ఫాలోయర్లు ఉన్నారో అంతే మంది వ్యతిరేకులున్నారు. ఆదే పస్తకంలో ఆమె అమెరికా లో ప్రెసిడెంట్ తరహా పాలన వ్యవస్థ నశించిపోతుందని దానికి నాంది 2020లోనే పడుతుందనీ ప్రెడిక్ట్ చేసింది. అయితే గతంలో ఆమె చేసిన భవిష్యత్తు ఊహగానాలు కొన్ని తప్పు కావడంతో ఇదంతా యాదృచ్చికమని కొట్టిపారేశావారూ లేకపోలేదు. విచిత్రమైన విషయం ఏంటంటే కొన్నేళ్ళ క్రితం వచ్చిన హాలివుడ్ సినిమా కంటేజియస్ చైనా దేశంలోని వూహాన్ నగరంలో ఒక వైరస్ మహమ్మారి గురించి చుట్టూ తిరగుతుంది. కరోనా మొదలైన కొత్తలో ఈ సినిమా బాగా చర్చనీయాంశమైతే ఇపుడు ఈ పుస్తకం చర్చనీయాంశమౌతుంది.
చాలా మంది భారతీయ జ్యోతిష్కులు సెప్టెంబరు తరువాత కరోనా తగ్గుముఖం పట్టి కొంతకాలానికి మళ్ళీ రావచ్చని చెప్పడం విశేషం. అందులో ఇటీవల కాలంలో యూట్యూబ్ లో బాగా ప్రాచుర్యం సంపాదించిన అభిగ్న అనే కుర్రాడు కూడా ఒకడు. ఈ ఊహగానాలు ఎంతవరకు నిజమో తేలాలంటే సెప్టెంబరు ఆఖరు వరకు వేచి చూడాల్సిందే.