రాముడి రాజ్యమా.. రౌడీ రాజ్యమా..?
posted on Jul 9, 2021 @ 1:41PM
అక్కడ రామ రాజ్యం స్థాపించాలని ఉద్దేశంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ అక్కడ జరుగుతున్న దారుణాలు మరెక్కడా జరగడం లేదు.. రామరాజ్యమా మజాకా అది ఏ రాష్ట్రంలో ఇప్పటికే మీకు అర్థం అయివుంటుంది.. అదే ఉత్తరప్రదేశ్ రాష్ట్రము. తాజాగా ఇక్కడ ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. మరో మహాభారత గాధను తలపించింది. భారతం లో నిండు సభలో ద్రౌపతి చీర లాగిన విషయం అందరికి తెలిసిందే.. కానీ ఇక్కడ రామరాజ్యంలో నడిరోడ్డు మీద ఓ మహిళా చీరను లాగారు. రామాయణాన్ని, మహాభారతాన్ని తమ బుజాల మీద మోసే బిజెపి పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రము కదా ఆ మాత్రం మహిళనకు అవమానం జరగాలి మరి. అసలు మహిళలు అంటే బిజెపి నాయకులే విలువైయ్యారు.. మొన్నటికి మొన్న ఓ బిజెపి నాయకుడు బాల్యవివాహాలు చేయాలి అని చెప్పాడు.. ఇలా చెపుతూపోతే చరిత్ర మరిచిన నిజాలు ఎన్నో ఉన్నాయి బిజెపి మీద..
వివరాల్లోకి వెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరీ పరిధిలో పంచాయతీ ఎన్నికలకు ఓ అభ్యర్థి నామినేషన్‌ను ప్రతిపాదించడానికి సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ మహిళ నామినేషన్ కేంద్రానికి వెళుతోంది. ఆ సమయంలో ఆమె దగ్గరకు వెళ్లిన ప్రత్యర్థులు ఆమెను అడ్డుకున్నారు.. అయినా సరే ముందుకు వెళ్లాలనే ఆమె ప్రయత్నం వదిలిపెట్టలేదు.. అయితే చివరికి ఆ నీచులు ఆమె చీర కొంగును పట్టుకుని లాగారు. ఆమె చేతిలోని అభ్యర్థి ప్రతిపాదన పత్రాలను లాక్కున్నారు. మానవత్వం మరిచి మరి నీచంగా ప్రవర్తించారు. ఈ అన్యాయాన్ని చూసి సహించని కొంత మంది ఆమెకు మద్ధతుగా కొందరు ముందుకు వచ్చి విడిపించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలు వివరాలు సేకరించారు.
సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి ఎన్నికలో పోటీలో నిలవకుండా చేసి తమ అభ్యర్థిని ఏకగ్రీవం చేసేందుకే వాళ్లు ఆమెపై దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. బీజేపీ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని సమాజ్‌వాదీ పార్టీ నేతలు అరోపిస్తున్నారు. అధికార దాహంతోనే యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు చెందిన గూండాలు ఇటువంటి దారుణాలకు పాల్పడుతున్నారని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. మహిళపై దారుణానికి పాల్పడిన ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా కూడా విమర్శలు గుప్పించారు. యూపీలో 825 పంచాయతీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఆ ఘటనపై సామాన్య జనం కూడా స్పందిస్తూ.. రామ రాజ్యం అంటే ఇదేనా..? దేశభక్తులం అని చెప్పుకునే వాళ్ళు మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.. ? ఆడది అంటే వంటింటికి మాత్రమే పరిమితం కావలి చెపుతున్నారా ? లేదా మహిళలు ఎన్నికల్లో పోటీచేయడం తమకు తమ పార్టీకి ఇష్టం లేదని చెపుతున్నారా? లేదా దళితులు దళితులుగానే ఉండాలి.. ఇంకా మను సిద్ధాంతం ఈ దేశం లో అమలుకావాలని ఆలోచిస్తున్నారా అని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి..