కరోనా తో భర్త.. కోర్టుకు వెళ్లిన భార్య.. ఎందుకో తెలుసా..?
posted on Jul 22, 2021 @ 4:19PM
అప్పుడప్పుడు కొన్ని విషాదాలు వింతగా ఉంటాయి. ఆ విషాదాలు విన్నా, చూసినా మనసు తరుక్కుపోతుంటుంది. మనుషులు మానవత్వాన్ని వదిలి ఎటువైపు వెళ్తున్నారు అనే సందేశం కలుగుతుంది..ఇలాంటి విషాదాలు ఈ కరోనా సమయంలో ఒకటి వాడు రెండు కాదు ఎన్ని లెక్కలేనన్ని విషాదాలు. చేతికి వచ్చిన కొడుకు కళ్లముందే చనిపోయినప్పుడు, ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకున్న భర్త పసుకుతాడు ఆరకముందే మరణించినప్పుడు.. తల్లిదండ్రులు కరోనాకు బలై బిడ్డలు అనాథలుగా మారినప్పుడు, ఎంతో మందికి ఉద్యోగ ఉపాధి కోల్పోయి రోడ్డున పడినప్పుడు.. ఇలా ఎన్నో విషాదాలు మనకు కళ్ళకు మరుపురాని విదంగా చేసింది కరోనా.. ఈ కరోనా మిగిల్చిన విషాధ గాథలు వింటే కన్నీళ్లు గంగ నదిలో నీరులా నిత్యం ఆగని అలలంటింది.. తాజాగా ఓ భార్య విషాద గాధ అందరి గుండెలను కలిచి వేస్తోంది. చావుబతుకుల మధ్య ఉన్న తన భర్త వీర్యం కావాలని ఆ భార్య ఏకంగా కోర్టు మెట్లెక్కింది. మరి చివరికి ఏమైందో తెలుసుకుందాం పదండి..
వివరాలలోకి వెళితే.. ఓ మహిళకు ఆమె వయసు 28 సంవత్సరాలు. ఆమె గ్రామానికి చెందిన వ్యక్తి. అతనికి వయసు 30 సంవత్సరాలు.. వాళ్లిదరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. ఏడాది క్రితం వాళ్ళిద్దరికీ కూడా వివాహమైంది. పచ్చని సంసారంలో కరోనా కలకలం రేపింది. ఇటీవల ఆ మహిళ భర్త కరోనా పడ్డాడు.. స్థానికంగా ఉన్న ఓ ఆస్పత్రిలో చేర్పించారు. అతను అక్కడే చికిత్స పొందుతున్నాడు. అతని ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉందని, ఆయన అవయవాలన్నీ దెబ్బతినడం వలన బతకడం కష్టమని వైద్యులు తెలిపారు. ఎంతో ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్త తనను వదిలి వెళ్లిపోతాడనే మాట విన్న భార్య కుదేలయిపోయింది. గుండెలవిసేలా ఏడ్చింది. భర్త ప్రేమను చిరకాలం పొందాలనుకొని సంకల్పించింది. తమ బంధం, ప్రేమ అన్యోన్యతకు గుర్తుగా బిడ్డ రూపంలో భర్తను చూసుకోవాలనుకొని భర్త వీర్యాన్ని ఇవ్వాల్సిందిగా వైద్యులను కోరింది. కానీ కరోనా బాధితుడి నుంచి వీర్యం సేకరించేందుకు ఆస్పత్రి వర్గాలు అంగీకరించలేదు. వైద్యులు కోర్టు చెపితేగాని తాము ఏంచేయలేమని వైద్య సిబ్బంది తెలిపారు. ఇక అంటే ఆమె అక్కడితో తన ప్రయయ్నాన్ని విరమించుకోకుండా.. తన ప్రేమ ను బతికించుకోవడానికి పంతాన్ని వదలకుండా చివరికి భర్త గుర్తు కోసం ఆమె కోర్టు మెట్లెక్కింది.
ఈ విషయమై కోర్టులో ఈ కేసు సంచలంగా మారింది. కోర్టు కూడా ఆ మహిళ విజ్ఞప్తికి వెంటనే ఆమోదించింది. ఆమె ప్రేమకు గుర్తుగా తన ఆమె భర్త నుంచి వెంటనే వీర్యం సేకరించి భద్రపరచాలని, ఐవీఎప్ ద్వారా ఆమె గర్భం దాల్చేందుకు సహకారం అందించాలని ఆస్పత్రికి సూచించింది. దీంతో కోర్టు ఆదేశాలతో ఆసుపత్రి వర్గాలు ఆమె భర్త వీర్యాన్ని సేకరించి భద్రపరిచాయి. భర్త పోతే మరొకరిని పెళ్ళిచేసుకోని వెళ్లిపోతున్న ఈ రోజుల్లో భర్త ప్రేమకు గుర్తుగా ఇంతటి సాహసం చేసిన ఆ మహిళను అందరు ప్రశంసిస్తున్నారు. నిజమే కదా ప్రేమంటే ఎవరెస్టు అంటారు నిజంగా.. ఈ మహిళా కూడా ప్రేమ కూడా ఎవరెస్టు లాంటిదని చెప్పాలి. ఈ సంఘటన గుజరాత్ లో జరిగింది..