కోడి పొడిచింది.. 10 ఏళ్ళ పిల్లాడు మృతి..
posted on Jul 8, 2021 @ 4:58PM
అది తెలంగాణ. మహబూబాబాద్ జిల్లా. కేసముద్రం మండలం. బేరువాడ గ్రామం. ఈ గ్రామానికి చెందిన ముదిగిరి రమేష్, శ్రీలత దంపతులకు ఒక్క కుమారుడు, ఒక కుమార్తె సంతానం ఉన్నారు. వీరిలో పెద్దవాడైనా ముదిగిరి అజయ్. ఆ పిల్ల వారి వయసు 10 సంవత్సరాలు. బుధవారం అదే గ్రామంలో వీరి ఇంటిపక్కన బంధువుల ఫంక్షన్ కు వెళ్ళాడు. అక్కడ ఉన్న తోటి పిల్లలతో ఆటలు ఆడుకుంటూ, సరదాగా ఎంజాయ్ చేశారు..అప్పుడపుడు ఇంటి సెల్ఫ్ ను పట్టుకొని వేలాడుతున్నాడు అజయ్. . ఆటలు ఆడుకుంటుండగా అక్కడే సెల్ఫ్ మీద పొదిగేసి ఉన్న కోడి పొడిచిండి. ఇది చిన్నపుడు పల్లెటూరిలో ఉన్న ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి జరిగే ఉంటుంది.. కానీ అందరికి జరిగింది వేరు ఇప్పుడు మనం చదివే వార్త వేరు.. కట్ చేస్తే కోడి కరిచినా అజయ్ చనిపోయాడు.. అది ఎలా అని అనుకుంటున్నారా ? ఎలాగో మీరే తెలుసుకోండి..
సాయంత్రం తోటి స్నేహితులతో ఆటలు ఆడుకొని నిద్రలోనే ప్రాణాలు విడిచాడు. కుమారుడు కళ్లెదుటే చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. అప్పటికే అ సెల్ఫ్ మీద కోడిని పొదిగేశారు. అది వాస్తవం ఈ క్రమంలోనే అక్కడ పాము కూడా ఉంది. అజయ్ సెల్ఫ్ మీద చేతి పెట్టినప్పుడు పాము కాటు వేసింది. విషయాన్ని పసిగట్టని బాలుడు తల్లిదండ్రులకు కోడి పొడిచిందని స్థానిక వైద్యుని వద్ద చికిత్స అందజేశారు. చికిత్స అనంతరం కూడా బాలుడు ఆటలు ఆడుకోవడంతో తల్లిదండ్రులు సైతం శ్రద్ద చూపలేదు. సాయంత్రం అజయ్ నిద్రిస్తూ నోటిలో నుండి నూరుగు కక్కుతుండడంతో మహబూబాబాద్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు. గురువారం బేరువాడ గ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుమారుడు కళ్లెదుటే మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు, కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.