దటీజ్ కొండా సురేఖ!
posted on Oct 22, 2025 @ 12:14PM
ఎంతైనా మంత్రి కొండా సురేఖ ఘటికురాలే. ఇంటిపేరుకు తగ్గట్టే కొండల్ని ఢీ కొట్టి మరీ నిలబబడుతున్నారామె. ఇంత వివాదం చెలరేగితే.. సింపుల్ గా సీఎం రేవంత్ కి పండగ శుభాకాంక్షలు చెప్పి.. ఆల్ ఈజ్ వెల్. బేఫికర్.. మైహూనా! అన్న కలరింగ్ ఇవ్వగలుగుతున్నారు. నాగార్జున విషయంలోనే కొండా వికెట్ డౌన్ అనుకున్నారంతా. ఎలాగోలా ఆ తుఫాన్ తట్టుకుని నిలబడగలిగారు. అప్పుడు కూడా ఆమె పై తీవ్ర వివాదం చెలరేగింది. ఆమె కాబట్టి ఈ మాత్రం తాకిడి తట్టుకుని నిలబడగలిగారు. మరొకరై ఉంటే భూస్థాపితం అయిపోయేవారన్నది పొలిటికల్ సర్కిల్స్ లో వినబడుతున్న మాట.
పొన్నం చూడండి.. అడ్లూరిని ఒక మాట అని ఎంత ఆగమయ్యారో.. అదే కొండా సురేఖ.. నాగార్జున ద్వారా కేటీఆర్ ని టార్గెట్ చేస్తే.. అది లోకమంతా కూడా కోడై కూసింది. అయినా సరే ఆమె బేషరతు సారీలు చెప్పలేదు.. కాకుంటే ఇటీవల తాను ఒకటి అంటే, మీడియా వక్రీకరణ మరొకటిగా మారిందని.. చిన్న కామెంట్ చేసి సైలెంట్ అయ్యారు. సరే, కేటీఆర్ ని ఆటాడించడానికి.. దీని వెనక స్టోరీ- స్క్రీన్ ప్లే- ఎవరిదీ ఏంటన్నది అప్రస్తుతం.
ఇదిలా ఉంటే తాజాగా మరో కొండా మార్క్ వివాదం.. అదే మేడారం జాతర కాంట్రాక్టు, ఓఎస్డీ సుజిత్ వ్యవహారం. ఈ విషయంలో స్వయంగా తాను రంగంలోకి దిగకుండా.. తన కుమార్తె సుస్మితను దించారు. మీరుగానీ మా అమ్మను టచ్ చేస్తే మీ డెక్కెన్ సిమెంటు బాగోతాలన్ని బయట పెడతా. ఇతరత్రా గుట్టు మట్లన్నీ విప్పి చెప్పేస్తానంటూ చిన్న ఫీలర్ వదలడంతో అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్. దీంతో పీసీసీ మహేష్ కుమార్ గౌడ్, ఆపై రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ వంటి వారంతా రెడ్డి.. అలెర్ట్ ఎస్ మీరు చదివింది కరెక్టే.. అది రెడ్డి అలెర్టే.. అయ్యి.. దీని ద్వారా యాంటీ- బీసీ వాయిస్ జనాల్లోకి వెళ్తుందని ఎక్కడికక్కడ గప్ చుప్ అనేలా చేశారు.
ఇక్కడ కూడా కొండా కొండాయే అన్న కామెంట్లు వినిపించాయి. అక్కడ బయట నుంచి తీన్మార్ మల్లన్న రెడ్లపై అన్నేసి అనుచిత వ్యాఖ్యలు చేసి ఏకంగా పార్టీ నుంచి సస్పెండ్ కి గురైతే, సురేఖ సింపుల్ గా రెడ్లు ఒక బీసీ మహిళ అయిన తనను తొక్కాలని చూస్తున్నారంటూ కామెంట్లు చేసి కూడా.. ఇంత హ్యాపీగా తన మంత్రి పదవి కాపాడుకుంటున్నారు. ఎంతైనా కొండా కొండాయే అన్న టాక్ వైల్డ్ గా కాదు కాదు, వైల్డ్ కే వైల్డ్- మ్యాక్స్ ప్రో స్ప్రెడ్ అవుతోంది తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో. మరి చూడాలి కొండా నెక్స్ ఆపరేషన్ ఎలా ఉండబోతుందో ?