అది ఫేక్ ఆడియో: చంద్రబాబు
posted on May 12, 2024 @ 3:38PM
గత ఎన్నికల్లో కోడికత్తి డ్రామా ఆడిన వైకాపా నేత వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో గులకరాయి నాటకం ఆడి అట్టర్ ప్లాప్ అయ్యారు. సరిగ్గా పోలింగ్ కు ఒక రోజు ముందు ఫేక్ ఆడియోలను రిలీజ్ చేస్తూ అధికారంలో రావడానికి నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో జగన్ ఒటమి కన్ఫర్మ్ కావడంతో ఇలాంటి చీప్ ట్రిక్స్ చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
తన పేరిట సోషల్ మీడియాలో ఓ ఆడియో సందేశం వైరల్ అవుతుండడంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రస్థాయిలో స్పందించారు. పథకాల్లేవ్ ఏం లేవ్... మా ఆస్తులన్నీ అమరావతిలోనే ఉన్నాయి... త్వరలోనే మీకు లాభాలు చూపిస్తా... అంటూ తన వాయిస్ తో ఈ మెసేజ్ రూపొందించారని చంద్రబాబు మండిపడ్డారు.
"ఓటమి అంచుల్లో ఉన్నా వైసీపీకి బుద్ధి రావడం లేదు. ఇంకా ఫేక్ వీడియోలు, ఆడియోలు, పోస్టులతో జనాలను మోసం చేయాలని చూస్తున్నారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డీప్ ఫేక్ ఆడియోలు, ఫేక్ లెటర్లు సృష్టిస్తున్నారు. ప్రజలు ఎవరూ ఈ తప్పుడు ప్రచారాలను నమ్మవద్దు. కుట్రలతో తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారిపై పోలీసులు, ఎన్నికల అధికారులు తక్షణమే కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలి" అని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు.