ఆమ్నెస్టీ తోనైనా తమవారిని కలుసుకుంటామా? ఆశగా చూస్తున్న వేలాది తెలుగువాళ్ళు!
posted on Apr 19, 2020 @ 4:42PM
కువైట్ గవర్నమెంట్ ఆమ్నెస్టీ ని ప్రకటించిన తర్వాత ఇండియా వెళ్లడానికి కువైట్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంటర్ ల వద్దకు వేలాదిగా తెలుగువారు చేరుకున్నారు. పాస్ పోర్టు తీసుకొని వేల సంఖ్యలో తెలుగు ప్రజలు వచ్చి లైన్లలో నిలుచుంటున్నారు. పాస్‌పోర్ట్ లేని వారు కూడా ఈ ప్రత్యేక సెంటర్‌లకు వస్తున్నారు. 16 తారీకు నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం అయింది. 20వ తారీకు వరకు మన ఇండియన్స్ కి ఇండియా కి వెళ్ళే ప్రక్రియ ప్రాసెసింగ్ స్టార్ట్ చేశారు
ఎప్పుడు ఎప్పుడెప్పుడు దేశం వెళ్ళిపోవాలంటూ మన వాళ్ళు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. తిండి లేక తలదాచుకునే దానికి వసతి లేక ఎంతో మంది ఎదురు చూస్తున్నారు రెండు తెలుగురాష్ట్రాల ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆదుకోని తొందరగా ఇండియాకు రప్పించే ప్రయత్నం చేయాలని వారు కోరుతున్నారు
ఎవరైతే చట్ట వ్యతిరేకంగా కువైట్ లో ఉంటున్నారో, వారిపై ఎలాంటి జరిమానాలు విధించకుండా, మళ్లి కొత్త వీసా తో కువైట్ రావచ్చు అనే వెసులుబాటుతో కువైట్ ప్రభుత్వం ఇటీవల ఆమ్నెస్టీ ప్రకటించింది.
రెసిడెన్సీ(ఆకామా) లేకుండా ఒరిజినల్ మరియు వాలిడిటీ పాస్ పోర్ట్ ఉన్న వారిని, మహిళలకు, పురుషులకు వేరువేరుగా ఇమ్మిగ్రేషన్ పనులు పూర్తయిన తర్వాత వారిని కువైట్ ప్రభుత్వం భారతదేశం పంపేవరకూ తమ ఆధీనంలోనే పెట్టుకొని, అన్ని వసతులు కల్పిస్తుంది.
కువైట్‌లో వేల సంఖ్యలో మన తెలుగు ప్రజలు స్వంత ఊర్లకు వచ్చే దానికి సిద్ధంగా ఉన్నారు మన ఇండియన్ ఎంబసీ వాళ్లు కావాల్సిన ఏర్పాట్లు కువైట్లో సిద్ధం చేశారు.