సైకిల్-కమలం హవా!
posted on Apr 4, 2014 @ 1:06PM
రాష్ట్రంలో సైకిల్ హవా నడుస్తోంది. ఏ సంస్థ సర్వే చేసినా అటు సీమాంధ్రలోను, ఇటు తెలంగాణలోనూ తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న ఫలితాలు వస్తున్నాయి. తాజాగా ఎన్డీటీవీ నిర్వహించిన సర్వేలో కూడా రాష్ట్రంలో సైకిల్ హవా నడుస్తోందని తేలింది. సీమాంధ్రలో తెలుగుదేశం కూటమి 46 శాతం ఓట్లు, 14 లోక్‌సభ స్థానాలను పొందుతుందని సర్వే చెప్పింది. అలాగే తెలంగాణలో కూడా రెండు పార్లమెంట్ స్థానాలను గెలుచుకుంటుందని సర్వేలో తేలింది. మొత్తమ్మీద రెండు ప్రాంతాలతో కలిపి తెలుగుదేశం కూటమికి 16 ఎంపీ స్థానాలు దక్కనున్నాయి. వైకాపాకి 10 ఎంపీ స్థానాలు, కాంగ్రెస్‌కి ఒక్క స్థానం దక్కే అవకాశం వుందని సర్వే చెప్పింది. తెలంగాణలో దుమ్ము దులిపేస్తామని బిల్డప్పులు ఇచ్చుకుంటున్న టీఆర్ఎస్‌కి దక్కేది ఏడు పార్లమెంట్ స్థానాలే. తెలంగాణ ఇచ్చామని డప్పాలు కొట్టుకుంటున్న కాంగ్రెస్‌కి కూడా ఏడు స్థానాలే దక్కనున్నాయి.
ఇదిలా వుంటే, తమిళనాడులోని 39 పార్లమెంటు స్థానాల్లో అధికార అన్నా డీఎంకే 25 స్థానాల్లో విజయం సాధించబోతోందట. డీఎంకే కూటమి 11, బీజేపీ కూటమి 3 సీట్లు సొంతం చేసుకోనున్నాయి. కర్నాటకలోని 28 స్థానాల్లో 14 స్థానాలు భారతీయ జనతాపార్టీ అకౌంట్లో పడనున్నాయి. కాంగ్రెస్ 10, జేడీఎస్ 2 స్థానాల్లో గెలిచే అవకాశం వుందట.
జార్ఖండ్‌లోని 14 స్థానాల్లో బీజేపీ 10, కాంగ్రెస్‌కి 4 సీట్లు దక్కనున్నాయి.
బీహార్‌లోని 40 స్థానాల్లో బీజేపీ 21, ఆర్జేడీ 11, జేడీయూ 6 స్థానాల్లో గెలిచే అవకాశం వుంది.
మహారాష్ట్రలోని 48 స్థానాలో బీజేపీ 36, కాంగ్రెస్ 10, ఎంఎన్ఎన్ 1 స్థానంలో, ఇతరులు 1 స్థానంలో గెలుస్తారట.
ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో బీజేపీ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 2, కాంగ్రెస్ 1 స్థానంలో విజయం సాధించే అవకాశం వుందని ఎన్డీటీవీ సర్వే తేల్చిచెప్పింది.