తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ నాయకుడు ఎర్రబెల్లి
posted on Jun 8, 2014 @ 5:08PM
తెలంగాణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర రావును తెలంగాణ అసెంబ్లీ శాసనసభాపక్షం నాయకునిగా, ఉపనేతలుగా ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, రేవంత్ రెడ్డిని నియమించారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను అసెంబ్లీలో పార్టీ విప్‌గా, కౌన్సిల్‌లో ఎ నర్సారెడ్డిని పార్టీ పక్షం నాయకుడిగా పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నియమించినట్టు తెలుస్తోంది. కోశాధికారిగా మాగంటి గోపినాథ్, కార్యదర్శులుగా సాయన్న, మంచిరెడ్డి కిషన్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారని తెలుస్తోంది. టిటిడిఎల్పీ నేత పదవి కోసం ఎర్రబెల్లి, తలసాని, ఆర్ కృష్ణయ్యల పేర్లు చివరి దాకా పరిశీలనలోకి వచ్చాయి. సీనియారిటీని పరిగణలోకి తీసుకొని తమకే అవకాశం ఇవ్వాలని ఎర్రబెల్లి, తలసానిలు పట్టుబట్టారు. చివరకు ఎర్రబెల్లిని శాసన సభా పక్ష నేతగా చంద్రబాబు ఎంపిక చేసినట్టు సమాచారం. తనను కాదని ఎర్రబెల్లిని శాసనసభాపక్ష నేతగా ఎంపిక చేసినందుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ తన అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.