తెలంగాణా మార్చ్‌కు అనుమతి లేదు!
posted on Sep 28, 2012 7:28AM
ప్రత్యేక తెలంగాణా కోరుతూ ఈనెల 30న తెలంగాణా వాదులు తలపెట్టిన ‘మార్చ్’కు అనుమతి ఇవ్వలేదని శాంతిభద్రతల విభాగం అదనపు డిజిపి ఎస్.ఎ.హుదా చెబుతున్నారు. 29న వినాయక నిమజ్జనం, 1వ తేదీనుండి జీవవైవిధ్య సదస్సు ప్రారంభం కానున్న నేపథ్యంలో తెలంగాణా మార్చ్ నిర్వహణకు అనుమతి ఇవ్వడం సాధ్యం కాదని ఆయన వివరించారు. అంతేకాకుండా ` ఆ రోజున సీమాంధ్రులు, వారి ఆస్తులపై దాడులు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిఘా వర్గాల నివేదికలు సూచిస్తున్నందున ‘మార్చ్’ నిర్వహణకు అనుమతి నిరాకరించామన్నారు. హైదరాబాద్ నగరంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామనీ, అనుమతి లేకున్నప్పటికీ ‘మార్చ్’ నిర్వహించాలని ఎవరైనా ప్రయత్నిస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఏది ఏమైనప్పటికీ, ప్రజలందరూ జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఏర్పడిరదని, పోలీసులు మరింత అప్రమత్తంగా ఉండాలని జరుగుతున్న ఘటనలు సూచిస్తున్నాయి.