తెలంగాణకు టీడీపీ వ్యతిరేకం కాదు: చంద్రబాబు
posted on Oct 26, 2012 @ 4:12PM
తెలుగుదేశం పార్టీ తెలంగాణకు ఎప్పుడూ వ్యతిరేకం కాదని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. తమ వైఖరిని ఎప్పుడో తెలియజేశామని, తాను ఎప్పుడూ తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడలేదని, తెలంగాణపై అఖిలపక్షం ఏర్పాటు చేస్తామని చెప్పిన కేంద్రం ఇంతవరకు ఎందుకు పెట్టలేదని చంద్రబాబు ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని దెబ్బతీసేందుకే కాంగ్రెస్ పార్టీ కుట్రపన్నుతోందని, అందులో భాగంగానే టీఆర్ఎస్, వైఎస్సార్ పార్టీలను కలుపుకునేందుకు యత్నిస్తోందని ఆయన ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్‌కు తగిన విధంగా బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపునిచ్చారు.