Read more!

తెలంగాణలో జోరుగా సమగ్ర కుటుంబ సర్వే

 

తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కుటుంబ సర్వేకు చురుగ్గా జరుగుతోంది. ఎన్యూమరేటర్లకు వివరాలందించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఆది, సోమ వారాల్లో ప్రీ విజిట్ నిర్వహించిన ఎన్యూమరేటర్లు అందుబాటులోఉంచుకోవాల్సిన సమాచారం గురించి వివరించారు. ఇంటింటికీ కరపత్రాలు అందజేసి, ఇళ్ళమీద స్టిక్కర్లు అంటించారు. ఈ సర్వే మంగళవారం ఉదయం 7 గంటలకు మొదలైంది. పూర్తయ్యేంత వరకు ఎంత సమయమైనా నిర్వహిస్తారు. ఒక్కో ఎన్యూమరేటర్‌కు 40 ఇళ్లు.. అవసరాన్నిబట్టి అదనపు అసిస్టెంట్లను నియమించుకునేందుకు ఆదేశాలు జారీ చేశారు.