ఈ విపత్కర పరిస్థితుల్లోనూ ప్రజల్ని మభ్యపెడతారా? సీఎంపై టి.కాంగ్రెస్ ధ్వజం!
posted on Apr 15, 2020 @ 5:29PM
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంపై ఘాటుగా విమర్శలు చేస్తూ ముఖ్యమంత్రికి 22 ప్రశ్నలు వేసింది.
1. జన్ ధన్ యోజన పేరిట మహిళల జన్ ధన్ అకౌంట్లలో నెలకురూ.500 చొప్పున మూడు నెలల పాటు కేంద్రం డిపాజిట్ చేయనుంది. శుక్రవారం నుంచే అన్ని రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ ఈ స్కీమ్ మొదలైంది.
2.తెలంగాణలో అంతయోదయ, ప్రయారిటీహౌస్ హోల్డర్స్ జాబితా ప్రకారం కోటీ 92లక్షల మంది ఉన్నారు. వారందరికీ మూడు నెలల పాటు ప్రతి నెల ఉచితంగా 5 కిలోలబియ్యం, కిలో పప్పును ఇస్తోంది. అంటే 15కిలోల బియ్యం, 3 కిలోల పప్పు ప్రతి రేషన్కార్డు హోల్డెర్ కు అందనుంది.
3.తెలంగాణ లో ఉన్న తెల్ల కార్డులు ఉన్నవారు 87.59 లక్షలు.
4.తెలంగాణ లో ఉన్న రేషన్ డీలర్లు 17022 మంది.
5.వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నెలకు రూ. వెయ్యి చొప్పున పెన్చన్ను 3 నెలల పాటు కేంద్రం అందించనుంది. దీనివల్ల రాష్ట్రంలో ఆసరా పిన్షస్. పొందుతున్న 30 లక్షల మందికి పైగా లబ్జి చేకూరే అవకాశముంది.
6.ఉపాధి హామీ కార్మికులకు రోజూ వారి కూలీని రూ.182 నుంచి రూ.202కు పెంచింది. రాష్ట్రంలో 59 లక్షల మందికి లబ్ధి.
ఇప్పటికే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ రూ.4,431 కోట్లను విడుదల
చేసింది.
7. తెలంగాణ లో ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన లబ్ధిదారులు
10,75,202.
8. దీపం పథకం కింద TOI చమురు కంపెనీల డాటా ప్రకారం తెలంగాణ లో ఉన్న కుటుంబాలు 1.04cr. ఉన్న గ్యాస్ కనెక్షన్లు 1.14cr.
9.కేంద్ర ప్రభుత్వం నెలకు 5 kg బియ్యం, 1kg పప్పు ఇస్తే, ముఖ్యమంత్రి KCR 22.3.2020, GoMs 45 ప్రకారం ప్రకటించి న 12kg బియ్యం కలిపితే లబ్దిదారులకు రావలసింది. 5kg+12kg+=17kg బియ్యం, 1kg పప్పు = నెలకు 18kg. మరి ఇప్పుడు లబ్ధిదారులకు వచ్చింది 12kg. బియ్యం మాత్రమే, మిగతా 5kg బియ్యం,1 kg పప్పు ఏమైనట్టు ? ఈ 12kg లు కేంద్ర వాటా నా! రాష్ట్ర వాటా నా! రాష్ట్ర వాటా ఐతే కేంద్ర వాటా ఎక్కడ?
11.GoMs45 లో 87.59 లక్షల కార్డు లబ్ధిదారులకు 12kg ల బియ్యం ఈ ఒక్క నెల నేనా? కేంద్రం లాగా 3 నెలలా అనేది స్పష్టత లేదు.
ఓక వేల 3 నెల లైతె ...15kg+36kg+=51kg బియ్యం, 3kg పప్పు = నెలకు 54kg.
12. ముఖ్యమంత్రి KCR ప్రకటించిన 22.3.2020,GoMs 45 ప్రకారం 87.59 లక్షల తెల్ల రేషన్ కార్డు లబ్దిదారులకు ఇస్తామన్నా 1500 రూ ఆర్థిక సహాయం ఇంకెప్పుడూ ఇస్తారు.
13.తెల్ల రేషన్ కార్డు దరఖాస్తు చేసుకొని పెండింగ్ లో ఉండి పొందని వారు 18 లక్షల మంది పరిస్థితి ఏంటి?
14.లాక్ డౌన్ మొదలైనది ఏప్రిల్ 22 న ఈ రోజుకులాక్డౌన్ 22 రోజులు. మీ ఆర్థిక సహాయం ఇంకా ఎన్నడు ఇస్తారు?
15. తెలంగాణ ఆర్థిక శాఖా 19.3.2020 నాడు 1500cr కు DIPR RO NO 2686-DP/CL/Advt/2019-20 బాండ్ వేలం కోసం ప్రకటన చేసింది.
16. మార్చి 23 నే వేలం డబ్బులు వచ్చాయి. అవి ఎక్కడకు పోయాయి?
17. కేంద్రం నుండి మొదటి విడత కోరన విపత్తు కింద 269 cr. వచ్చాయి. మరి జీతభత్యా ల్లో కోత విధించారు.
18. దాతలు ఇచ్చిన కోట్ల రూపాయలు ఏమైనాయి.
19. భవన నిర్మాణ సంక్షేమ నిధులు వాడుకోవాలని కేంద్రం అనుమతి ఇచ్చిందా? లేదా? ఇస్తే ఎన్ని వేల కోట్లకు అనుమతి ఇచ్చింది.
20.GHMC పరిధిలో వలస కూలీలు 3 నుండి 4 లక్షల మంది ఉన్నారు. వారి వసతి, తిండి పరిస్థితి ఏంటి?
21. మీరు ఏర్పాటు చేసిన 200 food centers ఎక్కడ? వాటి బాధ్యతలను ఎవరూ చూస్తున్నారు.
22. రోజుకు average గా ఎంత మందికి కరోనా టెస్టులు చేస్తున్నారు.
Doctor's కి, nurse లకు ఎలాంటి రక్షణ వస్తువులు వాడుతున్నారు, సరిపడా అందుబాటులో ఉన్నాయా? N95 మాస్క్ లు ఎన్ని ఉన్నాయి?
కాలనీ వైస్ గా ఉన్న డాక్టర్ లను సంప్రదించి వారి ఏరియా పరిది లో ఉన్న ప్రజలకు డోర్ to డోర్ covid screening చేస్తే తొందరగా ఈ ప్రమాదం నుండి బయట పడవచ్చని తెలంగాణా కాంగ్రెస్ సూచించింది.