చైనా టూర్లో కేసీఆర్ బిజీబిజీ.. 3గంటలు 30 మీటింగులు
posted on Sep 9, 2015 @ 12:12PM
తెలంగాణ సీఎం కేసీఆర్ చైనా టూర్ లో భాగంగా నిన్న ఆయన ఫుల్ బిజీగా గడిపినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి అనేక పారిశ్రామిక వేత్తలతో చర్చించినట్టు తెలుస్తోంది.
ఈ చర్చలో ఆయన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వ్యాపార అవకాశాల గురించి పరిశ్రమల స్థాపనకు తాము చేపట్టిన కార్యక్రమాల గురించి చర్చించారు. అంతేకాదు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి ఎలాంటి వసతులు ఉంటాయి వాటితో పాటు పరిశ్రమల అనుమతుల విషయంలోనూ తాము చేపడుతున్న చర్యల గురించి ముచ్చటించారు. ఎలాంటి అవినీత లేకుండా పరిశ్రమలకు పెట్టుబడులు పెట్టడానికి అనుమతులు ఇస్తున్నామని తెలిపారు.
మొత్తం 3గంటల్లో 30 మంది పారిశ్రామికవేత్తల్ని కలిసిన కేసీఆర్.. వారికి తెలంగాణలో పరిశ్రమలలు పెట్టేందుకు అవకాశాల గురించి అవగాహన కల్పించే ప్రయత్నం చేశారని చెబుతున్నారు. దీనిలో భాగంగానే ప్రముఖ లియో గ్రూపు కంపెనీ రూ.వెయ్యి కోట్లతో తెలంగాణలో హెవీడ్యూటీ పైపుల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. మొత్తానికి కేసీఆర్ తెలంగాణలో పరిశ్రమలు స్థాపనకు బాగానే కష్టపడుతున్నట్టు తెలుస్తోంది.