సుజనా తిట్టారా?... పొగిడారా?

 

రాజకీయ నేతలు ఎమన్నా దానికి వేరే అర్ధం వచ్చేలా మాట్లాడుకోవడం పరిపాటైపోయింది ఈమధ్య. ఇప్పుడు కేంద్రమంత్రి సుజనా చౌదరి విషయంలో కూడా అలాగే జరిగింది. అదేంటంటే కేంద్రమంత్రి సుజనా చౌదరి ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్నారు. అయితే ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో మోడీ రాష్ట్రంలో చంద్రబాబు పాలకులుగా ఉన్నందువలన.. అభివృద్ధి పథంలో మనం దూసుకెళ్లిపోతామని అన్నరు. దాంతో పాటు మోడీ ప్రధాని అయిన తరువాత విదేశాలలో భారత ప్రతిష్ట మరింత పెరిగిందని అన్నారు. అంతే దీంతో సుజనా వ్యాఖ్యాలపై ఒకటే కామెంట్లు పడుతున్నాయి. విదేశంలో ప్రతిష్ట పెరిగిందంటే స్వదేశంలో పలచబడిపోయిందనేనా అని వ్యంగ్యాస్త్రాలు విసురుకుంటున్నారు.

మరోవైపు మోడీ కూడా విదేశీ పర్యటనలతో బిజీగానే ఉన్నారు. ఇప్పటికే మోడీ పర్యటనలపై ప్రతిపక్ష నేతలు కూడా విమర్శలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సుజనా చేసిన వ్యాఖ్యలను కూడా వ్యంగ్యంగానే తీసుకుంటున్నారు. అయితే సుజనా చౌదరి అంటే చాలా విధేయుడైన మంత్రి అనే పేరు ఉంది. మోదీపై ఆయన వెటకారంగా అని మాత్రం అని ఉండరు అని. మనస్ఫూర్తిగానే మోడీని కీర్తించి ఉంటారని పనిలేని వాళ్లు దాని కూడా వెటకారంలాగే అనుకుంటారని కొంతమంది నేతలు అనుకుంటున్నారు.

Teluguone gnews banner