ఉమ్మడి విజయనగరం జిల్లా తెలుగుదేశం క్లీన్ స్వీప్
posted on Jun 4, 2024 @ 4:30PM
ఉమ్మడి విజయనగరం జిల్లాను తెలుగుదేశం క్లీన్ స్వీప్ చేసింది. ఈ జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు ఒక పార్లమెంటు స్థానాన్ని కూడా తెలుగుదేశం కూటమి దక్కించుకుంది. జిల్లాలోని శృగవరపు కోట అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి కోళ్ల లలిత కుమారి విజయం సాధించారు. అలాగే నెల్లిమర్ల నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థి లోకం నాగ మాధవి విజయం సాధించగా, విజయనగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పూసపాటి అదితి గజపతి రాజు విజయం సాధించారు.
చీపురుపల్లి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం సీనియర్ నాయకుడు కిమిడి కళా వెంకటరావు విజయం సాధించారు. ఇక్కడ ఆయన మంత్రి బొత్స సత్యానారాయణపై గెలుపొందారు. అదే విధంగా గజపతినగరం నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస విజయం సాధించారు.
అలాగే బొబ్బిలి నుంచి తెలుగుదేశం అభ్యర్థి బేబినాయన విజయం సాధించగా, పార్వతీపురం నుంచి తెలుగుదేశం అఢ్యర్థి బోనెల విజయ్ చంద్ర, సాలూరు నుంచి తెలుగుదేశం అభ్యర్థి గుమ్మడి సంధ్యారాణి విజయం సాధించారు. కురుపాం నుంచి తెలుగుదేశం అభ్యర్థి తోయక జగదీశ్వరి విజయం సాధించారు. జిల్లాలో గజపతినగరం, బొబ్బిలి, పార్వతీపురం, కురుపాంలో విజయం సాధించిన అభ్యర్థులంతా తొలి సారి పోటీ చేసిన వారే కావడం గమనార్హం.