కాంగ్రెస్‌కు కాపులు దూరం!?
posted on Oct 22, 2012 @ 11:56AM
రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు మారుతున్నాయా అనే సందేహం ఇటీవలి పరిణామాలు చూస్తే కలుగుతుంది. మీకోసం వస్తున్నా పేరిట చంద్రబాబు చేపట్టిన పాదయాత్రకు కాపుల నుంచి మంచి స్పందన లభించినట్టు వార్తలు వస్తున్నాయి. మరోవైపున కాంగ్రెస్‌లో కాపులకు ప్రాధాన్యం ఇవ్వడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. చిరంజీవికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని, ఇది కాంగ్రెస్‌కు నష్టమని రాష్ట్ర మంత్రి రామచంద్రయ్య బాహాటంగానే ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ బలహీనపడుతోందని ఆయన అన్నారు. చిరంజీవిని బలోపేతం చేస్తేనే కాంగ్రెస్ బలపడుతుందని ఆయన చెప్పారు. దీని అర్ధం.. త్వరలో జరగబోయే కేంద్ర కేబినెట్ విస్తరణలో చిరంజీవికి మంత్రి పదవి ఇవ్వాలని. రాజ్యసభ సభ్యుడిగా వున్న చిరంజీవికి కేంద్ర కేబినెట్ బెర్త్ ఇదివరకే రిజర్వ్ అయింది. అయితే రాంబాబు సినిమా వివాదాన్ని అడ్డం పెట్టుకొని, కాంగ్రెస్ నేతలు కొందరు అధిష్టానానికి చిరంజీవిపై చాడీలు చెప్పారని మాజీ ప్రజారాజ్యం నాయకులు అనుమానిస్తున్నారు. అందుకే రామచంద్రయ్య ఆ విధంగా మాట్లాడారని వినికిడి.