జగన్ కేసులో నాగార్జున నిందితుడే
posted on Apr 13, 2013 @ 3:19PM
టీడీపీ నేత బాబూ రాజేంద్రప్రసాద్ నాగార్జున మీద సంచలన ఆరోపణలు చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులో నాగార్జున కూడా నిందితుడు. దీనిని నేను ఆధారాలతో సహా నేను త్వరలోనే బయటపెడతానని రాజేంద్రప్రసాద్ అన్నారు. నిమ్మగడ్డను సాకుగా చూపి వైఎస్ జగన్ ను కలిసి వస్తున్నాడని, నిమ్మగడ్డ, నాగార్జునల వ్యాపార లావాదేవీలు అందరికీ తెలుసని అయితే దాంతో పాటు ఆయన జగన్ అక్రమాస్తులలో కూడా భాగస్వామి అని ఆరోపించారు. గత నాలుగురోజులుగా టీడీపీ నాగార్జునను టార్గెట్ గా చేసుకొని విమర్శలు గుప్పిస్తోంది. ఆయన ఓ చెరువును ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్ నిర్మించారని , దానిని వైఎస్ హయాంలో క్రమబద్దీకరించుకున్నారని, దానికి ప్రతిఫలంగా గత ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రచారం చేశారని రేవంత్ రెడ్డి ఆరోపించారు. అయితే తన ఆస్తులన్నీ సక్రమం అని, కోర్టు కేసులున్న వాటి గురించి నేను మాట్లాడనని నాగార్జున అనగా, వాటి కాగితాలు బయటపెట్టాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.