14 రోజుల క్వారంటైన్ నిబంధన కనగరాజ్, గవర్నర్‌కు వర్తించదా?
posted on Apr 13, 2020 @ 12:04PM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు బిశ్వభూషణ్ హరిచందన్పై తెలుగుదేశం పార్టీ స్వరం పెంచి ఆరోపణలు చేస్తోంది. రాష్ట్ర ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ను ప్రభుత్వం తొలగించి, ఆయన స్థానంలో కనగరాజ్ను నియమించాక కనగరాజ్ గవర్నరును కలిసి బాధ్యతలు స్వీకరించడం లాక్డౌన్ నేపథ్యంలో ఎలా సాధ్యం అయిందని ప్రశ్నిస్తోంది.
కరోనావైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ అమలవుతూ ఇతర రాష్ట్రాల నుంచి రాకపోకలు నిలిపివేయగా చెన్నై నుంచి కనగరాజ్ వచ్చి నేరుగా బాధ్యతలు తీసుకోవడం, గవర్నరును కలవడం ఏమిటని, వీరికి రూల్స్ వర్తించవా అని టిడిపి నిలదీస్తోంది.
హైదరాబాద్ నుంచి వచ్చిన హాస్టల్ విద్యార్థులు, వలస కార్మికులకు ఒక రూల్, కనగరాజ్మరోక రూలా? 14 రోజులు క్వారంటీన్లో ఉండాల్సిన నిబంధన ఇప్పడు కనగరాజ్, గవర్నరు పాటిస్తారా? అని టిడిపి ప్రశ్నిస్తోంది.