ఆ ఎమ్మెల్యే ఎప్పుడు మత్తులోనే..
posted on Feb 12, 2021 @ 4:09PM
ఏపీలో పంచాయితీ ఎన్నికలు వ్యక్తిగత విమర్శలకు, ఆరోపణలకు దారితీస్తున్నాయి.. ఎన్నికల్లో పోటీచేయాలనుకున్న ఇతర పార్టీ అభ్యర్థులను వైసిపి నేతల నేతలు ఇరుకున పెట్టడం తో పాటు అక్రమ కేసులు పెడుతున్నారని.. అధికారులను కూడా అవమానిస్తున్నారంటూ వైసీపీ నాయకులపై టీడీపీ నేత బోండా ఉమ మండిపడ్డారు.
జగన్నాధ రథ చేకూరలాకింద ఎస్ఈసీ నిమ్మగడ్డ నలిగిపోతున్నారంటూ, నిమ్మగడ్డ ఏం పీకుతాడని మంత్రి కొడాలి నాని అన్నారని దుయ్యబట్టారు. వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎప్పుడూ ఎన్ని టైం మందు ( ఏటీఎం ) లో ఉంటాడని బోండా ఉమా అన్నారు. వైసీపీ మద్దతు ప్రకటించే అభ్యర్థులకు ఓటు వేయకపోతే... ప్రభుత్వ పథకాలు రావని జోగి రమేశ్ బెదిరిస్తున్నారని విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేరుగా పోటీ చేసే దమ్ములేక అడ్డదారులు తొక్కుతుందని పేరుకొన్నారు.. పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ చేసిన అక్రమాలపై రాష్ట్రపతి, కేంద్ర హోం మంత్రి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు.
పంచాయతీ ఎన్నికల్లో 90 శాతం ఏకగ్రీవాలు వైసీపీ టార్గెట్ గా పెట్టుకుందని... ఈ క్రమంలోనే అధికార యంత్రాంగాన్ని వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని, ప్రభుత్వాలకు వంతుపాడుతూ పోలీసులు కూడా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మహిళా అభ్యర్థులపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని. వైసీపీ ప్రభుత్వం ఎక్కువ కాలం మనుగడ సాగించలేదని వ్యాఖ్యానించారు. వైసీపీ నేతలకు వత్తాసు పలికే అధికారులు ఇబ్బందులు పడతారని ఉమ అన్నారు.