ఓటు వేయలేదు.. పింఛన్ కట్..
posted on Mar 3, 2021 9:15AM
తమ పార్టీకి ఓటు వేయలేదని, పింఛన్ ఇవ్వనన్నారు. పలుసార్లు లభిదారులు వెళ్లి మొర పెట్టుకున్న పింఛన్ ఇచ్చేది లేదని తెగేశారు. వెళ్లి దిక్కు ఉన్న చోట చెప్పుకోమన్నారు. గుంటూరు జిల్లాలో వైసీపీ కి ఓటు వేయలేదని 150 మందికి పింఛన్ ఇవ్వలేదు.
పింఛన్ దారుల చేత వేలిముద్రలు వేయించుకుని పింఛను ఇవ్వబోమంటున్నారని నరసరావుపేట మండలంలోని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీవో కార్యాలయంలో ఏవోకు, ఆర్డీవో ఈవూరి బూసిరెడ్డికి బాధితులు ఫిర్యాదు చేశారు. పింఛను డబ్బులు అడిగితే సాయంత్రం ఇస్తామన్నారని, సాయంత్రం అడిగితే మార్కెట్ యార్డు చైర్మన్, ఎమ్మెల్యేని కలవాలని వలంటీరు చెబుతున్నారని తెలిపారు. అదేమని అడిగితే.. దిక్కున్నచోట చెప్పుకోండని సమాధానమిస్తున్నారని కన్నీటిపర్యంతమయ్యారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార వైసీపీకి ఓటు వేయలేదనే కారణంతోనే గ్రామస్థులకు పింఛను ఆపివేశారని పమిడిపాడు సర్చంచి గౌసియాబేగం ఆరోపించారు.
ప్రజాస్వామ్య దేశంలో ఓటు అనేది ప్రజల స్వతంత్రపు హక్కు. తమ ఓటును వాళ్లకు నచ్చిన నాయకుడికి, నచ్చిన పార్టీలకు వేసుకుంటారు. అదే ప్రజాస్వామ్యం తన పార్టీకి ఓటు వేయలేదని పింఛన్ ఇవ్వకపోవడం, ప్రజల హక్కును హరించడం ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది. ఇలాంటి పరిస్థితి రాచరిక పాలనలో ఉండేదని. వాదించేవాడు మనవాడైతే వరసలో చివరిలో ఉన్న మనకు అందాల్సినది అందుతుందని, వైసీపీ ప్రభుత్వం తమకు ఓటువేసి వారికే పెన్షన్ ఇవ్వడం విడ్డూరమని పమిడిపాడు గ్రామానికి చెందిన 150మంది లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.