బాదుడే బాదుబు.. దేవిని ఓదార్చిన మీనాక్షి నాయుడు
posted on Jun 14, 2022 @ 1:33PM
ఇద్దరు అమ్మాయిలు కలిస్తే ప్రభాస్ గురించే మాట్లాడుకుంటారు. ఇద్దరు అబ్బాయిలు కలిస్తే తమన్నా గురించే మాట్లాడుకుంటారు. ఇద్దరు పిల్లల పిల్లల తల్లులు కలిస్తే అత్తింటి ఆరళ్ల గురించే మాట్లాడుకోవచ్చు. మావాళ్లు ఇలా అంటు న్నారు అంటే మావాళ్లే నయం అని తోటికోడళ్లు కొంగులు తడిపేసుకోవడం అనాదిగా వున్నదే.
రెండు పార్టీల వారు కలిస్తే ఒకరినొకరు తిట్టుకోవచ్చు. కానీ అందుకు విరుద్ధంగా జరిగింది ఆదోని మండ లం బల్లేకల్లులో! ఎంతో ఆశిస్తే జగన్ ప్రభుత్వం ఏమీ చేయలేదని టిడిపి నాయకుడు మీనాక్షి నాయుడిని చూసి ఆదోని బల్లేకల్లు వైసీపీ ఎంపిటీసీ సభ్యురాలు దేవీ కమ్మ కన్నీళ్లు పెట్టుకుంది. ఇన్నాళ్లకు తనను కలిసి కష్టాలు ఏమిటని, ఎలా వున్నారని అడుగుతున్నందుకు అమాంతం ఆమె ఘొల్లుమంది. అది చూసినవారు కూడా ఎంతో బాధపడ్డారు. ఎంతో ఆశించాము కానీ ఎంతో అన్యాయం జరుగుతోందని అనుకున్నారు.
జగన్ పాలన కడు దరిద్రంగా వుందని, జగన్‌ని దించేయడం అందరికీ మేలని ప్రచారం చేయడంలో భాగంగా తెలుగుదేశం బాదుడే బాదుడు అనే కార్యక్రమం చేపట్టింది. జగన్ పాలన అన్ని రంగాల్లో ప్రగతి శూన్యం, ప్రజాసంక్షేమం వూసే లేదని టిడిపి తిరుగుబాటు లేవనెత్తింది. బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా టిడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు అందరినీ కలుస్తూ ఇక వైసీపీ ప్రభుత్వం పని అయిపోయినట్టే, రాబోయేది మన పాలనే ఇబ్బందులు తొలగిపోతాయని అందరికీ ధైర్యం చెబుతు న్నారు. అలా ఆయన ఒక ఇంటికి వెళ్లేరు. ఆ ఇంట్లో వున్నది ఎవరో కాదు స్వయానా వైసీపీ ఎంపీటీసీ సభ్యురాలు దేవీ కమ్మ.
మీనాక్షినాయుడు అందరినీ కలిసినట్టే ఆమెనీ కలవడానికి వెళ్లారు. ఇక్కడే అనుకోని సంఘటన జరిగిం ది. ఆయన్ని చూడగానే దేవీ అమాంతం కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏమయిందక్కా.. అంటూ పలకరిస్తే వెక్కిళ్లు దిగమింగుకుంటూ అన్నా జగన్ పాలనలో అంతా గొప్పగా వుంటుందని అనుకున్నాను. కానీ ఏ మాత్రం సహాయసహకారాలు లేవు. నానా ఇబ్బందులూ పడుతున్నాము. దేనికీ ఉలకడు పలకడు. గతం లో చంద్రబాబు నాయుడుగారే వెయ్యి రెట్టు నయం అని ఏడ్చేసింది!
కష్టాలు కల కాలం వుండవు, మంచి కాలం ముందుంది, దిగులు పడకు. అంతా మంచే జరుగుతుందని మీనాక్షి నాయుడు ఆ వైసీపీ ఎంపి టీసీ దేవీ కమ్మకు ధైర్యం నూరిపోసారు. అంతేకదా.. ఏదయినా కాలమే చెబుతుంది. జగన్ పాలనలో అనుకున్నది ఒకటి, అయినది ఒకటి. దేవీ ఒక్కరే కష్టాన్ని ఇలా తమను ఆదరించి పలకరించడానికి వచ్చినవారికి కష్టాల గోడు పెట్టుకున్నారని అనుకోవద్దు. బాదుడే బాదుడు కార్యక్రమంలో ఇంకెంతో మంది ఈ విధంగా బాధలు చెప్పుకుంటున్నారు.