తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన బాబు
posted on Mar 14, 2024 @ 2:05PM
రానున్న ఎన్నికలలో పోటీ చేయనున్న తెలుగుదేశం అభ్యర్థుల రెండో జాబితాను ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు గురువారం (మార్చి 14) విడుదల చేశారు. ఈ సారి ఆయన 34 నియోజకవర్గాలలో పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు. తొలి జాబితాలో 94 నియోజకవర్గాలలో అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో తెలుగుదేశం జనసేన, బీజేపీలతో పొత్తులో భాగంగా రాష్ట్రంలో పోటీ చేయనున్న 144 అసెంబ్లీ స్థానాలలో 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లైంది. ఇక 31 స్థానాలలో అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రకటించిన రెండో జాబితాలో ముఖ్యంగా చెప్పుకోవలసింది చీపురుపల్లి నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారన్న విషయాన్ని ప్రకటించలేదు. ఆ స్థానం నుంచి పోటీ చేయాల్సిందిగా గంటా శ్రీనివాసరావును చంద్రబాబు కోరినప్పటికీ ఆయన విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని కోరినట్లు తెలుస్తోంది. దీంతో ఆ నియోజకవర్గాన్ని పెండింగ్ లో పెట్టారు. ఇక గోరంట్ల బుచ్చయ్య చౌదరి రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేయనున్నారు. అలాగే తొలి జాబితాలో స్థానం దక్కని సీనియర్ నాయకులు ఆనం రామనారాయణరెడ్డి, యరపతనేని, చితమనేని ప్రభాకర్ తదితరులకు చంద్రబాబు రెండో జాబితాలో టికెట్లు ఖరారు చేశారు. అదే విధంగా గత ఎన్నికలలో గాజువాక నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి జనసేనాని పవన్ కల్యాణ్ చేతిలో పరాజయం పాలైన పల్లా శ్రీనివాసరావుకు ఈ సారి కూడా గాజువాక స్థానాన్ని కేటాయించారు. ఇలా ఉండగా అధికార వైసీపీ తన అభ్యర్థులను ఈ నెల 16న ప్రకటించనుంది. ఆలోగా తెలుగుదేశం, జనసేన, బీజేపీలు తమ అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. చంద్రబాబు ప్రకటించిన రెండో జాబితా ఇలా ఉంది.
నరసన్నపేట - బగ్గు రమణ మూర్తి
గాజువాక - పల్లా శ్రీనివాసరావు
చోడవరం - కేఎస్‌ఎన్‌ఎస్ రాజు
మాడుగుల - పైలా ప్రసాద్
ప్రత్తిపాడు - వరుపుల సత్యప్రభ
రామచంద్రాపురం - వాసంశెట్టి సుభాష్
రాజమండ్రి రూరల్ - గోరంట్ల బుచ్చయ్య చౌదరి
రంపచోడవరం - మిర్యాల శిరీష
కొవ్వూరు - ముప్పిడి వెంకటేశ్వరరావు
దెందులూరు - చింతమనేని ప్రభాకర్
గోపాలపురం - మద్దిపాటి వెంకటరాజు
పెదకూరపాడు - భాష్యం ప్రవీణ్
గుంటూరు వెస్ట్ - పిడుగురాళ్ల మాధవి
గుంటూరు ఈస్ట్ - మహ్మద్ నజీర్
గురజాల - యరపతినేని శ్రీనివాసరావు
కందుకూరు - ఇంటూరి నాగేశ్వరరావు
మార్కాపురం - కందుల నారాయణ రెడ్డి
గిద్దలూరు - అశోక్ రెడ్డి
ఆత్మకూరు - ఆనం రాంనారాయణ రెడ్డి
కోవూరు (నెల్లూరు)- వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి
వెంకటగిరి - కురుగొండ్ల లక్ష్మీప్రియ
కమలాపురం - పుత్తా చైతన్య రెడ్డి
ప్రొద్దుటూరు - వరదరాజుల రెడ్డి
నందికొట్కూరు (ఎస్సీ) - గిత్తా జయసూర్య
ఎమ్మిగనూరు - జయనాగేశ్వర రెడ్డి
మంత్రాలయం- రాఘవేంద్ర రెడ్డి
పుట్టపర్తి- పల్లె సింధూరా రెడ్డి
కదిరి- కందికుంట యశోదా దేవి
మదనపల్లె- షాజహాన్ బాషా
పుంగనూరు- చల్లా రామచంద్రా రెడ్డి (బాబు)
చంద్రగిరి- పులివర్తి వెంకట మణి ప్రసాద్ (నాని)
శ్రీకాళహస్తి- బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి
సత్యవేడు- కోనేటి ఆదిమూలం (ఎస్సీ)
పూతలపట్టు- డాక్టర్ కలికిరి మురళీ మోహన్