బీఆర్ఎస్, బీజేపీ మధ్య రహస్య మైత్రి.. నిజమేనా?
posted on Mar 14, 2024 @ 2:42PM
రానున్న లోక్ సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపిక బీఆర్ఎస్, బీజేపీ రహస్య మైత్రి నిజమేనా అన్న అనుమానాలను రేకెత్తిస్తోంది. చాలా కాలంగా తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్, బీజేపీల రహస్య మైత్రిపై అనుమానాలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి. ఆ రెండు పార్టీల నేతలూ ఎన్ని రకాలుగా ఖండించినా ఆ అనుమానాలు మాత్రం పూర్తిగా నివృత్తి కాలేదు. ఒక విధంగా చెప్పాలంటే.. బీజేపీ, బీఆర్ఎస్ రహస్య మైత్రి అన్న వార్తలు ఇటీవలి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో రెండు పార్టీలకూ భారీ నష్టం చేకూరడానికి కారణమయ్యాయి.
ఇక ఎన్నికల తరువాత కూడా ఇరు పార్టీల మధ్యా రహస్య సంబంధం కొనసాగుతూనే ఉందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ ఆరోపణలకు బలం చేకూర్చే విధంగానే ఇరు పార్టీలూ కూడా రానున్న లోక్ సభ ఎన్నికలకు ఆ పార్టీల అభ్యర్థుల ఎంపిక ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటి వరకూ బీజేపీ వచ్చే లోక్ సభ ఎన్నికలకు సంబంధించి 15 మంది అభ్యర్థులను ప్రకటించింది. వారిలో అత్యధికులు బీఆర్ఎస్ నుంచి దిగుమతి అయిన వారే. అలాగే బీజేపీ తరఫున లోక్ సభ ఎన్నికల బరిలో దిగుతున్న బలమైన అభ్యర్థులకు ప్రత్యర్థులుగా బీఆర్ఎస్ అత్యంత బలహీనమైన అభ్యర్థులను పోటీకి దింపుతోంది. ఇందుకు ఉదాహరణగా మల్కాజ్ గిరి నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలో నిలబడ్డారు. ఇక బీఆర్ఎస్ తన పార్టీ అభ్యర్థిగా మల్కాజ్ గిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును రంగంలోకి దింపుతోంది. ఆయన ఏ విధంగా చూసినా ఈటలకు పోటీ ఇచ్చే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
అదే విధంగా నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా ధర్మపురి శ్రీనివాస్ రంగంలోకి దిగుతున్నారు. ఆయనకు ప్రత్యర్ధిగా సహజంగా ఎవరైనా సరే కల్వకుంట్ల కవిత నిలబడతారని అనుకుంటారు. అయితే కేసీఆర్ మాత్రం మల్కాజ్ గిరి బాజిరెడ్డి గోవర్ధన్ ను టికెట్ ఇచ్చారు. ఏ విధంగా చూసినా బాజిరెడ్డి ధర్మపురి శ్రీనివాస్ కు పోటీ ఇవ్వలేని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక చేవెళ్ల విషయానికి వస్తే అక్కడి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ గూటికి చేరనున్నారు. కాగా ఆ స్థానం నుంచి బీజేపీ ఇప్పటికే మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని అభ్యర్థిగా ఖరారు చేసింది. కాంగ్రెస్ తరఫున ఎటూ కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి రంగంలోకి దిగే అవకాశాలలే మెండుగా ఉన్నాయి. దీంతో ఇదర్దు బలమైన అభ్యర్థులను చేవెళ్లలో ఎదుర్కొవాలంటూ బీఆర్ఎస్ కూడా గట్టి అభ్యర్థిని నిలబెట్టాల్సి ఉంటుంది. అయితే ఆశ్చర్యకరంగా బీఆర్ఎస్ చేవెళ్ల నుంచి మాజీ ఎంపీ కాసాని జ్ణానేశ్వర్ కు పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక జహీరాబాద్ విషయానికి వస్తే అక్కడ బీఆర్ఎస్ ఎంపీ బీబీ పాటిల్ ఇప్పటికే బీఆర్ఎస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి టికెట్ దక్కించుకున్నారు.
ఆయనపై పోటీకి బీఆర్ఎస్ ఇప్పటి వరకూ ఏ ప్రత్యక్ష ఎన్నికలోనూ విజయం సాధించిన చరిత్ర లేని గాలి అరుణ్ కుమార్ కు కేటాయించారు. రానున్న ఎన్నికలలో పోటీ చేసే బీఆర్ఎస్ అభ్యర్థుల పేర్లను చూస్తే ఆ పార్టీ ఉాద్దేశపూర్వకంగానే బీజేపీకి బలమైన అభ్యర్థులు ఉన్న నియోజకవర్గాలలో ఉద్దేశపూర్వకంగా బలహీన అభ్యర్తులను నిలబెడుతోందన్ విమర్శకులు, పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తం మీద వచ్చే లోక్ సభ ఎన్నికల విషయంలో బీఆర్ఎస్ తీరు చూసిన పరిశీలకులు బీజేపీతో రహభస్య మైత్రి వైపునకే కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోందని విశ్షేషకులు.