అందగత్తె కాళ్ళు.. 250 కోట్లు
posted on Mar 13, 2015 @ 4:02PM
హాలీవుడ్ గాయని, నటి, నిర్మాత టేలర్ స్విఫ్ట్ ఎంత అందగత్తె అనే విషయం అందరికీ తెలిసిందే. కరడుగట్టిన సన్యాసులకు కూడా సంసారం పట్ల ఆసక్తిని కలిగించేంత ముఖ సౌందర్యం ఆమె సొంతం. ఆమె ముఖం మాత్రమే కాదు.. కాళ్ళు కూడా చాలా అందంగా వుంటాయని ఆమె వీరాభిమానులు చెబుతూ వుంటారు. ఆమె వేదికల మీద పాడుతూ, ఆడుతూ వుంటే ఆమె ముఖాన్ని చూడాలో, అందమైన కాళ్ళను చూడాలో అర్థంకాక సతమతం అయిపోతారు. చివరికి అందరి కళ్ళూ ఆమె కాళ్ళ దగ్గర ఫిక్సయిపోతాయట. టేలర్ స్విఫ్ట్ కాళ్ళకు అంత అదీ, ఇదీ వున్నాయి మరి. ఆమెవి అంత స్పెషల్ కాళ్ళు కాబట్టే ఆమె తన కాళ్ళని లేటెస్ట్‌గా భారతీయ కరెన్సీలో లెక్కేస్తే అక్షరాలా 250 కోట్లకి ఇన్స్యూర్ చేసింది. ఒకవేళ భవిష్యత్తులో తన కాళ్ళకు ఏమైనా అయితే తనకు ఇన్స్యూరెన్స్ కంపెనీ 250 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకుంది. టేలర్ తన కాళ్ళకు 60 కోట్ల రూపాయల విలువ వుంటుందని భావిస్తూ అంత మొత్తానికి ఇన్స్యూరెన్స్ చేయండయ్యా అని ఓ బీమా సంస్థని అడిగింది. దానికి ఆ సంస్థ వాళ్ళు మీ కాళ్ళు 60 కోట్లంత చవుకైన కాళ్ళు కావు.. 250 కోట్ల విలువైన కాళ్ళు అని అని చెప్పారు. దాంతో టేలర్ ఆ కాళ్ళతోనే ఎగిరి గంతేసి అంతే మొత్తానికి బీమా చేసేసింది. ఈ న్యూస్‌లో టేలర్ ముఖమే పెట్టారు కాళ్ళు పెట్టలేదని ఫీలవకండి.. వీలు చూసుకుని ఓసారి గూగుల్ ద్వారా ఆమె కాళ్ళ అందాన్ని ఆస్వాదించండి.