కొడుకు ప్రాణం తీసిన.. తల్లి మంత్రం..
posted on Jun 21, 2021 @ 2:04PM
దేవుడు, దెయ్యం ఏ రెండు ఎప్పటికి అర్థం కానీ పాఠాలు. అంతు చిక్కని సమాధానాలు.. ఒక రకంగా చెప్పాలంటే దేవుడు, ఈ భూత వైద్యం లేకుండా భారతదేశం ఉండదు.. మరో రకంగా అవి ఉన్నందుకే ఈ దేశం ఇలా ఉందేమో అనిపిస్తుంది. అలాగే ఈ సమాజంలో చాలా దేవుడు ఉన్నారని నమ్మితే.. ఇంకొంత మాది దేవుడు లేదు దెయ్యం లేదని చెప్పే వాళ్ళు లేకపోలేదు. మరికొంత మంది రెండింటి మధ్య న్యూట్రల్ గా కూడా ఉన్నారు ఈ సమాజంలో.. అయితే దేవుడు పేరు మీద పుణ్యం, జ్ఞానోదయం ఏం వస్తదోలేదో తెలియదుగాని, దెయ్యం పేరు మీద మాత్రం చాలా విచక్షణ మైన సంఘటనలు జరుగుతుంటాయి. సూటిగా చెప్పాలంటే మన దేశంలో దేవుడు, దెయ్యం, మాత్రం ఓ పెద్ద బిజినెస్.. వీటి పేరుతో మన దేశంలో జరగని మోసాలు లేవు. మదన పల్లి ఘటనలు, మొన్న ఈ మధ్య వరంగల్ లో జరిగిన సంఘటనలు మనం అభివృద్ధి పేరుతో మునకు వెళ్తున్నామా ? లేదా మూడాచారాల అడ్డం పెట్టుకుని వెనక్కి వెళ్తున్నామా అని డౌట్ గా ఉంటుంది. తాజాగా ఒక మంత్రాల పేరుతో బాలుడ్ని చిత్రహింసలు పెట్టి నిలువునా ప్రాణాలు తీసేసిన మూఢత్వం జరిగింది. అనారోగ్యంతో ఉన్న కొడుకుకు దెయ్యం పట్టిందనే మూఢ నమ్మకంతో కన్నతల్లి చిత్రహింసలు పెట్టి చంపింది. ఈ ఘటనలో తల్లి సహా మరో ముగ్గురు మహిళలను అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
అది తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా అరణిలో ముగ్గురు మహిళలు కలిసి ఏడేళ్ల పసివాడిని చిత్రహింసలు పెట్టారు. అది గమనించిన స్థానికులు కన్నమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్థానికుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కానీ, పాపం..అప్పటికే బాలుడు మృతిచెందాడు. దీంతో తల్లితో సహా ముగ్గురు మహిళలు పోలీసులు అరెస్ట్ చేశారు. కొడుకుకి దెయ్యం పట్టిందని, అందుకే పూజలు చేశామని, ఈ క్రమంలో బాలుడు చనిపోయాడని వారు పోలీసులకు తెలిపారు. కన్నతల్లి సబరియమ్మ మానసిక స్థితి సరిగ్గా లేదని, డబ్బుల కోసమే ఇదంతా జరిగి ఉంటుందని బంధువులు జరిగిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. సాక్షాత్తు రమణ మహర్షి కొలువైన తిరువన్నామలై లో జరిగింది. భక్తి పెరిగితే చివరికి ఆ భక్తి మూర్ఖత్వం పెరుగుతుందనే దానికి ఇలాంటి సంఘటనలే ప్రధాన కారణం అని కూడా చెప్పాలి.