అమెరికాకి వ్యాపించిన రాష్ట్ర విభజన
posted on Mar 23, 2015 9:04AM
ఆంద్రప్రదేశ్ రాష్ట్ర విభజన ప్రభావం అమెరికా వరకు కూడా వ్యాపించింది. ఇంతవరకు అమెరికాలో ఉన్న తెలుగువాళ్ళు అందరూ కలిసిమెలిసి పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేవారు. అమెరికాలో దాదాపు 10 లక్షల మంది తెలుగువారున్నారు. వారిలో 85 శాతం ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారు కాగా మిగిలిన 15 శాతం తెలంగాణాకు చెందిన వారు. తెలంగాణా ఉద్యమాలు ఉదృతం అయినప్పటి నుండి వారి మధ్య క్రమంగా దూరం పెరుగుతూ వస్తోంది. అయినా ఇంతవరకు అందరూ కూడా తానా, ఆటా, నాట్స్ వంటి సంస్థలలో సభ్యులుగా కలిసే ఉన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్ర విభజన జరిగి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది గనుక తానా (తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) లో సభ్యులుగా ఉన్న తెలంగాణా రాష్ట్రానికి చెందిన తెలుగువాళ్ళు వేరుపడి ‘తెలంగాణ అమెరికన్ తెలుగు అసోసియేషన్’ (టాటా)ను ఏర్పాటుచేసుకొంటున్నారు. నిజామాబాద్ ఎమ్.పి కవిత ఏప్రిల్ 5న న్యూజెర్సీలో ఈ సంఘాన్ని ప్రారంభిస్తారు.