బావిలో పడ్డ బాలుడు మృతి...
posted on Oct 29, 2019 @ 12:52PM
ఎనభై గంటలుగా కొనసాగినా ప్రయత్నాలు ఫలించలేదు, ఏదో అద్భుతం జరిగి ప్రాణాలతో బాలుడు బయటపడతాడనుకున్న ఆశలు ఆవిరైపోయాయి. నాలుగు రోజుల క్రితం తమిళనాడులో బోరు బావిలో పడ్డ చిన్నారి సుజిత్ ప్రాణాలు కోల్పోయాడు. సుజిత్ విల్సన్ మృతదేహం కుళ్లిపోయిన స్థితిలో ఉన్నట్టు అధికారులు గుర్తించారు. బోరు బావి నుంచి దుర్గంధం రావడంతో రెస్క్యూ ఆపరేషన్ నిలిపివేశారు. నాలుగు రోజులకు పైగా బోరుబావులోనే ఉన్న చిన్నారి శ్వాస ఆడక చనిపోయినట్టు నిర్ధారించారు. శరీరం డీకంపోజింగ్ స్టేజ్ లో ఉంది చిన్నారిని కాపాడేందుకు తాము ఎంతగానో శ్రమించినప్పటికీ దురదృష్టవశాత్తు రక్షించుకోలేకపోయామంటూ బాలుడి తల్లితండ్రులు ఓదార్చే ప్రయత్నం చేశారు అధికారులు.
శనివారం నుండి ఎన్.డీ.ఆర్.ఎఫ్ టీమ్ తో పాటు డాక్టర్ లు, మద్రాసు, ఐఐటీ నిపుణులు కూడా ఆపరేషన్ లో పాల్గొన్నారు. ఓ వైపు పైపులతో ఆక్సిజన్ అందించారు బాలుడు ఎంత లోతులో ఉన్నాడో గుర్తించి దానికి సమాంతరంగా గొయ్యి తవ్వడం మొదలు పెట్టారు కానీ, రోజులు గడవడం ఆక్సిజన్ సరిగా అందకపోవడం నీరు, ఆహారం లేక పోవడంతో సుజిత్ ప్రాణాలు విడిచాడు. సుజిత్ క్షేమంగా బయటపడాలని ప్రధాని మోడీ సహా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు ఆకాంక్షించారు కానీ, చిన్నారి ప్రాణాలు మాత్రం దక్కించుకోలేకపోయాం.
నిన్న సుజిత్ బోరు బావిలో ముప్పై ఆరు అడుగుల లోతులో ఉన్నట్టు మొదట గుర్తించారు అయితే, సహాయక బృందాలు బోరు బావికి సమాంతరంగా గొయ్యి తీయడం ప్రారంభించాక ముప్పై ఐదు అడుగుల దగ్గర నుంచి ఏకంగా వంద అడుగులకు జారిపోయాడు. మొత్తం ఆరు వందల అడుగుల లోతులో వేసిన బోరులో బాలుడు వంద అడుగుల దగ్గర చిక్కుకున్నట్లు గుర్తించి తీస్తున్న గొయ్యిని మరింత లోతుగా తవ్వటం ప్రారంభించారు. ఐఐటీ మద్రాస్ కు చెందిన నిపుణులు ఎన్.డీ.ఆర్.ఎఫ్, ఎస్.డీ.ఆర్.ఎఫ్ కు చెందిన ఆరు బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి అయినా ఫలితం లేకపోయింది.
అయితే, మున్సిపోల్స్ ముగిసిన తర్వాతే కొత్త సారధిని నియమిస్తారనే మాట గట్టిగా వినిపిస్తోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయితే... కొత్తగా వచ్చే టీపీసీసీ చీఫ్ కి ఎన్నికలను ఎదుర్కొనే అవకాశముండదని, ఈలోపు పార్టీని బలోపేతం చేయడానికి అవకాశం దొరుకుతుందని హైకమాండ్ భావిస్తోంది. మరి వరుస ఓటములతో సతమతమవుతోన్న టీకాంగ్రెస్ ను విజయాల బాట పట్టించగలిగే నాయకుడు వస్తాడో లేదో తెలియదు కానీ, కొత్త టీపీసీసీ చీఫ్ ఎంపిక మాత్రం అధిష్టానానికి కత్తి మీద సాములా మారిందంటున్నారు.