తాత్కాలిక డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా వరుసగా పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలు......

 

ఆర్టీసీ సమ్మె కారణంగా ప్రజల ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. ప్రైవేటు డ్రైవర్లు, కండక్టర్ల నిర్లక్ష్యంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు ప్రమాదాలకు గురవుతున్నాయి. నల్గొండ జిల్లాలో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. శెట్టిపాళెం వద్ద కరెంటు స్తంభాన్ని ఢీకొని పంట పొలాల్లోకి వెళ్లి బోల్తా పడింది ఆర్టీసీ బస్సు. ఇక పిడుగురాళ్లలో డిపో బస్ తో జరిగిన ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి. ఇటు నల్గొండ జిల్లాలోనూ ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఇలాంటి ప్రయాణం తాము చేయలేమంటూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ఇక ఆర్టీసీ సమ్మె కొనసాగితే మరింత ఇబ్బందుల్లో తప్పవంటూ ప్రయాణికులు వాపోతున్నారు. వరుసగా జరుగుతున్న ఆర్టీసీ బస్సు ప్రమాదాలతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. నల్గొండ జిల్లా వేములపల్లి మండలం శెట్టిపాలెం శివారులో నార్కట్ పల్లి అద్దంకి రహదారి పై ఉదయం తెల్లవారుజామున ఆరు గంటల ప్రాంతంలో ఒక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. పిడుగురాళ్ల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, హైదరాబాద్ నుంచి పిడుగురాళ్ల వైపుకు వెళ్తోంది. అయితే శెట్టిపాలెం శివారు లోకి రాగానే హైవే పై ఒక టర్నింగ్ వద్ద ఆర్టీసీ బస్సు రోడ్డు పక్కన ఉన్న కరెంట్ స్థంభాన్ని ఢీ కొడుతూ ఆ తర్వాత పక్కనే ఉన్న పంట పొలాల్లోకి పల్టీ కొట్టింది.

అయితే ఈ సమయంలో ఆర్టీసీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే కరెంటు స్తంభానికి ఢీకొట్ట గానే ఒక్క సారిగా భారీ శబ్దం వచ్చింది. ఆ తర్వాత రోడ్డు పక్కకు బస్సు ఒరిగి పల్టీ కొట్టింది. అయితే రోడ్ పక్కన పల్టీ కొట్టిన సమయంలో బస్సు చాలా స్లో గా ఉండి పల్టీ కొట్టటం తోటి పెద్దగా ప్రమాదం ఏమి జరగలేదు.బస్సులో ఎనిమిది మంది ప్రయాణికులు ఉండగా వారిలో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అవనిగడ్డ పోలీసులు సంఘటనా స్థాలానికి వచ్చి పరిశీలించారని సమాచారం.
 

Teluguone gnews banner