టీ-20 ప్రపంచకప్.. ఈ నలుగురిపైనే అందరి దృష్టి
posted on Oct 22, 2022 @ 10:05AM
టీ-20 ప్రపంచకప్ పోటీలు సూపర్ 12 దశ పోటీలు ఆరంభమయ్యాయి. ఇక ఇపుడు అసలు పోటీలు మొదలయినట్టే. ఈ పర్యాయం వరల్డ్‌కప్‌కి తొలిసారిగా ఆడుతున్న ప్లేయర్ల పైనే ఎక్కువ దృష్టి ఉంటుంది. నలుగురు ప్రధానంగా ఉన్నారు. వారంతా వారి దేశాల్లో అన్ని టోర్నీల్లోనూ అద్బుత ప్రద ర్శన ఇచ్చి, ప్రపంచకప్ జట్టుకు ఎంపికయి జట్టు విజయాలకు కీలకపాత్ర వహించాలన్న పట్టుదలతో ఉన్నారు. వారి గురించి తెలుసు కుందాం..
ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ కామెరూన గ్రీన్.. ఇటీవలి టీ-20 సిరీస్‌ల్లో ఎంతో గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శి స్తున్న ఆసీస్ యువ స్టార్ గ్రీన్. జోష్ ఇంగ్లిస్ మోచేతి గాయంతో ఇతనికి జట్టులో స్థానం లభించింది. అది సాధా రణంగా అనుకునే మాట. కానీ అతని బౌలింగ్, బ్యాటింగ్ నైపుణ్యం ఇప్పటికే ప్రపంచ క్రికెట్ వీరాభిమానులు గమనించారు. గ్రీన్ జట్టులో ఉంటే తప్పకుండా మంచి స్కోర్ చేయగలమన్న నమ్మ కంతో ఉంది ఆసీస్. ముఖ్యంగా ఇటీవల భారత్‌తో తలపడిన మ్యాచ్‌లో కేవలం 30 బంతుల్లో 61 పరుగు లు సాధించిన సత్తా అతనిది. అతని బ్యాటింగ్ నైపుణ్యంతోనే ఆసీస్ 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేయగలిగిందని ఇప్పటికీ చెప్పవచ్చు. అతన్ని జట్టులోకి తీసుకోవడం కెప్టెన్ ఆరన్ ఫించ్‌కి గొప్ప ప్రయోజనమనే అనాలి. అతనంతటి సామర్ధ్యం గ్రీన్‌లో కెప్టెన్‌గా ఫించ్ గమనిం చాడు. ఇప్పటివరకూ 7 టీ-20లో ఆడి 136 పరుగులు చేయడంతో పాటు బౌలర్‌గా 5 వికెట్లు కూడా తీసిన ఆల్‌రౌండర్ గా అందరినీ ఆకట్టుకున్నాడు.
మరో మంచి యువ ప్లేయర్ పాక్ పేసర్ నసీమ్ షా. ఆగస్టులో అతను వైట్‌బాల్ టోర్నీ ఆడాడు. కానీ పాక్ గొప్ప ప్లేయర్ల దృష్టిని ఇట్టే ఆకట్టుకున్నాడు. రాబోయే కాలంలో ఎంతో మంచి ప్లేయర్ అవుతాడన్న నమ్మకాన్ని కలిగించారు. 19 ఏళ్ల నసీమ్ ఈ ఛాంపియన్‌సిప్‌లో పాక్‌కు విజయావకాశాలు కల్పించగల డనే క్రికెట్ పండితులు సైతం అంటున్నారు. ముఖ్యంగా ఇటీవలి ఆసియాకప్‌లో భారత్‌పై అతని బౌలింగ్ అత్యంత అద్భుతంగా ఉంది. ఇంతవరకూ 9 టీ-20లు ఆడిన పాక్ పేసర్ 11 వికెట్లు తీసుకు న్నాడు. బెస్ట్ 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీయడం.
తర్వాత అందరూ గమనించాల్సిన ప్లేయర్ ఫిన్ ఆలెన్. న్యూజిలాండ్ బ్యాటర్, వికెట కీపర్. టీ-20 ప్రపం చ కప్ లో మొదటిసారిగా ఆడుతున్న ఫిన్ తప్పకుండా తన జట్టు ఆశలకు మరింత బలం చేకూర్చగల డనే అనుకోవాలి. 23 ఏళ్ల ఫిన్ ఇటీవల బంగ్లాదేశ్ మీద తన బ్యాటింగ్ సామర్ధ్యం ప్రదర్శించి 56 బంతుల్లో సెంచరీ చేయడం, పాకిస్తాన్ పై 42 బంతుల్లో 62 పరుగులు చేయడం అంద ర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రత్య ర్థులను అతను ఎదుర్కొన్న తీరు షాట్ సెలక్షన్ అంతా ఎంతో అనుభవ జ్ఞుడిలా ఉందని అందరి ప్రశం సలూ అందుకున్నాడు. ఇంతవరకూ అతను ఆడిన 18 మ్యాచ్‌ల్లో 469 పరుగులు చేయగా అత్యధికంగా ఒక సెంచరీ కూడా చేశాడు.
మరో అద్భుత యువ ప్లేయర్ భారత్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్. 2021 ఐపీఎల్‌లో పంజాబ్ తరఫున ఆడిన ఈ యువపేసర్ అంతకుముందు 2018 అండర్ 19 ప్రపంచకప్ ఆడిన అనుభవం ఉంది. 23 ఏళ్ల లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఇటీవలి ఆసియాకప్‌లోనూ అంతే అద్భుతంగా బౌలింగ్ ప్రదర్శనతో సెలక్టర్లను, ప్రత్యర్ధి జట్లను ఆకట్టుకున్నాడు. జట్టులో బూమ్రా లేని లోటు షమ్మీతో పాటు సింగ్ కూడా తీరుస్తాడని అంతా గొప్ప నమ్మకంతో ఉన్నారు. కెప్టెన్ శర్మ ఫావరేట్‌గా ఈ పర్యాయం జట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అర్షదీప్ ఇంతవరకూ 13 టీ-20లు ఆడి 19 వికెట్లు తీశాడు. బెస్ట్ 12 పరుగులకు 3 వికెట్లు తీయడం.