ట్వంటీ20 ప్రపంచ కప్ కు యువరాజ్ సింగ్ ఎంపిక

క్యాన్సర్ వ్యాధి చికిత్స తరువాత యువరాజ్ సింగ్ భారత జట్టులోకి తిరిగి వచ్చాడు. శ్రీలంకలో జరిగే ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ పోటీలకు యువరాజ్ సింగ్‌ ఎంపికయ్యాడు. ఐసిసి ట్వంటీ20 ప్రపంచ కప్ కు 15 మందితో కూడిన భారత జట్టుకు యువరాజ్ సింగ్‌ను బిసిసిఐ సెలెక్టర్లు ఎంపిక చేశారు. యువరాజ్ సింగ్ గత సంవత్సరం నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు మ్యాచులో చివరిసారి ఆడాడు. అప్పటి నుంచి అతను క్రికెట్‌ క్రీడకు దూరంగానే ఉన్నాడు. హర్భజన్ సింగ్‌తో పాటు లక్ష్మీపతి బాలాజీ, పియూష్ చావ్లాలకు ట్వంటీ20 జట్టులో తిరిగి స్థానం లభించింది.

 


భారత జట్టు వివరాలు : ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతం గంభీర్, సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, మనోజ్ తివారీ, జహీర్ ఖాన్, అశోక్ దిండా, ఆర్ అశ్విన్, పియూష్ చావ్లా, లక్ష్మీపతి బాలాజీ, హర్భజన్ సింగ్, రోహిత్ శర్మ

తెలంగాణ ఎన్నికల్లో కేరళ స్టోరి ప్రచారాస్త్రం

ఇటీవలె కర్ణాటకలో బిజెపి ఘోర పరాజయం చెందిన తర్వాత  కూడా వాళ్ల వైఖరిలో మార్పు రాలేదు అని వెల్లడౌతుంది.  కాంగ్రెస్ మేనిఫెస్టోలో తాము మళ్లీ అధికారంలో వస్తే భజరంగ్ దళ్ పై ఉన్న నిషేధం అమలు చేస్తామని పేర్కొనడంతో కర్ణాటక ఫలితాలను ప్రభావితం చేసింది. ఒక దశలో కాంగ్రెస్ మేనిఫెస్టో ను బిజెపి కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి చించివేశారు బిజెపి నేతలు. భజరంగ్ దళ్ ను నిషేధిస్తే భజరంగ్ దళ్ పల్లెత్తు మాట అనలేదు కానీ బిజెపి నేతలు మాత్రం చొక్కాలు చింపుకున్నంత పని చేశారు.  తెలంగాణా రాష్ట్రంలో కూడా బిజెపి మతోన్మాదాన్ని రెచ్చగొట్టే ఫార్ములా అమలు చేయబోతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో యువ ఓటర్లను ఆకర్షించడానికి వివాదాస్పద ‘‘ ది కేరళ స్టోరి’’ సినిమా స్క్రీన్స్ వేయాలని యోచిస్తోంది. ఇటీవలె ఆదిలాబాద్ జిల్లా బిజెపి ఈ సినిమా ప్రత్యేక షో వేసారు. తెలంగాణలో హిందూ ఓటర్లను ఆకర్షించడానికి బిజెపి పన్నాగాల్లో ఈ సినిమా ఒక ప్రచారాస్త్రంగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాల్లో స్క్రీన్లు వేసి లవ్ జిహాద్ అంశాన్ని ప్రజలకు తెలియజేస్తామని బిజెపి నేతలు చెబుతున్నారు. హిందూ యువతులు లవ్ జిహాద్లో పడకూడదన్న ఉద్దేశ్యంతో ఈ సినిమాను గ్రామ గ్రామాన ప్రదర్శిస్తామని ఆదిలాబాద్ జిల్లా బిజెపి అధ్యక్షులు పాయల్ శంకర్ తెలిపారు. కేరళ స్టోరీలో 32,000 హిందూ అమ్మాయిలు కనిపించకుండాపోయి టెర్రరిస్ట్ గ్రూప్ అయిన ఐసిస్ లో  చేరతారు. తెలంగాణలో 119 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, ఎంఐఎం పార్టీలు అభ్యర్థులను నిలబెట్టనున్నాయి.