హైకమాండ్ పై జానారెడ్డి గరం గరం
posted on Mar 13, 2013 @ 11:06AM
కేంద్ర హోమ్ మినిస్టర్ సుశీల్ కుమార్ షిండే నెలరోజుల్లో తెలంగాణాపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పి నెలలు గడుస్తున్నా ఎటూ తేల్చకపోవడంతో పంచాయితీ రాజ్ మంత్రి తెలంగాణావాది కుందూరు జనార్థన్ రెడ్డి హైకమాండ్ పై గుర్రుగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కావాలంటే ముందుగా తెలంగాణా సమస్య పరిష్కారం కావాలని, నెలరోజుల్లోగా, స్థానిక ఎన్నికల తరువాత తెలంగాణా సమస్యపై అధిష్ఠానం తమ స్పష్టమైన వైఖరి తెలియజేయాలని హైకమాండ్ ను డిమాండ్ చేశారు. జానారెడ్డి, తెలంగాణా మాత్రులు, తెలంగాణా నాయకులు తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు చేయవలసిందేనని హైకమాండ్ కు అల్టిమేటం జారీ చేశారు.