Supreme Court sensational verdict

 

Supreme Court, which earlier has obliged the Central government to follow its orders of disqualifying the people’s representatives those who were convicted by the courts from contesting in the elections, later makes the Election Commission introduce a ‘Reject Button’ in Electronic voting Machines, thus to give a choice to people to reject the contestants, if they believe none of them deserved to be elected.

 

Today once again, a Supreme Court bench headed by Justice K S Radha Krishnan asks the IAS officers not to follow the verbal orders given by the political executives, instead demand for orders in written form, so as to insulate themselves from transfers, punishments for not their faults.

 

The bench also asks the Centre and all State governments along with Union Territories to issue directions within three months for providing fixed tenure to civil servants. It asks the governments to constitute Civil Services Board at the Centre and State-levels.

 

The apex court opines that giving a fixed minimum tenure to a civil servant will promote professionalism, efficiency and also led to good governance. The bench also asked the Central government to pass a bill that regulates matters related to IAS official’s postings, transfers and disciplinary action against them.

 

IAS officer Ashok Khemka of Haryana cadre got transferred for more than 42 times in a short span of 2 years by the Haryana government and he hits the bull’s eye by ordering investigation into DLF-Robert Vadra land deal only to be shunted to some unimportant position.

 

The story is of Durga Sakhti Nagpal of UP cadre is also no different from him. Akhilesh Yadav government suspends her framing false charges against her, who boldly took-upon the sand mafia, which has links with some ministers in Akhilesh government.

 

After seeing repetition of such bad experiences to honest IAS officers like them, Public Interest litigation was filed by 83 retired bureaucrats including former Cabinet Secretary T S R Subramanian seeking its directions for insulating bureaucracy from political interference and the Supreme Court responds very positively on it.

చమురు మంటలతో పచ్చదనం పలచబడిపోతున్న కోససీమ

భూమికి పచ్చని రంగేసినట్లు హరిత శోభతో కళకళలాడే కోనసీమ ఇప్పుడు చమురు మంటల వేడి సెగలకు మాడిపోతోంది. పచ్చదనం పలచబడిపోతోంది.  కోనసీమ తీర ప్రాంతంలో అపార చమురు, సహజవాయు నిక్షేపాలున్నయన్న సంగతి వెలుగు చూసినప్పటి నుంచీ ఇక్కడి పచ్చదనానికి శాపం తగిలిందోమో అనిపిస్తుంది. ఓఎన్జీసీ చమురు, సహజవాయు అన్వేషణ ప్రారంభించిందో  అప్పటి నుంచే కోనసీమ పచ్చదనం పలచబడిపోవడం మొదలైంది. ఢ్రిల్లింగ్ పేరుతో తీర ప్రాంతంలో ఇష్టారీతిగా రిగ్గులు వేసేసిన ఓఎన్జీసీ.. అప్పటి నుంచే కోనసీమ వాసుల ఆరోగ్యంపై ప్రభావం పడటం మొదలైంది. తీర ప్రాంత గ్రామాల వారు కాలేయ సంబంధిత వ్యాధులకు గురి కావడం మొదలైంది. ఇదంతా చమురు, సహజవాయువు అన్వేషణ పేరుతో ఎఎన్జీసీ చేస్తున్న ప్రకృతి విధ్వంసం ఫలితమే అంటున్నారు వైద్య నిపుణులు, పర్యావరణ ప్రేమికులు.   సరిగ్గా మూడు దశాబ్దాల కిందట ఇదే కోనసీమలోని  పాశర్లపూడి గ్రామంలో వచ్చిన బ్లోఅవుట్‌తో కోనసీమ ఉలిక్కిపడింది. అంతకు ముందు ప్రకృతి వైపరిత్యాలను మాత్రమే అనుభవించిన కోనసీమ ప్రజ మానవ తప్పిదం కారణంగా తీరని నష్టాన్ని చవి చూసింది. ఆ తరువాత కూడా బ్లో ఔట్ లు జరుగుతూనే ఉన్నాయి.  తాజాగా కోనసీమలోని ఇరుసుమండ గ్రామంలో బ్లోఔట్ సంభవించింది. వారం రోజులుగా మంటలు ఎగసిపడుతూనే ఉన్నాయి. పచ్చని కొబ్బరి చెట్లు మూడు నాలుగు నిలువుల బొగ్గు చెట్లుగా మారిపోయాయి. కోనసీమలో భోగి మంటను ఓఎన్జీసీ ముందే వేసేసిందనీ, సంక్రాంతి పండగకు ముందు జరుపుకునే భోగి భోగభాగ్యాలను తీసుకువస్తుందంటారు. కానీ.. ఓఎన్జీసీ వేసిన ఈ భోగి మంట భోగభాగ్యాలను తుడిచేస్తోందనీ ఈ ప్రాంత వాసులు అంటున్నారు. ఇక ఇప్పుడు ఓఎన్జీసీ ఈ బ్లోఔట్ ను ఆపడం సాధ్యం కాదని తేల్చేసింది. మంటలు ఎగసిపడుతున్న బావిని శాశ్వతంగా మూసేయడమే మర్గమని నిర్ణయించింది. మూడు దశాబ్దాల కిందట పాశర్లపూడి బ్లో ఔట్ సమయంలోనూ ఇదే జరిగింది. ఇప్పుడు ఈ బ్లో ఔట్ సంభవించిన బావిని మూసేయాలంటే   భారీ మడ్ ఫిల్లింగ్ యంత్రాలను సంఘటనా స్థలానికి తరలించడానికి పచ్చటి పొలాలకు అడ్డంగా భారీ రోడ్ల నిర్మాణం చేపట్టాలి. ఓఎన్జీసీ ఇప్పటికే ఆ పని మొదలెట్టేసింది. మొత్తంగా కోనసీమ చమురు, సహజవాయువుల నిక్షేపాల గని అని సంబరపడటానికి లేకుండా, వాటి వెలికితీత, అన్వేషణ చర్యల కారణంగా నిత్య రావణకాష్టంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

కేటీఆర్ క్లూలెస్.. కవిత డామినేట్స్!

తెలంగాణ రాజకీయాలలో బీఆర్ఎస్ ను కవిత విమర్శలు ఫేడౌట్ చేస్తున్నాయా? ఆమె విమర్శలకు దీటుగా బదులివ్వడంలో బీఆర్ఎస్ తడబడుతోందా? సొంత అన్నపై కూడా కవిత నేరుగా విమర్శలు సంధిస్తున్నా.. బీఆర్ఎస్ అగ్రనాయకత్వం మౌనం ఆ పార్టీ రాజకీయ పునాదులను కదిపేస్తోందా? అంటే ఔననే అంటున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మండలి వేదికగా కల్వకుంట్ల కవిత సోమవారం చేసిన ఉద్వేగభరిత ప్రసంగాన్ని సభలో బీఆర్ఎస్ సభ్యులు కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించకుండా మౌనంగా ఉండిపోవడం, మండలి చైర్మన్ సైతం సమయ నియమాన్ని పట్టించుకోకుండా ఆమె ప్రసంగాన్నికొనసాగించడానికి అనుమతి ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన వారైనప్పటికీ.. ఆ పార్టీని విమర్శలతో చెండాడేస్తున్న కవితను కనీసం అడ్డుకోవడానికి కూడా ప్రయత్నించలేదు. అదే సమయంలో కవిత తన భావోద్వేగ ప్రసంగంలో బీఆర్ఎస్ పార్టీలో తాను ఎలా అవమానాల పాలైనదీ, తనను ఎలా పక్కన పెట్టేశారు. ఎలా బయటకు పంపేశారు అన్న విషయాన్ని చాలా చాలా ఎమోషనల్ గా చెప్పారు. అదే సమయంలో తాను పార్టీకి చేసిన సేవలనూ ప్రస్తావించారు.  ఆమె ఎమోషనల్ గా చేస్తున్న ప్రసంగాన్ని అడ్డుకుంటే ఆమెకు సానుభూతి మరింత పెరుగుతుందన్న భయంతో బీఆర్ఎస్ సభ్యులు మౌనం వహించి ఉంటారని అంటున్నారు. అయితే సభలో తన చివరి ప్రసంగం చేసి ఇప్పుడు వ్యక్తిగా ఒంటరిగా వెడుతున్నా.. కానీ ఒక శక్తిగా మళ్లీ తిరిగొస్తానంటూ ఆమె సభను వీడారు. ఇక మండలిలో ఇదే ఆమె చివరి ప్రసంగం అనడంలో సందేహం లేదు. అయితే ఈ ప్రసంగం ఆమె కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేయడం తథ్యమన్న సంకేతాన్ని ఇచ్చింది. ఇంత స్పష్టంగా కవిత బీఆర్ఎస్ ను ఎండగట్టినా ఆ పార్టీ అగ్ర నేతలెవరూ ఇంత వరకూ నేరుగా స్పందించలేదు. అసలు కవిత విషయంలో ఎలా స్పందించాలో వారికి తెలియడం లేదని పరిశీలకులు అంటున్నారు.   అయితే కవిత పై బీఆర్ఎస్ సోషల్ మీడియా వేదికగా కవితపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  కవిత బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో అవినీతిని వేలెత్తి చూపుతుంటే.. దానిని ఖండించడం మాని.. కవిత కూడా అవినీతికి పాల్పడ్డారన్నకోణంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా కవితపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంటే పరోక్షంగా బీఆర్ఎస్ హయాంలో కవిత చెప్పినట్లుగా అవినీతి జరిగిందని అంగీకరిస్తున్నటుగా ఉందని పరిశీలకులు అంటున్నారు.  ఇంకా స్పష్టంగా చెప్పాలంటే రాజకీయంగా కవితను ఎలా ఎదుర్కొనాలన్న విషయంలో పార్టీలో  గందరగోళం నెలకొందన్న విషయాన్ని ఈ పరిస్థితి తేటతెల్లం చేస్తోందని   విశ్లేషిస్తున్నారు. ఇక కేటీఆర్ పై నేరుగా కవిత విమర్శల వర్షం కురిపిస్తున్నా ఆయన నేరుగా స్పందించకపోవడం పొలిటికల్ గా కవితకు అడ్వాంటేజ్ గా మారే అవకాశాలున్నాయని అంటున్నారు. కవిత విషయంలో కేటీఆర్ క్లూ లెస్ గా ఉంటే.. కవిత మాత్రం బీఆర్ఎస్ ను డామినేట్ చేసి పోలిటికల్ మైలేజ్ సాధిస్తున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

భోగాపురం ఎయిర్ పోర్ట్.. క్రెడిట్ వార్.. వాస్తవమేంటంటే?

విజయనగరం జిల్లాలో నిర్మాణంలో ఉన్న భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ అయ్యింది. ఢిల్లీ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా విమానం ట్రయల్ రన్‌లో భాగంగా భోగాపురం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ అయ్యింది. ఈ విమానంలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ కలిశెట్టి తదితరులు ప్రయాణించారు.   భోగాపురం ఎయిర్‌పోర్ట్ అత్యాధునిక అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం జరుపుకుంటోంది. 3.8 కిలోమీటర్ల పొడవైన రన్‌వేతో ఈ విమానాశ్రయం రూపుదిద్దుకుంది. పూర్తి స్థాయిలో ప్రారంభమైతే రోజుకు సుమారు 300 విమానాలు ల్యాండింగ్, టేక్‌ఆఫ్ చేయగల సామర్థ్యం కలిగి ఉంటాయి. రెండు వైపుల నుంచీ ల్యాండింగ్, టేక్‌ఆఫ్ సదుపాయం ఉండటం ఈ విమానాశ్రయం ప్రత్యేకత. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో  పాటు  భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఎయిర్‌పోర్ట్‌ను తీర్చిదిద్దుతున్నారు. ప్రస్తుతం భోగాపురం ఎయిర్‌పోర్ట్ పనులు దాదాపు 95 శాతం పూర్తయ్యాయి. నిర్మాణ సంస్థ జీఎంఆర్ జూన్ నెలలో పూర్తి స్థాయిలో విమానాశ్రయ కార్యకలాపాలను ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ ఎయిర్‌పోర్ట్ ప్రారంభంతో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త ఊపిరి అవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల అభివృద్ధిలో భోగాపురం విమానాశ్రయంలో తొలి విమానం ల్యాండిగ్ ఒక మైలు రాయిగా చెప్పొచ్చు. అయితే ఈ విమానాశ్రయం ఘనత తనదేనంటూ వైసీపీ క్రెడిట్ కొట్టేయడానికి చేస్తున్న ప్రయత్నం ఒక రాజకీయ చర్చకు దారి తీసింది.   మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, ఈ విమానాశ్రయానికి అవసరమైన కీలక అనుమతులన్నీ తన హయాంలోలో వచ్చాయని చెప్పుకుంటున్నారు. అలాగే  ఈ విమానాశ్రయానికి అవసరమైన భూ సేకరణ కోసం తన హయాంలోనే దాదాపు 960 కోట్ల రూపాయలు వ్యయం చేశామని అంటున్నారు.  అయితే వైసీపీ అధినేత జగన్ మాటలను టీడీపీ కొట్టి పారేస్తోంది. భోగాపురం విమానాశ్రయం 2015లోనే  అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడి హయాంలోనే ప్రణాళికలు రూపొందాయనీ, దీనికి కేంద్ర అనుమతులు, భూ సేకరణ, ప్రాథమిక నిర్మాణాలూ చంద్రబాబు హయాంలోనే పూర్తయ్యాయనీ చెబుతోంది.  అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పడకేసిందనీ, జగన్ ప్రభుత్వం ఈ విమానాశ్రయ నిర్మాణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందనీ, మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు నాయకత్వంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత భోగాపురం విమానాశ్రయ నిర్మాణం వేగం పుంజుకుందనీ చెబుతోంది.   ఈ రాజకీయ చర్చలు, విమర్శలు, ప్రతి విమర్శలూ పక్కన పెడితే.. అసలు వాస్తవమేంటంటే.. రికార్డు సమయంలో భోగాపురం విమానాశ్రయ నిర్మాణం పూర్తి కావడం, ట్రయల్ రన్ సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుని, వచ్చే జూన్ నాటికి  ఈ విమానాశ్రయం ప్రయాణీకులకు అందుబాటులో రావడానికి ప్రధాన కారణం కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నది నిర్వివాదాంశం. శ్రీకాకుళం నుంచి లోక్ సభకు ప్రాతినిథ్యంవహిస్తున్న ఆయన భోగాపురం విమానాశ్రయం ప్రాజెక్టు విషయంలో వ్యక్తిగత శ్రద్ధ పెట్టి,  నిర్దుష్ట వ్యవధిలో పూర్తి చేసి ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలన్న ఏకైక లక్ష్యంతో  ముందుకుసాగడం వల్లనే  ఇంత వేగంగా ఈ విమానాశ్రయ నిర్మాణం పూర్తి అయ్యిందని పరిశీలకులు చెబుతున్నారు. ఆయన చొవర, వ్యక్తిగత పర్యవేక్షణ కారణంగానే గత ఏడాది కాలంగా భోగాపుర విమానాశ్రయ నిర్మాణ పనులు రోజూ మూడు షిప్టులలో నిరంతరాయంగా జరిగాయని అంటున్నారు.   ఇక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విజన్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ కూడా భోగాపురం విమానాశ్రయం రికార్డు సమయంలో నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలను ఆరంభించేందుకు రెడీ కావడం ప్రధాన కారణమనడంలో సందేహం లేదు. సాధారణంగా ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ప్రతిపాదన దశ నుంచి న  నిర్మాణం పూర్తి చేసుకుని కార్యకలాపాలు ప్రారంభించడానికి దశాబ్దాల కాలం పడుతుంది. ఒక్కో సారి అంతకు మించి కూడా సమయం పడుతుంది. ఇందుకు ఉదాహరణ ముంబైలో ఇటీవలే ప్రారంభమైన రెండో అంతర్జాతీయ విమానాశ్రయమే. ఈ విమానాశ్రయం ప్రతిపాదన దశ దాటి, అన్ని అనుమతులూ పొంది..  నిర్మాణం పూర్తి చేసుకుని, ప్రయాణీకులకు అందుబాటులోకి రావడానికి పాతికేళ్లు పట్టింది.  ఇక గత దశాబ్ద కాలంగా  బెంగ‌ళూరులో రెండవ విమానాశ్రయ నిర్మాణం కోసం స్థల అన్వేషణ గత దశాబ్ద కాలంగా ఎడతెగకుండా కొనసాగుతూనే ఉంది.    అయితే అందుకు భిన్నంగా  ఆంధ్రప్రదేశ్ లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం ఆఘమేఘాల మీద పూర్తయ్యింది. ట్రయల్ రన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంది. త్వరలో ఆపరేషన్స్ కూడా ప్రారంభం కానున్నాయి. ముంబై, బెంగళూరు వంటి నగరాలలో   దశాబ్దాలు పట్టిన పని ఏపీలో   రెండేళ్ల లోపే పూర్తయ్యిందంటే.. అది చంద్రబాబు ఫాస్టెస్ట్ గవర్నెన్స్ ఫలితమే అనడంలో సందేహం లేదు.  

కొండ‌గ‌ట్టు, కోన‌సీమ ఓ ప‌వ‌న్ క‌ళ్యాణ్?

కొండ‌గ‌ట్టు ఆంజ‌నేయుడి గుడికి ప‌వ‌న్ ద్వారా భారీ విరాళం. ఆ భూరి విరాళంతో ఆలయంలో అభివృద్ధి పనులకు ఆయనే స్వయంగా శంకుస్థాపన చేయడం..ప్ర‌స్తుతం ఈ వార్తలు బాగా వైర‌ల్ అవుతున్నాయి. ఇంత‌కీ ఆంజ‌నేయ స్వామి వారంటే ప‌వ‌న్ కి ఎందుకంత ఇష్టం? అని చూస్తే.. ప‌వ‌న్ క‌ళ్యాణ్ చెప్పినట్లుగా ఆంజనేయ స్వామి వారు కొణిదెల కుటుంబానికి కులదైవం. అందుకు నిదర్శనంగా ప‌వన్ కల్యాణ్ నామధేయంలోని పవన్  ఆంజ‌నేయ స్వామి వారిపేరు. ఔను   ప‌వ‌న సుత హ‌నుమాన్ అని కూడా ఆంజ‌నేయుడ్ని పిలుస్తుంటారు భ‌క్త జ‌నం. వాయుపుత్రుడాయ‌న‌. అంటేపవన్ కల్యాణ్ పేరులో  స‌గం ఆంజ‌నేయ‌స్వామి ఉన్నారు. ఇక పవన్ తల్లి పేరు అంజనా దేవి. ఆ పేరులోనూ ఆంజనేయుడు ఉన్నారు.    అందుకే కొండ‌గ‌ట్టు తెలంగాణాలో ఉన్న కోవెల అయినా.. ప‌వ‌న్ త‌న ప‌ర‌పతి ఉప‌యోగించి.. టీటీడీ నుంచి సుమారు 36 కోట్ల రూపాయ‌ల విరాళం ఇప్పించారు. ఈ మొత్తం ద్వారా.. భ‌క్తుల వ‌స‌తి కోసం 90 గ‌దుల ధ‌ర్మ‌శాల‌, ఆపై ధీక్ష విర‌మ‌ణకు వీలుగా ఉండేందుకు మ‌రో భ‌వ‌నం నిర్మాణానికి పవన్ స్వయంగా శంకుస్థాపన చేశారు.   అదే బీఆర్ఎస్ గ‌తంలో ఇదే  కొండ‌గ‌ట్టు ఆలయానికి  వంద కోట్ల మేర నిధులు  ప్ర‌క‌టించి ఇవ్వ‌లేదు. అదే  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పవన్ కల్యాణ్.. ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయంలోనూ, దైవ భక్తికి రాష్ట్రాల హద్దులు ఉండవని చాటడంలోనూ ముందున్నారు.  ప‌వ‌న్  ఏపీకి చెందిన రాజ‌కీయ నాయ‌కుడైనా.. తెలంగాణ‌లోని కొండ‌గ‌ట్టుకు విరాళం ఇప్పించ‌డం పట్ల ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ హర్షం వ్యక్తం అవుతోంది. తెలంగాణ వాసులు అయితే మరో అడుగు ముందుకేసి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో విఫలమైన బీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్నారు కూడా.   పవన్ కల్యాణ్ గ‌తంలో ఇక్క‌డి నుంచే త‌న వారాహీ వాహ‌న యాత్ర‌ను లాంఛ‌నంగా మొద‌లు పెట్టారు. అదీ హనుమంతుల వారిపై ఆయనకు ఉన్న భక్తి. అది పక్కన పెడితే ఇక్కడ మ‌రో ట్విస్ట్ కూడా ఉంది. గ‌తంలో ఆయ‌న కోన‌సీమలో కొబ్బరి రైతులు నష్టాలు పాలుకావడంపై మాట్లాడుతూ..  తెలంగాణ ప్ర‌జ‌ల దిష్టి త‌గిలింద‌ని చేసిన కామెంట్లు దుమారం రేపిన సంగతి తెలిసిందే.  ప‌వ‌న్ యాంటీ తెలంగాణ అన్న మాట కూడా అప్పట్లో గట్టిగా వినిపించింది. అదే ఇప్పుడు తెలంగాణ ప్ర‌జ‌ల ఆరాధ్య దైవ‌మైన కొండ‌గ‌ట్టు హ‌నుమ‌న్న ఆల‌యానికి కోట్ల రూపాయ‌ల విరాళం వ‌చ్చేలా చేసి.. త‌న‌పై వ‌చ్చిన యాంటీ తెలంగాణ కామెంట్స్ ని చెరిపేసుకున్నారు పవన్ కల్యాణ్ అంటూ సోషల్ మీడియాలో నెటిజనులు పేర్కొంటున్నారు.  

దొంగే దొంగా దొంగా అని అరచినట్లుగా జగన్ తీరు!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరు దొంగే దొంగ దొంగ అని అరిచిన చందంగా ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ హయాంలో  తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఇప్పటికే వైసీపీ నాయకులు పలువురు పీకలోతు ఇరుక్కున్నారు. కొందరు అరెస్టయ్యారు కూడా. మరి కొందరు విచారణలను ఎదుర్కొంటున్నారు. సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో ఈ కేసు దర్యాప్తును ప్రత్యేక సిట్ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జగన్ సన్నిహితులనే కాదు జగన్ ను కూడా వణికిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో  తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ వెనుక ఉన్నది వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ అన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అసలు తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపంపై పిటిషన్ దాఖలు చేయాలంటే  ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించాలి. కానీ తాజాగా తెలంగాణలో  పిటిషన్ దాఖలైంది. ఔను తిరుమల ప్రసాదాల తయారీలో నాణ్యతా లోపం అంటూ పిటిషన్ దాఖలు కావడం  విన‌డానికి ఆశ్చ‌ర్య‌కంగా ఉన్నావాస్తవం. నిజానికి  క‌మిష‌న్ల క‌క్కుర్తితో  తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూలో  కల్తీ నెయ్యి వినియోగం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జగనే వెనకుండి తెలంగాణ హైకోర్టులో ఇలా ఎదురు పిటిషన్ వేయించడమేంటన్న విస్మయం సర్వత్రా వ్యక్తం అవుతోంది.   జగన్ హయాంలో తిరుమల కేంద్రంలో సర్వ అనర్ధాలూ జరిగాయన్న విమర్శలు ఉన్న సంగతి తెలిసిందే.  ఇక పరకామణి చోరీ వ్యవహారంలో ఫిర్యాదు దారుడైన   ఏవీఎస్వో స‌తీష్ హ‌త్య జగన్ హయాంలో తిరుమలలో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే చర్యలూ యథేచ్ఛగా జరిగాయనడానికి నిదర్శనంగా చెబుతున్నారు పరిశీలకులు.  ఆయన హయాంలో తిరుమలలో జరిగిన అపచారాలే.. కనీసం విపక్ష హోదా లేకుండా వైసీపీ ఘోర పరాజయం కావడానికి కారణమని శ్రీవారి భక్తులు భావిస్తున్నారు.    జ‌గ‌న్ హ‌యాంలో తిరుమ‌ల కేంద్రంగా జ‌రిగిన అక్ర‌మాల సంగతి కాసేపు పక్కన పెట్టి..  తెలంగాణ హైకోర్టులో తిరుమల ప్రసాదాల నాణ్యతపై దాఖలైన పిటిషన్ లోని అంశాలను గమనిస్తే..  ఆగ‌మ‌శాస్త్రం ప్ర‌కారం స్వామివారికి నైవేద్య సంత‌ర్ప‌ణ జ‌ర‌గ‌డం లేద‌న్న‌ది ఈ పిటిష‌న్లోని ప్ర‌ధానాంశం. పిటిష‌న్ త‌ర‌ఫు సుశీలారాం అనే న్యాయ‌వాది   వాద‌న‌లు వినిపించారు. గ‌తంలో టీటీడీ ఆమోదించిన తీర్మానాల‌ను ఈ బోర్డు తుంగ‌లో తొక్కింద‌న్న‌ది మరో ప్ర‌ధాన ఆరోప‌ణ‌. అయితే ఈ వాద‌న‌లు విన్న ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ అప‌రేశ్ కుమార్ సింగ్, జ‌స్టిస్ జీఎం మొయినుద్దీన్ తో కూడిన ధ‌ర్మాస‌నం విషయాన్ని టీటీడీ దృష్టికి తీసుకెళ్లారా? అని ప్రశ్నించింది. దీనిపై  తాము మౌఖికంగా టీటీడీ బోర్డుకు విన్న‌వించిన‌ట్టు చెప్పారు పిటిష‌న‌ర్ కే. శివ‌కుమార్. భ‌క్తుల విశ్వాసాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని.. ఈ వ్య‌వ‌హారంలో జోక్యం చేసుకోవ‌ల్సిందిగా కోరారు పిటిష‌న‌ర్. అయితే ఈ పిటిష‌న్ ప‌ట్ల కోర్టు రిజిస్ట్రీ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌డంతో కోర్టు పటిషన్ విచారణార్హతపై త‌న నిర్ణ‌యం వాయిదా వేసింది.   వైవీ సుబ్బారెడ్డి, భూమ‌న వంటి  అన్యమతస్థులను టీటీడీ బోర్డు చైర్మ‌న్లుగా నియ‌మించిన జ‌గ‌న్..  అలాగే శ్రీవారి  ల‌డ్డూ ప్ర‌సాదంలో క‌ల్తీ నెయ్యి వినియోగం, శాలువాల కుంభ‌కోణం, శ్రీవాణి టికెట్ల‌కు లెక్క‌లు చూప‌క పోవ‌డం, ప‌ర‌క‌మాణి చోరీ,  స్విమ్స్ ఆస్ప‌త్రుల్లోని మెడిక‌ల్ షాపుల నుంచి నెల‌కు రూ. 40 ల‌క్ష‌ల మేర వ‌సూలు చేయ‌డం ఇలా ఎన్నోఅవకతవకలు జగన్ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఉన్న నేపథ్యంలో ఈ పిటిషన్ దాఖలు కావడంపై సర్వత్రా విస్మయం, ఆగ్రహం వ్యక్తమౌతోంది.  అన్న‌దానంలో నాసిర‌కం స‌రుకులు,  క్యూలైన్ల‌లో భ‌క్తుల‌కు ఇవ్వాల్సిన సాంబార్ రైస్, పెరుగ‌న్నం, పాలు వంటివి ఇవ్వ‌కుండా ఆప‌డం.. వంటి ప‌లు సంఘటనలు జరిగింది జగన్ హయాంలోనే కదా అని భక్తులు కూడా అంటున్నారు.  కొండ మీదే కాదు కొండ కింద గోవింద‌రాజుల స్వామి వారి ఆల‌య గోపుర బంగారు తాప‌డంలోనూ త‌మ చోర‌ బుద్ధి చాటింది జ‌గ‌న్ అండ్ కో. ఈ మొత్తం గోపుర తాప‌డంలో 69 కోట్ల విలువైన బంగారం కొట్టేసిన‌ట్టు తేలింది. ఇదే గోపురంపై ఉన్న ముప్పై రెండు విగ్ర‌హాల విధ్వంసానికి కూడా కార‌కుల‌వ‌డం మ‌రో అప‌చారం.. ఇక వ‌రాహ స్వామి వారి గోపురం బంగారు తాప‌డంలో లిక్విడ్ రూపంలోనూ బంగారం కొట్టేయ‌డం వంటి ఎన్నో కుంభకోణాలు వెలుగులోకి వచ్చాయి.  బ్రిటిషర్ల హ‌యాంలో కూడా తిరుమల వేంకటేశ్వరుడి విషయంలో ఇలా అపచారాలు జరగలేదని పండితులు  అంటున్నారు. అయితే జగన్ హయాంలో మాత్రం తిరుమల పవిత్రతను మంటగలిపేలా అపచారాలు జరిగాయని అంటున్నారు. ఆ అరాచకాలన్నీ ఒక్కటొక్కటిగా ఇప్పుడు బయట పడుతుం డటంతో..   హిందూ ఓటు బ్యాంకు దూరమైపోతోందన్న భయంతోనే జగన్ తిరుమల పవిత్రత విషయంలో ఎక్కడ లేని అక్కరా కనబరుస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.  తన హయాంలో చేయాల్సిందంతా, చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అంటూ   శ్రీవారికి ఆగమశాస్త్రం ప్రకా రం నైవైద్య నివేదిన జరగడం లేదంటూ కోర్టును ఆశ్రయించడం వెనుక ఉన్నది కేవలం రాజకీయమే కానీ,  శ్రీవారిపై భక్తితో కాదని అంటున్నారు.  

వైసీపీ వారికి అప్ప‌నంగా వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాలు!?

వడ్డించేవాడు మనవాడైతే భోజనానికి చివరి పంక్తిలో కూర్చున్నా ఫరవాలేదన్నది సామెత. అయితే ఇప్పుడు తెలుగుదేశం కూటమిలో ఆ సామెతను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు తెలుగు తమ్ముళ్లు, కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు. ఇప్పుడు ఆ సామెతను వడ్డించేవాడు మనవాడే ఉన్న మొదటి మొదటి పంక్తిలో కూర్చున్నా లాభం లేని పరిస్థితి ఏర్పడిందని మార్చుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  జగన్ హయాంలో తిరుమల పవిత్రతకు, ప్రతిష్ఠకు పంగనామాలు పెట్టి మరీ యధేచ్ఛగా వ్యవహరించిన చరిత్ర వైసీపీ నేతలది. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత కూడా తిరుమలలో వారి హవాయే కొనసాగుతోంది. కూటమి సర్కార్ తీరు అయిన వాళ్లకి ఆకుల్లో.. అన్న చందంగా తయారైందంటున్నారు. ఔను తిరుమలలో  వైకుంఠ ఏకాద‌శి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనాల విషయంలో వైసీపీయులదే హవా అంటున్నారు. వైసీపీ లీడర్లకు ఉత్తర ద్వార దర్శనాలను తిరుమల అడిషనల్ ఈవో దగ్గరుండి మరీ చేయిస్తున్నారని విమర్శలు గుప్పిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా విడుదల చేస్తున్నారు.  తెలుగుదేశం కూటమి సర్కార్ లో కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన వారికి దక్కని వైకుంఠ ద్వార దర్శనాలు వైసీపీ నేతలకు మాత్రం అధికారులు దగ్గరుండి మరీ తీసుకువెళ్లి దర్శనం చేయించ డమేంటని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విజ‌య‌వాడ  నుంచి వ‌చ్చిన‌దేవినేని అవినాష్‌, మ‌ల్లాది విష్ణుతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వంటి  వారు మంగళవారం (డిసెంబర్ 30)న తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సరే  పెద్దిరెడ్డి అంటే లోక‌ల్. మరి మ‌ల్లాది, దేవినేని సైతం వైకుంఠ ద్వారా  ద‌ర్శ‌నాలు అల‌వోక‌గా ఎలా చేసుకోగలిగారని తెలుగు తమ్ముళ్లు ప్రశ్నిస్తున్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా వైసీపీ వారి మాటే ఇంకా తిరుమలలో చెల్లుబాటు అవుతోందనడానికి ఇంత కంటే నిరద్శనం ఏం కావాలని ప్రశ్నిస్తున్నారు.  ఇప్పటికే ఏబీ వెంకటేశ్వరరావు వంటి వారు.. అధికారం కోల్పోయినా వైసీపీ వారి పనులు యథేచ్ఛగా నడుస్తున్నాయంటూ చేసిన వ్యాఖ్యలు వాస్తవమేననడానికి  వైకుంఠ ఏకాదశి సందర్భంగా  వైసీపీయులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు దగ్గరుండి మరీ ఉత్తరద్వార దర్శనాలను కల్పించడమే  నిదర్శనమని అంటున్నారు.  

140 ఏళ్ల ప్రస్థానం.. కాంగ్రెస్ లో జోషెదీ.. కార్యకర్తల్లో ఉత్సాహమెక్కడ?

దేశంలో సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ పార్టీని గ్రాండ్ ఓల్డ్ పార్టీ అని కూడా అంటారు. స్వాతంత్యోద్య‌మ కాలం నుంచీ ఉన్న ఈ పార్టీ ఈ క్రమంలో అనేక విజయాలు, అపజ యాలను చవి చూసింది. అయితే ఇప్పటి వరకూ దేశంలో అత్యధిక కాలం అధికారంలో కొనసాగిన పార్టీగా రికార్డు కూడా సృష్టించింది. అయితే గత కొన్నేళ్ల నుంచీ, అంటే దాదాపుగా  దశాబ్ద కాలం నుంచీ ఆ పార్టీ వరుస పరాజయాలతో కూనారిల్లుతోంది. కాంగ్రెస్ చరిత్రలో ఇంతటి పతనావస్థ ఆ పార్టీకి గతంలో ఎన్నడూ లేదని చెప్పవచ్చు. ముఖ్యంగా 2014 సార్వత్రిక ఎన్నికలలో కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోని ఘోర పరాజయం తరువాత నుంచి ఈ పార్టీ కోలుకోలేదనే చెప్పాలి. ఈ పరిస్థితి చాలదన్నట్లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, కీలక నేతలు పార్టీ ధిక్కార స్వరం వినిపించడం, ఆ పార్టీని అగ్రనాయకత్వాన్ని ఆందోళనకు గురి చేస్తున్నది. పరాజయాలు తమకు కొత్త కాదనీ, మళ్లీ పుంజుకుంటామని కాంగ్రెస్ అధిష్ఠానం ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ, పరిశీలకులు మాత్రం ఇప్పట్లో కాంగ్రెస్ కోలుకునే అవకాశం లేదని పెదవి విరుస్తున్నారు. ముఖ్యంగా సంకీర్ణ ప్రభుత్వాల కాలంలో కాంగ్రెస్ అనుసరిస్తున్న విధానాల కారణంగా ఆ పార్టీతో పొత్తులో ఉన్న పార్టీలు ఒక్కటొక్కటిగా జారిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నది. కీలక రాష్ట్రాలలో కనీస స్థానాలను కైవసం చేసుకోవడంలో విఫలమౌతున్న పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడం కష్ట సాధ్యమన్న అభిప్రాయం పరిశీలకులలో వ్యక్తం అవుతున్నది. ఇవన్నీ పక్కన పెడితే.. గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ తన 140వ ఆవిర్బావ దినోత్సవాన్ని ఆదివారం (డిసెంబర్ 28) జరుపుకుంది. అయితే 140 ఏళ్ల కాంగ్రెస్ లో ఆ సందర్బంగా ఎలాంటి ఉత్తేజం కానీ, జోష్ కానీ కనిపించలేదు. వరుస పరాజయాలతో నిస్తేజంగా ఉన్న పార్టీ శ్రేణులు ఈ ఉత్సవాల పట్ల ఉదాశీనంగా ఉన్నాయి. వీటన్నిటికీ మించి పార్టీలో కీలక నేతలు బీజేపీ, ఆ పార్టీ మెంటార్ గా చెప్పుకునే ఆర్ఎస్ఎస్ అనుకూల ప్రకటనలు చేస్తుండటం పార్టీ శ్రేణులను మరింత గందరగోళంలోకి నెట్టేస్తున్నది. ఈ నేపథ్యంలోనే  ఆదివారం (డిసెంబర్ 28) పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వినా మరెక్కడా వేడుకలు జరగలేదు. పార్టీ అధికారంలో ఉన్న కర్నాటక, తెలంగాణల్లో కూడా ఆ సందడి కనిపించలేదు. కనీసం ఆయా రాష్ట్రాలలోని కాంగ్రెస్ కార్యాలయాలలో కూడా ఎటువంటి కార్యక్రమాలూ జరిగిన దాఖలాలు లేవు.  ఇక  పార్టీ ఎంపీ శశిథరూర్ వంటి వారు బీజేపీతో చెట్టాపట్టాలేసుకుని తిరగడం, అవకాశం దొరికినప్పుడల్లా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించడం పార్టీ అధిష్ఠానాన్ని మరింత ఇరుకున పెడుతోంది. అలా పార్టీ ధిక్కార స్వరం వినిపిస్తున్న నాయకుల సంఖ్య రోజురోజుకూ పెరగడంతో కాంగ్రెస్ కోలకుంటుందన్న భావన నెమ్మదిగా పార్టీ శ్రేణులలోనే అడుగంటుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక పార్టీ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న నాయకుల జాబితాలోకి తాజాగా కాంగ్రెస్ అగ్రనేత, మాజీ కేంద్ర మంత్రి, మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ చేరడం పార్టీ పరిస్థితిని మరింత దయనీయంగా మార్చేసింది. దిగ్విజయ్ సింగ్ తాజాగా ప్రధాని మోడీపై ప్రశంసిస్తూ కాంగ్రెస్, ఆర్ఎస్ఎస్ లను ప్రస్తుతించారు.  ఈ మేరకు సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో చేసిన ఓ పోస్టులో దిగ్విజయ్ సింగ్.. ప్రధాని మోడీ ఒక సాధారణ కార్యకర్త స్థాయి నుంచి ప్రధానిగా ఎదగడానికి ఆర్ఎస్ఎస్ కు ఉన్న సంస్థాగత బలమే కారణమని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా తన పోస్టును కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కీలక నేతలు ప్రియాంక వధేరా గాంధీ, రాహుల్ గాంధీలకు ట్యాగ్ చేశారు.  అయితే ఆ తరువాత తన వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ సంస్థాగత బలాన్ని చెప్పడానికే కానీ, ఆ సంస్థను కానీ, మోడీని కానీ ప్రశంసించడానికి కాదనీ కాంగ్రెస్ కు కూడా ఇలాంటి బలమైన వ్యవస్థ, అధికార వికేంద్రీకరణ అవసరమని చెప్పడమే తన ఉద్దేశం వివరణ ఇచ్చారు. ఆ వివరణలో కాంగ్రెస్ సంస్థాగతంగా బలహీనపడిందనీ, అధికారం కేంద్రీకృతమై ఉందన్న సంకేతాలు ఉండటం గమనార్హం. దీంతో పార్టీలోని సీనియర్లు ఒక్కరొక్కరుగా పార్టీకి దూరమౌతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీంతో ఈ గ్రాండ్ ఒల్డ్ పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చట్టంతో గేమ్స్.. జగన్ కు అబ్బిన అనువంశిక విద్య!

చట్టం, న్యాయం, కోర్టులు ఇలాంటి వాటిని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దగా ఖాతరు చేయరు. వాటితో చెలగాటమాడటం ఆయనకు రాజకీయ ప్రవేశానికి ముందు నుంచీ బాగా అలవాటైన విద్య. ఇదీ జగన్ గురించి న్యాయనిపుణులు చెప్పే మాట.  అందుకు వారు ఉదహరిస్తున్న ఈ క్రోనాలజీ చూస్తే ఎవరికైనా అది నిజమేగా అనిపించకమానదు.  జ‌గ‌న్ కి కోర్టుల‌ు, చ‌ట్టాలు, న్యాయ వంటి వాటిని లెక్క చేయని తనంఅన్నది కొట్టిన పిండి.  చట్టం, న్యాయం, రాజ్యాంగం ఇలాంటి వాటితో సంబంధం లేకుండా చేయాల్సిందంతా చేసేసి,  ఆపై కేసులు నమోదై, కోర్టుకు వెడితే వాటితో ఎలా ఆడుకోవాలో జగన్ కంటే బాగా తెలిసినవారెవరూ ఉండకపోవచ్చచునం టారు పరిశీలకులు.  ఈ విషయంలో జగన్  తాత రాజారెడ్డి కాలం నుంచి వైఎస్ కుటుంబానికి అనువంశికంగా అబ్బిన విద్య అంటారు.   లా యునివ‌ర్శిటీ ఎలాగో.. అన్ లాయూనివ‌ర్శిటీ అనేది ఉండి ఉంటే ఆ వర్సిటీకి జ‌గ‌న్ ను  హెడ్ అయి ఉండేవారంటారు. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ క్విడ్ ప్రోకో కేసుల్లో  చట్టంతో చెలగాటమాడుతున్న తీరు తెలిసిందే. విచారణ ముందుకు సాగకుండా వరుస డిశ్చార్జ్ పిటిషన్ లతో ఆయన కేసును సాగతీస్తున్న తీరు న్యాయ నిపుణులనే విస్మయపరుస్తోంది.  ఇటీవ‌ల  జ‌గ‌న్ కేసుల‌ను ప‌రిశీలిస్తున్న న్యాయ‌మూర్తి బ‌దిలీ అయ్యారు. ఆయన స్థానంలో మరో న్యాయమూర్తి వచ్చారు. జగన్ కేసులు విచారిస్తున్న న్యాయమూర్తి బదలీ అయితే ఏంటి అని అంతా అనుకోవచ్చు కానీ  కొత్తగా వచ్చిన న్యయమూర్తి జగన్ కేసులకు సంబంధించిన అప్ డేట్స్ అన్నీ పరిశీలించడానికి కొన్నేళ్లు పడుతుంది.  దీంతో క‌థ మ‌ళ్లీ మొద‌టికే వ‌స్తుంది. సరే బదలీ అనేది సాధారణం కదా అనుకోవచ్చు. కానీ జగన్ తన కేసుల విచారణ ముగింపు లేకుండా అలా కొక.. సాగుతూ ఉండటానికి పలు పద్ధతులు అవలంబిస్తుంటారు..  వాటిలో ఒకటే   డిశ్చార్జీ పిటిష‌న్ల వ‌ర‌ద పారించడం. ఇప్ప‌టి వ‌ర‌కూ జ‌గ‌న్ కేసులలో  130 డిశ్చార్జీ పిటిష‌న్లు దాఖలయ్యాయి. అలాగే విచారణపై స్టేలు కోరుతూ పిటిషన్ వేయడం. ఇలాంటి పిటిషన్ల విచారణ ద్వారా కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకోవడం, అలాగే  ఈ కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరడం.   2019- 24 మ‌ధ్య సీఎంగా అధికారంలో ఉన్నందున, పాలనా పరమైన అడ్డంకులకు అవకాశం లేకుండా, తనకు కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు నుంచిమినహాయింపు కావాలంటూ పిటిషన్ వేసి మినహాయింపు పొందిన జగన్.. ఇప్పుడు అధికారంలో లేకపోయినా, కేవలం పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినా.. తాను కోర్టుకు వస్తే.. జనం ఇబ్బందిపడేంతగా ట్రాఫిక్ జామ్ లు ఏర్పడతాయనీ, తన భద్రతకు ప్రభుత్వానికి భారీగా ఖర్చు అవుతుందంటూ కోర్టును మళ్లీ వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరారు. తాను చెప్పిన మాట వాస్తవమని  అందరూ నమ్మే విధంగా ఇటీవల ఆయన నాంపల్లి కోర్టుకు హాజరైనప్పుడు వైసీపీయులు చేసిన హంగామా జగన్ ప్లాన్ లో భాగమేనంటారు పరిశీలకులు.   ఒక సాధార‌ణ ఎంఎల్ఏగా ఉన్న జగన్ కు ఎలాంటి హైఎండ్ ప్రోటోకాల్ లేకున్నా ఉన్న‌ట్టు గా సృష్టించి.. కోర్టు విచారణకు తనకంటూ ఓ షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్న ఘనత జగన్ కే చెల్లుతుందంటున్నారు.   తాను ఎప్పుడు కోర్టుకు హారైనా జనం ఇలా తండోపతండాలుగా తనను చూడటానికి వస్తారనీ, వారిని కంట్రోల్ చేయడం, శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాకుండా ఏర్పాట్లు చేయడం ప్రభుత్వాలకు, పోలీసులకు తలకు మించి భారం అవుతుందన్న బిల్డప్ క్రియేట్ చేశారు. ఇప్పడు అదే చూపి మరో సారి కేసుల విచారణ నుంచి వ్యక్తిగత మినహాయింపు పొందినా ఆశ్చర్యం లేదంటున్నారు విశ్లేషకులు.  ఇన్ని రకాలుగా తనపై ఉన్న అక్రమాస్తుల కేసుల దర్యాప్తు ముందుకు సాగకుండా జాప్యం అయ్యేలా జగన్ మేనేజ్ చేయగలుగుతున్నారంటే దానికి చట్టంతో చెలగాటమని కాకుండా మరేమనాలని ప్రశ్నిస్తున్నారు. కేసు వాయిదాలు కోరడానికే జగన్ న్యాయవాదుల ఖర్చు కోట్ల రూపాయలు ఉంటుందని ఇటీవల కొన్ని గణాంకాలువెలుగులోకి వచ్చాయి.  లాతో గేమ్స్ ఆడుకోవ‌డం ఎలా అని ఒలింపిక్స్ లో పోటీ పెడితే.. జగన్ కు గోల్డ్ మెడల్ ఖాయమంటూ నెటిజనులు సెటైర్లు పేలుస్తున్నారు. చూడాలి మరి ఇంకెంత కాలం ఈ కేసుల విచారణను జగన్ తన స్టైల్ లో సాగదీస్తారో?  

క్రిస్మస్ వేడుకలకూ జనసమీకరణేనా జగన్?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి  గత ఎన్నికలలో ఓటమి తరువాత పూర్తిగా మారిపోయారు. అధికారంలో ఉన్నంత కాలం వందిమాగధులు తప్ప పార్టీ క్యాడర్, ద్వితీయ శ్రేణి నేతలు, ప్రజలు ఇలా ఎవరినీ దరి చేరనీయకుండా వ్యవహరించారు. 2024 అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయం తరువాత.. తన వెంట ఇంకా జనం ఉన్నారని చాటుకోవడానికి నానా తంటాలూ పడుతున్నారు. ఎన్నికలలో ఓటమి పాలైనా తమ పార్టీకి 40 శాతం ఓటు బ్యాంకు ఉందనీ, ఈవీఎంల ట్యాంపరింగ్ వల్లే ఓడిపోయామనీ పదే పదే చెప్పుకున్న జగన్, ఇప్పుడు తాను బయటకు వస్తే జనం ఉండాలని పార్టీ నేతలకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అందుకే అధికారం కోల్పోయిన తరువాత ఆయన రాష్ట్రంలో చేసిన ప్రతి పర్యటనలోనూ శాంతి భద్రతలు అదుపుతప్పాయి. సామాన్య జనం ఇబ్బందులు పడ్డారు. పోలీసులు ఆంక్షలు విధించినా వాటిని ధిక్కరించి మరీ వైసీపీయులు జగన పర్యటనలకు జనాన్ని భారీ ఎత్తున సమీకరించి బల ప్రదర్శనకు దిగుతున్నారు. జనంలో  తనకు ఇసుమంతైనా పలుకుబడి తగ్గలేదని చాటుకోవడానికే జగన్ తమ పార్టీ నేతలపై జనసమీకరణ అంటూ ఒత్తిడి తెస్తున్నారనీ, వైసీపీ నేతలు కూడా గత్యంతరం లేని పరిస్థితుల్లో భారీ ఎత్తున జనసమీకరణ చేస్తున్నారనీ అంటున్నారు. సరే ఆయన రాజకీయ ఓదార్పు, సమస్యలపై ప్రజల్లో చెతన్యం అంటూ చేస్తున్న పర్యటనలకు భారీ జనసమీకరణ చేయించుకున్నారంటే అర్ధం చేసకోవచ్చు, కానీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా పులివెందుల చర్చికి వెళ్లిన సందర్భంగా కూడా జిల్లా నలుమూలల నుంచీ జనాలను తరలించడం పట్లే పరిశీలకుల్లో సైతం విస్మయం వ్యక్తం అవుతున్నది. తాను బయటకు వచ్చినప్పుడు భారీగా జనం గుమిగూడకపోతే.. తాను చెప్పుకుంటున్న 40శాతం ఓటు బ్యాంకు మద్దతును ఎవరూ నమ్మరన్న సంశయంతోనే  ఇలా వ్యవహరిస్తున్నారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.   జగన్ తన మూడు రోజుల పులివెందుల పర్యటనలో తొలి రోజు మాత్రమే జనం ముందుకు వచ్చారు. ప్రజాదర్బార్ నిర్వహించారు. ఆ తరువాత జ్వరం అంటూ ప్రీ క్రిస్మస్ వేడుకలకు కూడా దూరంగా ఉన్నారు. అంతే కాదు జనానికీ ముఖం చాటేశారు. కానీ క్రిస్మస్ రోజు న మాత్రం భారీ ఎత్తున జనసమీకరణకు పార్టీ నేతలను ఆదేశించారు. ఇక్కడే ఆయన ప్రీక్రిస్మస్ వేడుకలలో పాల్గొనకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రీ క్రిస్మస్ వేడుకలకు అయితే.. జగన్ కుటుంబ సభ్యులు వినా సామాన్య జనం వచ్చే అవకాశం ఉండదు. ఈ కారణంగానే ఆయన ప్రీ క్రిస్మస్ వేడుకలలో పాల్గొన లేదని అంటున్నారు. క్రిస్మస్ సందర్భంగా పులివెందుల చర్చి వెలుపల కూడా పెద్ద ఎత్తున జనం గుమిగూడటాన్ని బట్టి చూస్తుంటే.. ఆయన బయటకు వచ్చేది బల ప్రదర్శన కోసమేనా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వ్యక్తం అవుతున్నాయి.  

మోడీ మౌనం దేనికి సంకేతం?

బంగ్లాదేశ్ లో  హిందూ వ్యతిరేకత పెచ్చరిల్లుతుంటే మోడీ మౌనం వహించడంపై సర్వత్రా తీవ్ర ఆగ్రహం, అసహనం వ్యక్తం అవుతున్నది. అసలు కేంద్రంలోని మోడీ సర్కార్ కీలక విషయాలలో ఆమోదయోగ్యం కాని నిర్లక్ష్యం వహిస్తున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అదే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రధానిగా ఇందిరాగాంధీ ఉండి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్న అభిప్రాయమూ వ్యక్తమౌతోంది. మణిపూర్ విషయంలో కానీ, అసలు కీలక సమస్యలపై పార్లమెంటులో చర్చ విషయంలో కానీ మోడీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు ఏ మాత్రం సరిగా లేదని అంటున్నారు.  ఇప్ప‌టికీ మ‌ణిపూర్ మ‌ర‌క అలాగే  ఉంది. ఆ రాష్ట్రంలో ప్ర‌ధాని ప‌ర్య‌టించిన‌పుడు కూడా ఎలాంటి స్పంద‌నా లేదు. అదలా ఉంటే.. తాజాగా పార్ల‌మెంటు సమావేశాలలో కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభలో ప్రతిపక్ష నాయకుడు అయిన రాహుల్ గాంధీ  పట్టుబట్ట బట్టి, ఓట్ చోర్ వ్య‌వ‌హారంలో ఆ మాత్రమైనా చర్చ జరిగింది. అది పక్కన పెడితే..    ఢిల్లీ కారుబాంబు పేలుడు వంటి   కీల‌కాంశాలు సభలో అస‌లు చ‌ర్చ‌కే  రాలేదు. అలాంటి అత్యంత కీలక విషయాలను వదిలేసి.. వందేమాత‌రంపై గంట‌ల త‌ర‌బ‌డి ప్రసంగాలు దంచి సమయాన్ని వృధా చేసింది అధికార పక్షం.  ఓకే దేశం.. ధ‌ర్మం కోసం.. దేశ  భ‌క్తి  హిందుత్వ అన్నది నిజంగానే కేంద్రంలోని మోడీ సర్కార్ కు అంత ముఖ్యమైనది అనుకుంటే..  బంగ్లాదేశ్ లో ఒక హిందువును సజీవంగా దహనం చేస్తూ కనీస స్పందన కూడా లేకపోవడాన్ని ఏమనుకోవాలి?   ఇక్కడే ఈ సమయంలో ప్రధానిగా  ఇందిరాగాంధీ ఉండి ఉంటే  ప‌రిస్థితి ఇలా  ఉండేదా? అన్న చర్చ జరుుగతోంది.  బంగ్లాదేశ్ లో ప్రస్తుతం యూనస్ నేతృత్వంలోని  తాత్కాలిక  ప్ర‌భుత్వం న‌డుస్తోంది. ఆయ‌న  ప్ర‌జాస్వామికంగా ఎన్నికైన పాల‌కుడు కాడు. అనివార్య పరిస్థితుల వల్ల ఆయనకు అవకాశం దక్కింది. ఆయన తీరు కారణంగా ఇప్ప‌టికే బంగ్లాదేశ్ సైన్యం అక్కడి ప్ర‌భుత్వానికి సహాయ నిరాకరణ చేస్తున్నది. యూన‌స్ సర్కార్  ప్ర‌జా  ప్ర‌భుత్వం  కాదు కనుక ఆయన ఆదేశాలను పాటించాల్సిన అవసరం లేదని మొండికేస్తున్నది.   అదలా ఉంటే..  యూన‌స్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన భార‌త  వ్య‌తిరేక చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల‌ను ఆక్ర‌మించే య‌త్నం చేస్తున్నారు.  చైనాతో క‌ల‌సి బార‌త  వ్య‌తిరేక కుట్ర‌ల‌కు పాల్ప‌డుతున్నారు. అలాగే దేశంలో హిందువులపై అత్యంత అమానవీయంగా దౌర్జన్యకాండ సాగు తోంది. తాజాగా ఒక హిందువును స‌జీవ ద‌హ‌నం చేసిన  ఘ‌ట‌న‌లో కేంద్రం క‌నీసం స్పందించలేదు. ఆయన అక్కడ పరమత దూషణకు పాల్పడలేదు.. కేవలం దేవుడు ఒక్క‌డేగానీ ఆయ‌న  పేర్లు ఎన్నో అని మాత్రమే అన్నాడు. ఆ మాత్రానికే అత‌డిని సజీవదహనం చేశారు.  అలాంటి బంగ్లా ప్ర‌భుత్వంపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాలన్న డిమాండ్ దేశ వ్యాప్తంగా వినిపిస్తోంది.  డిమాండ్లు హోరు మంటున్నాయ్. హిందుత్వ, దేశ భక్తి, అఖండ భారతం అంటూ వల్లెవేసే మోడీ సర్కార్..బంగ్లాలో హిందువులపై జరు గుతున్న దౌర్జన్యాలు, దాడులపై స్పందించకపోడం సరికాదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోంది.