వైఎస్ఆర్ పాలనే బెటర్ గా అనిపిస్తోంది: సునీల్ దియోధర్
posted on Mar 14, 2020 @ 3:01PM
విజయవాడ రాజ్ భవన్ లో ఎపి గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ను కలిసిన ఎపి బిజెపి కో ఇన్ చార్జ్ సునీల్ ధియోధర్, బిజెపి నేతలు
స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి నేతలు పోటీ చేయకుండా బెదిరించడం, కార్యకర్తలు పై వరుస దాడులు.. నామినేషన్లు లాక్కోవడం వంటి ఘటనల పై గవర్నర్ కు ఫిర్యాదు చేసిన బీ జీ పి నేత సునీల్ దియోధర్. రాష్ట్రం లో వైసిపి రౌడీ పార్టీ గా వ్యవహరిస్తుందని, బిజెపి, జనసేన అభ్యర్థులు నామినేషన్లు వేయకుండా అడ్డుకుంటున్నారని, పోలీసులు సమక్షంలోనే నామినేషన్లు పత్రాలు లాక్కుని చించేస్తున్నారని, రౌడీయిజం, గూండాయిజంతో భయపెడుతున్నారని ఆయన గవర్నర్ కు ఫిర్యాదు చేశారు.
" దాడులు, దాష్టికాల వల్ల మా పార్టీ నేతలకు ప్రాణ భయం ఉంది. పది సంఘటనల పై ఆధారాలతో గవర్నర్ కు వివరించాం. పోలీసులు కూడా వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. వైయస్ హయాంలో ఇంత దారుణాలు జరగలేదు, రాష్ట్రం లో ఎంపికలే తప్ప.. ఎన్నికలు జరగడం లేదు. ఈ అంశాలను వివరిస్తూ వినతి పత్రాన్ని ఇచ్చి, చర్యలు తీసుకోవాలని గవర్నర్ ను కోరాం," అని సునీల్ డియోధర్ చెప్పారు.