Read more!

ఎండాకాలం వడదెబ్బ తప్పించుకోవడం ఎలా..          

ఎండాకాలం లో తొమ్మిది రకాల పళ్ళు కూరగాయాలు తీసుకుంటే చాలు అలసట నీరసం నుండి బయట పడచ్చు. మనం ప్రకృతి తో కలిసి ఉంటున్నాం. ప్రకృతిలో వస్తున్న మార్పుల కు అనుగుణంగానే మన ఆహారపు అలవాట్లుఉంటె మనకు ఇబ్బంది లేదు. అయినా ఇప్పటికీ మానవుడు ఈ ప్రకృతిని ధ్వసం చేస్తున్నా మనల్ని కాపాడేందుకు  మనకు ఎన్నోవరాలు ఇచ్చింది.ఈ ప్రకృతి మనం ఆరోగ్యంగా ఉండడానికి దోహదం చేస్తుంది ప్రకృతి. అసలే ఎండాకాలం ఆపైన ఉస్సో ఉస్సో అంటూ శరీరానికి చమట పట్టించే కాలం రానే వచ్చింది. సహజంగానే మన శరీరం నుండి చమట రూపం లో బయటికి వస్తుంది. దీనికారణం గానే శరీరం లో నీటి శాతం తగ్గి పోతూ ఉంటుంది. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కావాల్సినంత నీటిని తాగడం తో పాటు మన ఆహారం లో కూరగాయాలు, ఆకుకూరలు, పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు.మనశరీరం సరిగా పనిచేయాలంటే మహత్తర మైన అద్భుత మైన పోషక తత్వాల లో నీరు ఒకటి. శరీరంలో ఉండే వివిదరకాల అవయవాల పని తీరు ను మెరుగు పరిచి అవయవాలను నియంత్రిస్తుంది. సహజంగా మన శరీరం ఎండాకాలం లో త్వరగా అలిసిపోయి డీ హైడ్రేట్ అవుతుంది.కాబట్టి మనం నీటిని ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. ప్రకృతిలో మార్పు వచ్చినట్లుగా ప్రకృతిలో వేడి పెరగ గానే మన శరీరంలో చాలా రకాల మార్పులు వస్తూ ఉంటాయి. అందులో ఒకటి శరీరంలో నీరు తగ్గిపోవడం.ఎండాకాలం లో మనకు చమట అధికంగా  వెలువడుతూ ఉంటుంది. అందుకే మనశరీరంలో నీటి శాతం తగ్గిపోతూ ఉంటుంది.అందుకే అందరూ రోజుకి రెండు గ్లాసులు నీళ్ళు తాగాలని సూచిస్తున్నారు వైద్యులు.కొన్ని విషయాలు అందరికీ తెలియదు అది ఏమిటి అంటే కేవలం నీళ్ళు మాత్రమే తాగితే సరిపోదు. శరీరంలో నీటి శాతం పెంచాలంటే తర్బూజా,టమాటా, ఖీరా,స్ట్రా బెర్రీలు ,కూరగాయలు, ఇతర ఫలాలు, మీ డైట్ లో చేర్చండి ఇలాంటి కూరగాయాలు, ,పండ్లలో నీటి శాతం అధికంగా ఉంటుంది.శరీరాన్ని చాలా బాగా హైడ్రేట్ చేసేందుకు ఎండాకాలం లో 9 రకాల పళ్ళు,కూరగాయాలు తప్పనిసరిగా తీసుకోండి  అని అంటున్నారు వైద్యులు.

ఖీరా...

ఎండాకాలం లో ఎక్కువగా ఖీరాను తీసుకునేందుకు ఇష్టపడతారు. దీనికి చాలా కారణాలే ఉన్నాయి. అందులో ఒకటి ఖీరాలో నీటి శాతం చాలా ఎక్కువగా ఉండడమే దాదాపు 95% ఎక్కువ నీటి శాతం ఉండడం విశేషం. ఖీరాలో పొటాషియం, శాతం అధ్జికంగా ఉంటుంది. ఎండా కాలం లో వచ్చే వడదెబ్బ నుండి తట్టుకునే శక్తి నిచ్చేది కీరా అని అంటున్నారు న్యూట్రిషి యనిస్ట్లులు. ఖీరా తీసుకోవడం వల్ల మెదడు చురుకుగా ఆరోగ్యంగా ఉండేందుకు శక్తిని పెంచుతుంది. ఎందుకంటే ఖీరాలో యాంటీ ఇంఫ్లామేటరీ గుణాలు ఉంటాయి. దీనిలో  ఫెసేటిన్ అనే పదార్ధం మెదడు చురుకుగా పని చేసేందుకు దోహదం చేస్తుంది.

యాపిల్...

ప్రతి రోజూ మీరు ఒక యాపిల్ తీసుకుంటే మీరు డాక్టర్ కు దూరంగా ఉండవచ్చు.అని మీరు ఒకప్పుడు వినిఉండవచ్చు. ఇది కేవలం అనుకోవడం మాత్రమే కాదు నిరూపిత మయ్యింది కూడా ఎందుకంటే యాపిల్ లో 6% నీరు ఉంటుంది. ఇది అన్ని కాలాల లోనూ అందుబాటులో ఉంటుంది. యాపిల్ లో విటమిన్లు ఖనిజ లవణాలు ఉంటాయి. కాగా యాపిల్ గుండె సమస్యల కు కొంతమేర నివారించేందుకు బాగా ఉపయోగ పడుతుంది.

టమాటా...

టమాటా అంటే ఇష్టపడని వాళ్ళు ఉండరంటే అతిశయోక్తి లేదు. టమాటా లో 94%నీరు ఉంటుంది. టమాటా ను సలాడ్ లో కలిపి వాడతారు. లేదా కాస్త టమాటా జ్యూస్ చేసి తాగ వచ్చు. టమాటా లో విటమిన్ ఎ పుష్కలంగా లభిస్తుంది. అలాగే చర్మం మృదువుగా ఉండేందుకు రక్త ప్రసారం లోనూ అన్ని రకాల సమస్యల నుండి బయట పడేసే శక్తి నిస్తుంది.

బ్రోకోలి...

మీరు బ్రకోలి తినేందుకు ఇష్టపడుతున్నారు కదు. అయితే ఇది మీకు ఖచ్చితంగా ఆనందించ దగ్గ విషయ మే ఇందులో 9౦% నీరుఉంటుంది. దాంతో పాటు విటమిన్ ఎ కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఐరన్ తో సంపూర్ణ మైన పోషకాలు లభిస్తాయి.స్ట్రా బెర్రీ లు...ఈ పండు బరువు ఇందులో ఉండే నీటిని బట్టి ఉంటుంది. స్ట్రాబెర్రీ లలో 91% నీరు ఉంటుంది. ఈ పండు చాలా రుచికరంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్,ఫైబర్,పీచు పదార్ధం విటమిన్ సి, ఫోలేట్, మాంగనీస్, వంటి ఖనిజాలు,నిండి ఉంటాయి. అన్నిరకాల పోషక తత్వాలు డయాబెటీస్, క్యాన్సర్ మరెన్నో రోగాలతో సంబంధం ఉన్న వాటితో పోరాడే పని చేస్తుంది.

పాల కూర...

ఇది పచ్చటి ఆకు కూర పలకూరలో కూడా 9౩%నీరు ఉంటుంది. ఇందులో సంపూర్ణంగా ఐరన్ ఉంటుంది. హై డ్రెషన్ కోసం మంచిదని భావిస్తారు. ఇమ్యునిటీ ని పెంచే గుణం పలకూరకి ఉందని నిపుణులు అంటున్నారు సమ్మర్ హాట్ బీట్ లో పాలకూర కూడా ఒక భాగమే.

జుకీనీ...

దీనిని సూపర్ ఫుడ్ స్థానం కల్పించారు. కాని ఇది హైడ్రేట్ అవుతుంది. విటమిన్ బి 2 విటమిన్ డి వంటి పోషక తత్వాలు పూర్త్ర్హిగా ఉండడం తో పాటు 92% నీరు ఉంటుంది.ఇది ప్రతి రోజూ అలవాటు చేసుకుంటే మీ కు అలసట తగ్గి ఎండా కాలం వచ్చే వడ దేబ్బనుండి దీహైద్రేడ్ కాకుండా మిమ్మల్ని కాపాడుతుంది.

మష్రూమ్స్ పుట్టగొడుగులు...

మష్రూమ్స్ పుట్టగొడుగులు ఈ పేరు వినగానే మీరు ఆశ్చర్య పోయారు కదా హైద్రేడ్ అవుతుంది. ఇందులో విటమిన్ బి,డి వంటి పోషక తత్వాలు పూర్తిగా ఉంటాయి.ఇందులో 92% నీరు ఉంటుంది. ఇది ప్రతిరోజూ తీసుకుంటే అలసటను తగ్గించడం లో సహాయ పడుతుంది.తొమ్మిది రకాలు మీరు మీ డైట్ లో తీసుకోండి వడ దెబ్బను తప్పించు కొండి.