బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో చాటింగ్.. సుఖేష్ చంద్రశేఖర్ లేఖతో సంచలనం
posted on Apr 12, 2023 @ 4:24PM
సుఖేష్ చంద్రశేఖర్ సంచలనాలకు కేంద్ర బిందువుగా మారాడు. మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇప్పటికే పలువురితో తాను చేసిన చాటింగ్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజాగా తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో చేసిన చాటింగ్ ను బయటపెట్టాడు.
ఈ మేరకు జైలు నుంచి విడుదల చేసిన లేఖలో సుఖేఖ్ చంద్రశేఖర్ కల్వకుంట్ల కవితతో తన వాట్సాప్ చాట్ ను బయటపెట్టాడు. ఇప్పటి వరకూ ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా ఆ పార్టీ నాయకులతో చాట్ ను బయటపెట్టిన సుఖేష్ చంద్రశేఖర్ తాజా లేఖతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో తన వాట్సాప్ చాట్‌ను బయటపెట్టడం సంచలనం సృష్ఠించింది. రాజకీయంగా కలకలం రేపింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో తాను చేసిన చాట్ ఇదేనంటూ సుఖేష్ కొన్ని స్క్రీన్ షాట్‌లను బయటపెట్టాడు.
కవితక్క - టీఆర్ఎస్ అని సేవ్ చేసుకున్న నంబర్ తో సుఖేష్ చంద్రశేఖర్ చాట్ చేశాడు. ఏకే, ఎస్‌జే, ఏపీ, సిస్టర్ పేర్లతో కోడ్ భాషలో కల్వకుంట్ల కవితతో చాట్ చేసినట్లు సుఖేష్ ఆ లేఖలో పేర్కొన్నాడు. 15కేజీల నెయ్యి డెలివరీ చేశానని కోడ్ భాషలో సుఖేష్ పేర్కొన్నట్లు ఆ చాట్ స్క్రీన్ షాట్ ద్వారా తెలుస్తోంది. అలాగే ప్యాకెట్ అందజేస్తానని ఏజే చెప్పారని చాట్‌లో సుఖేష్ పేర్కొన్నాడు. 98101 54102 నెంబర్‌తో సుఖేష్ చాటింగ్ చేశాడు. సుఖేష్ లేఖ మొత్తం 6 పేజీలు ఉంది.