చత్తీస్ గడ్ లో వరుస షాక్ లు ... మరో భారీ ఎన్ కౌంటర్ లో నేలకొరిగిన 12 మంది మావోయిస్టులు
posted on May 11, 2024 @ 11:53AM
ఛత్తీస్ గడ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది. బీజాపూర్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో 12 మంది మావోయిస్టులు నేలకొరిగారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. భారీగా ఆయుధాలను, విప్లవసాహిత్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారని సమాచారం. మృతి చెందిన వారిలో అగ్రనేతలు కూడా ఉన్నారని తెలిసింది. వరస దెబ్బలు... మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పీడియా ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
వరస దెబ్బలు... మావోయిస్టులకు ఇటీవల వరస దెబ్బలు తగులుతున్నాయి. ఇటీవల కాలంలో వరస ఎన్ కౌంటర్ లు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు పెద్దయెత్తున గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్టులు కూడా ఎదురు కాల్పులకు పాల్పడ్డారు. పీడియా ప్రాంతంలో ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.
సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న వేళ ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో మరోసారి భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. బీజాపూర్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో 12 మంది నక్సలైట్లు మృతి చెందారు. దీంతో మరోసారి మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లయింది.
తాజాగా ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగలూరు పోలీస్ స్టేషన్ పరిధి పిడియా గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు శుక్రవారం యాంటీ నక్సల్స్ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలోనే మావోయిస్టులు కాల్పులు జరపడంతో.. భద్రతా దళాలు ఎదురు కాల్పులు జరిపాయి. ఈ ఎదురుకాల్పుల్లో 12 మంది మావోయిస్టులు మృతి చెందారు.ఘటనా స్థలం నుంచి ఐదుగురి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. భద్రతా సిబ్బంది సురక్షితంగా ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. స్థానికంగా గాలింపు కొనసాగుతున్నట్లు వెల్లడించారు.కాగా, ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో 29 మంది మావోయిస్టులు మృతి చెందిన విషయం విధితమే. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర చరిత్రలోనే ఇది అతిపెద్ద ఎన్‌కౌంటర్ కావడం గమనార్హం. ఆ తర్వాత ఏప్రిల్ 30న నారాయణ్ పూర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో మరో ఎదురుకాల్పుల ఘటనలో 10 మంది మరణించారు.
గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పిడియా అడవిలో మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలకు సమాచారం అందింది. దీంతో దంతెవాడ, బీజాపుర్ జిల్లాలోని సీఆర్పీఎఫ్, డీఆర్జీ, ఎస్టీఎఫ్ సంయుక్తంగా ఆపరేషన్‌ను చేపట్టాయి. సుమారు 900 మందికిపైగా సైనికులు, మావోయిస్టులను చుట్టుముట్టినట్లు అధికారులు చెబుతున్నారు. ఇందులో మావోయిస్టు అగ్రనేతలు లింగా, పాపారావు కూడా ఉన్నట్లు భావిస్తున్నారు. ఇటీవల ఏప్రిల్ 30న నారాయణ్‌పుర్, కాంకేర్ జిల్లాల సరిహద్దు ప్రాంతంలో జరిగిన మరో ఎన్‌కౌంటర్‌లో 10 మంది మరణించారు. ఇలా ఇప్పటి వరకు బస్తర్ ప్రాంతంలో జరిగిన వివిధ ఎన్కౌంటర్లలో 103 మంది నక్సలైట్లు మరణించారు.